Bigg Boss 10: బిగ్‌ బాస్ సీజన్ 10 రేసులో స్పోర్ట్స్ యాంకర్.. ఆట, మాటలో సూపర్.. ఆమె వస్తే వార్ వన్ సైడే!

Bigg Boss 10: బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు’ సరికొత్త మైలురాయిని అందుకోబోతోంది. త్వరలోనే ప్రారంభం కానున్న ‘బిగ్ బాస్ సీజన్ 10’ కోసం కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే ప్రముఖ స్పోర్ట్స్ ప్రెజెంటర్ ను బిగ్ బాస్ టీమ్ సంప్రదించినట్లు టాక్.

Published on: Jun 27, 2026, 20:36:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bigg Boss 10: తెలుగు బుల్లితెర వీక్షకులను ఎంతగానో అలరించే బిగ్ బాస్ రియాలిటీ షో ఇప్పుడు తన 10వ సీజన్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తోంది. ఈ ల్యాండ్‌మార్క్ సీజన్‌ను మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త టాస్క్‌లు, క్రేజీ సెలబ్రిటీలతో ఇంట్రెస్టింగ్ గా మార్చాలని మేకర్స్ అనుకుంటున్నారు. అందులో భాగంగానే గ్లామర్, టాలెంట్, మంచి వాక్చాతుర్యం ఉన్న పాపులర్ ముఖాల కోసం అన్వేషణ మొదలుపెట్టారు.

బిగ్‌ బాస్ సీజన్ 10 రేసులో స్పోర్ట్స్ యాంకర్.. ఆట, మాటలో సూపర్.. ఆమె వస్తే వార్ వన్ సైడే! (instagram)
బిగ్‌ బాస్ సీజన్ 10 రేసులో స్పోర్ట్స్ యాంకర్.. ఆట, మాటలో సూపర్.. ఆమె వస్తే వార్ వన్ సైడే! (instagram)

బిగ్ బాస్ 10 లో వింధ్య విశాఖ!

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానెల్‌లో తన యాంకరింగ్‌తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న వింధ్య విశాఖ (Vindhya Vishaka Medapati) ఈసారి హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడీ ప్రచారం ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది. బిగ్ బాస్ 10 తెలుగులోకి ఆమె అడుగుపెట్టడం ఖాయమంటున్నారు.

బిగ్ బాస్ మేకర్స్ సంప్రదింపులు!

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాల ప్రకారం, బిగ్ బాస్ 10 టీమ్ ఇప్పటికే వింధ్య విశాఖను కలిసి ప్రాథమిక చర్చలు జరిపినట్లు సమాచారం. గడిచిన కొన్ని సీజన్లలో కూడా ఆమె పేరు పరిశీలనలోకి వచ్చినప్పటికీ, బిజీ షెడ్యూల్స్ వల్ల కుదరలేదు.

అయితే, ఈ 10వ సీజన్ కోసం మేకర్స్ వింధ్య విశాఖకు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారని, హౌస్‌లో ఆమె ఉంటే షోకు మంచి క్రేజ్ వస్తుందని నమ్ముతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టాక్ నెట్టింట వైరల్‌గా మారడంతో ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు.

వింధ్య విశాఖ కెరీర్

హైదరాబాద్‌కు చెందిన వింధ్య విశాఖ విద్యాభ్యాసం అంతా ఇక్కడే సాగింది. కెరీర్ ప్రారంభంలో న్యూస్ ప్రెజెంటర్‌గా ఆమె తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ‘వీ6 న్యూస్’, ‘హెచ్‌ఎంటీవీ’ వంటి ప్రముఖ న్యూస్ ఛానెల్స్‌లో జర్నలిస్ట్‌గా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఈటీవీ ప్లస్, జీ తెలుగు, మా మ్యూజిక్ వంటి ఛానెళ్లలో ఎంటర్‌టైన్‌మెంట్ షోలు హోస్ట్ చేసింది. అనంతరం ఆడియో లాంచ్‌లకు యాంకరింగ్ చేసి బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.

అదే టర్నింగ్ పాయింట్

వింధ్య కెరీర్‌ను మలుపు తిప్పింది మాత్రం 'స్టార్ స్పోర్ట్స్ తెలుగు' (Star Sports Telugu) ఛానెల్ అనే చెప్పాలి. ఐపీఎల్, ప్రో కబడ్డీ లీగ్, ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్‌ల సమయంలో ఆమె చేసిన హోస్టింగ్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

సాధారణంగా స్పోర్ట్స్ యాంకరింగ్ అనగానే పురుషులదే పైచేయిగా ఉండే రంగంలో, తన అద్భుతమైన క్రీడా విజ్ఞానంతో, స్వచ్ఛమైన తెలుగు స్పష్టతతో వింధ్య తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. దక్షిణాది నుంచి ఐపీఎల్, కబడ్డీ లీగ్‌లను విజయవంతంగా హోస్ట్ చేసిన తొలి మహిళా స్పోర్ట్స్ ప్రెజెంటర్లలో వింధ్య ఒకరు.

హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తే?

బిగ్ బాస్ హౌస్‌లో రాణించాలంటే కేవలం గ్లామర్ మాత్రమే సరిపోదు.. గట్టిగా మాట్లాడగలిగే నైపుణ్యం, మైండ్ గేమ్‌ను అర్థం చేసుకునే తెలివితేటలు ఉండాలి. వింధ్యకు ఇంటర్వ్యూలు చేయడంలో, లైవ్ షోలను హ్యాండిల్ చేయడంలో దశాబ్ద కాలానికి పైగా అనుభవం ఉంది. పైగా క్రీడా నేపథ్యం ఉన్న షోలు చేయడం వల్ల టాస్క్‌లలో కూడా ఆమె చురుగ్గా పాల్గొనే అవకాశం ఉంది. అంతే కాకుండా వింధ్య ఫిట్ నెస్ మెయింటైన్ చేస్తోంది.

ఒకవేళ వింధ్య విశాఖ బిగ్ బాస్ 10 హౌస్‌లోకి అడుగుపెడితే, ఆమె కచ్చితంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వార్ వన్ సైడ్ అవుతుందనే కామెంట్లూ వినిపిస్తున్నాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More