Mad for each other: స్టార్ మా, జియోహాట్‌స్టార్‌లోకి మరో రియాల్టీ షో.. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రోమో.. 10 జంటలు, 10 వారాలు

Mad for each other: స్టార్ మా, జియోహాట్‌స్టార్ లోకి మరో సరికొత్త బోల్డ్ రియాల్టీ షో రాబోతోంది. దీనిపేరు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. కొన్ని రోజుల కిందట ఈ షోని అనౌన్స్ చేసిన స్టార్ మా.. తాజాగా బుధవారం (మార్చి 11) ప్రోమో రిలీజ్ చేసింది.

Published on: Mar 11, 2026, 21:29:23 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు టీవీ, డిజిటల్ తెరపై సరికొత్త సంచలనానికి తెరలేవబోతోంది. రియల్ లైఫ్ జంటల మధ్య సాగే 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' (Mad for Each Other) రియాలిటీ గేమ్ షో ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ మధ్యే విడుదలైన ఈ షో ప్రోమో, అందులోని బోల్డ్ కంటెంట్ చూస్తుంటే ఇది రొటీన్ షోలకు భిన్నంగా ఉండబోతుందని అర్థమవుతోంది.

Mad for each other: స్టార్ మా, జియోహాట్‌స్టార్‌లోకి మరో రియాల్టీ షో.. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రోమో.. 10 జంటలు, 10 వారాలు
Mad for each other: స్టార్ మా, జియోహాట్‌స్టార్‌లోకి మరో రియాల్టీ షో.. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రోమో.. 10 జంటలు, 10 వారాలు

మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రోమో

మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో ప్రోమోను స్టార్ మా బుధవారం (మార్చి 11) తన ఎక్స్ అకౌంట్ లో షేర్ చేసింది. ఇందులోని రియల్ లైఫ్ లోని 10 జంటలను చూపించారు. వాళ్ల మధ్య ప్రేమ, రొమాన్స్, ఎమోషనల్ బాండింగ్ లతో ఈ ప్రోమోను క్రియేట్ చేశారు.

“నిజమైన ఎమోషన్స్ తో ది హౌజ్ ఆఫ్ లవ్ పేలబోతోంది.. ఎలాంటి ఫిల్టర్లు లేవు.. నటనా లేదు. మీకు తెలిసిన జంటలు వాళ్ల అసలైన రూపం చూపించి తాము నిజంగా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అని నిరూపిస్తారు. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ గ్రాండ్ లాంచ్ మార్చి 15న స్టార్ మా, జియోహాట్‌స్టార్ లో” అనే క్యాప్షన్ తో పోస్ట్ చేసింది.

మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ స్ట్రీమింగ్ వివరాలు

మ్యాచ్ ఫర్ ఈచ్ అదర్ షో గ్రాండ్ లాంచ్ మార్చి 15న సాయంత్రం 6 గంటలకు కానుంది. జియోహాట్‌స్టార్ లో అదే రోజు నుంచి స్ట్రీమింగ్ మొదలవుతుంది. ఇక స్టార్ మాలో సోమవారం నుంచి ఆదివారం వరకు ప్రతి రోజూ రాత్రి 10 గంటలకు ఈ షో టెలికాస్ట్ కానున్నట్లు స్టార్ మా వెల్లడించింది. రెండు నిమిషాల నిడివి గల ప్రోమో రియల్ ఎమోషన్స్ తో నిండిపోయింది.

మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో హోస్ట్ ఎవరు?

ఈ క్రేజీ రియాలిటీ షోకు పాపులర్ యాంకర్ శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. తనదైన వాక్చాతుర్యం, స్పాంటేనిటీ, బోల్డ్ ఇమేజ్‌తో శ్రీముఖి ఈ షోకు పర్ఫెక్ట్ ఛాయిస్ అని మేకర్స్ భావిస్తున్నారు. ఆధునిక సంబంధాల్లోని సంక్లిష్టతలు, ప్రేమ, నమ్మకాన్ని పరీక్షించేలా ఈ షో సాగనుంది.

షో కాన్సెప్ట్ ఏంటంటే?

ఈ షో ఫార్మాట్ చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. మొత్తం పది నిజ జీవిత జంటలు ఒక విలాసవంతమైన విల్లాలో కలిసి ఉంటారు. వారి మధ్య అనుబంధం, రొమాన్స్, నమ్మకం, విశ్వసనీయతను పరీక్షించేలా రకరకాల టాస్క్‌లు నిర్వహిస్తారు.

అన్ని సవాళ్లను తట్టుకుని చివరి వరకు నిలిచిన జంట టైటిల్ విజేతగా నిలుస్తుంది. ఈ షో కోసం భారీగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. గ్లామర్, ఎమోషనల్ డ్రామా, గొడవలతో కూడిన ఈ షో తెలుగు ఓటీటీ రంగంలోనే అత్యంత ఖరీదైన షోలలో ఒకటిగా నిలవనుంది.

ఇప్పటికే బిగ్ బాస్ లాంటి షోను తెలుగు ప్రేక్షకుల పరిచయం చేసిన స్టార్ మా.. ఇప్పుడు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ జంటలను ఒక ఇంట్లో ఉంచి అసలుసిసలు గేమ్ ఆడించబోతోంది. మరి ఇది ఎలా ఉండబోతోందో చూడాలి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More