King 100: 28 ఏళ్ల తర్వాత.. స్క్రీన్ పై మళ్లీ మ్యాజిక్.. నాగార్జున సినిమాలో టబు.. ఆ కాంబో రిపీట్
King 100: ఎటో వెళ్లిపోయింది మనసు.. అంటూ స్క్రీన్ పై మ్యాజిక్ చేసిన నాగార్జున- టబు 28 ఏళ్ల తర్వాత మళ్లీ మూవీ చేస్తున్నారు. కింగ్ 100 సినిమాలో నటిస్తున్నట్లు స్వయంగా టబు అనౌన్స్ చేసింది. దీంతో ఈ మూవీపై ఇంట్రెస్ట్ మరింతగా పెరిగిపోయింది.
King 100: కింగ్ నాగార్జున కెరీర్ లో మైల్ స్టోన్ అయిన 100 మూవీ నుంచి ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఊహాగానాలను నిజం చేస్తూ ఈ సినిమాలో నాగార్జునతో కలిసి నటించనున్నట్లు సీనియర్ హీరోయిన్ టబు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో నాగార్జున-టబు జోడీ మరోసారి స్క్రీన్ పై మ్యాజిక్ చేయడానికి రెడీ అయింది.

కింగ్ 100
అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న 100వ సినిమా ఇప్పుడు తెరకెక్కుతోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దీనికి రా. కార్తీక్ డైరెక్టర్. అయితే ఈ మూవీ గురించి ఇన్ని రోజులూ ఎలాంటి అప్ డేట్ రాలేదు. ఇప్పుడు సడెన్ గా ఈ సినిమాలో నటిస్తున్నానని టబు స్వయంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం వైరల్ గా మారింది.
డైరెక్టర్ రియాక్షన్
పెద్ద చెయిర్ పై కింగ్ 100 అనే క్లాప్ బోర్డు ఉన్న ఫొటోను టబు షేర్ చేసింది. ‘కింగ్ 100 మొదలెట్టాం’ అనే క్యాప్షన్ ఇచ్చింది. టబు పోస్టుకు డైరెక్టర్ రా. కార్తీక్ రియాక్టయ్యాడు. ‘‘మేడమ్.. మీతో కలిసి వర్క్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్యూ’’ అని కార్తీక్ ఈ పోస్టుకు కామెంట్ చేశాడు.
ముగ్గురు హీరోయిన్లు
నాగార్జున 100వ సినిమా ‘కింగ్ 100’ అనే వర్కింగ్ టైటిల్ తో రెడీ అవుతోంది. నాగ్ కెరీర్ లోని ఈ స్పెషల్ మూవీలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తారని ఎప్పటి నుంచో ప్రచారం సాగుతోంది. ఈ ముగ్గురిలో టబు కూడా ఒకరనే టాక్ వినిపిస్తూ వచ్చింది. ఇప్పుడు ఈ మూవీలో నటిస్తున్నట్లు టబు కన్ఫామ్ చేసింది.
కింగ్ 100 మూవీలో ఐశ్వర్య రాజేష్ మరో హీరోయిన్ గా చేస్తుందని టాక్. అన్నపూర్ణ బ్యానర్ పై నాగార్జుననే సొంత నిర్మాణంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్.
28 ఏళ్ల తర్వాత
నాగార్జున- టబుది బ్లాక్ బస్టర్ పెయిర్. ‘సిసింద్రీ’ మూవీలో ఓ సాంగ్ కోసం నాగ్, టబు డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత ‘నిన్నే పెళ్లాడతా’ అనే మూవీలో కలిసి నటించారు. ఈ సినిమాలో వీళ్ల కెమిస్ట్రీ అదిరిపోయింది. పండుగా టబు తన క్యూట్ యాక్టింగ్ తో కుర్రాళ్ల మనసులు గెలుచుకుంది. అనంతరం నాగ్, టబు కలిసి ‘ఆవిడా మా ఆవిడే’ సినిమా చేశారు. ఇప్పుడు 28 ఏళ్ల తర్వాత కింగ్ 100 మూవీలో మరోసారి కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


