గూస్ బంప్స్ తెప్పిస్తున్న చీకటిలో ట్రైలర్-డైరెక్ట్‌గా ఓటీటీలోకి శోభిత ధూళిపాళ మూవీ-రేప్ చేసి చంపే సైకో కిల్లర్
అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ నాలుగేళ్ల తర్వాత తెలుగు సినిమా చేస్తోంది. సైకో కిల్లర్ స్టోరీతో తెరకెక్కిన చీకటిలో మూవీ డైరెక్ట్ గా ఓటీటీలోకి రానుంది. ఇవాళ రిలీజైన చీకటిలో సినిమా ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
ఓటీటీలోకి డైరెక్ట్ తెలుగు మూవీ రాబోతుంది. అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ హీరోయిన్ గా నటించిన చీకటిలో మూవీ నేరుగా ఓటీటీ రిలీజ్ కానుంది. ఈ మూవీ ట్రైలర్ ను సోమవారం (జనవరి 12) రిలీజ్ చేశారు మేకర్స్. సైకో కిల్లర్ స్టోరీతో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ మూవీ ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. స్టోరీ ఆద్యంతం ఉత్కంఠతో సాగేలా కనిపిస్తోంది.

చీకటిలో ఓటీటీ
శోభిత ధూళిపాళ హీరోయిన్ గా నటించిన అప్ కమింగ్ మూవీ చీకటిలో. నాలుగేళ్ల తర్వాత శోభిత చేస్తున్న ఫస్ట్ తెలుగు సినిమా ఇది. అక్కినేని చైతన్యతో పెళ్లి తర్వాత ఆమె నుంచి రాబోతున్న మొదటి మూవీ కూడా ఇది. చీకటిలో మూవీ డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కానుంది. జనవరి 23, 2026 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది ఈ సైకో క్రైమ్ థ్రిల్లర్.
చీకటిలో ట్రైలర్
సైకో కిల్లర్ చుట్టూ సాగే సీరియల్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ చీకటిలో. ఈ సినిమా ట్రైలర్ ను ఇవాళ రిలీజ్ చేశారు. ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఓ న్యూస్ ఛానెల్ లో సంధ్య (శోభిత) పని చేస్తుంది. కానీ ఆ జాబ్ వదిలేసి సొంతంగా ట్రూ క్రైమ్ స్టోరీస్ చెప్పడానికి ‘చీకటిలో’ అనే పాడ్ కాస్ట్ ను స్టార్ట్ చేస్తుంది.
జంట హత్యలు
పాడ్ కాస్ట్ లో క్రైమ్ స్టోరీస్ గురించి చెప్తుంది సంధ్య. అయితే హైదరాబాద్ లోని ఓ ఇంట్లో జంట హత్యలు జరుగుతాయి. గోదావరి జిల్లాల్లో సీరియల్ కిల్లర్ చేసే హత్యల మాదిరే ఇవి ఉంటాయి. దీంతో ఈ హత్యలను సొంతంగా ఎంక్వైరీ చేస్తూ పాడ్ కాస్ట్ లో చెబుతుంటుంది సంధ్య. ఆ సైకో కిల్లర్ ఆడవాళ్లను రేప్ చేసి చంపుతుంటాడు. ఓ పాటర్న్ ప్రకారం మర్డర్లు చేస్తాడు.
చీకటిలో వచ్చి
ఆ కిల్లర్ చీకటిలో వచ్చి హత్యలు చేస్తుంటాడు. ఈ ఎంక్వైరీలో అదిరే సస్పెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ట్యాగ్ చేశాడనే చంపేశాడు, మరి చీకటిలో చెప్పున్నవాళ్లను ఏం చేస్తాడనే డైలాగ్ ఈ మూవీపై అంచనాలను మరింత పెంచేసేంది. చీకటిలో సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నేరుగా ఓటీటీలోకి రిలీజ్ కానుంది.
చీకటిలో సినిమాలో శోభిత ధూళిపాళ, విశ్వదేవ్ రాచకొండ, చైతన్య వరలక్ష్మి, ఈషా చావ్లా, ఝాన్సీ, ఆమని తదితరులు నటించారు. ఈ సినిమాకు శరణ్ కొప్పిసెట్టి డైరెక్టర్. సురేష్ ప్రొడక్షన్ దీన్ని నిర్మించింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


