Star Maa Serial: ఏకంగా 1500 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న స్టార్ మా సీరియల్.. ఐదేళ్లుగా తెలుగు వాళ్లను అలరిస్తూ..
స్టార్ మా సీరియల్ (Star maa serial) పాపే మా జీవనజ్యోతి ఏకంగా 1500 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఓ బెంగాలీ సీరియల్ ఆధారంగా తెరకెక్కిన ఈ సీరియల్ ఐదేళ్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూడండి.
తెలుగు ప్రేక్షకులు మంచి ఎమోషనల్ డ్రామాను ఎన్నో ఏళ్లపాటు అయినా ఆదరిస్తారని నిరూపిస్తోంది పాపే మా జీవనజ్యోతి అనే సీరియల్. స్టార్ మాలో 2021 నుంచి ప్రసారమవుతున్న ఈ మెగా సీరియల్ తాజాగా 1500 ఎపిసోడ్లు పూర్తి చేసుకోవడం విశేషం. మరి ఈ సీరియల్ కథేంటి? ఇంతకాలంగా ఎలా అలరిస్తోంది అన్న విశేషాలు ఇక్కడ చూడండి.

పాపే మా జీవనజ్యోతి @ 1500 ఎపిసోడ్లు
స్టార్ మా తమ ఛానెల్లో వచ్చే పాపే మా జీవనజ్యోతి 1500 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న విషయాన్ని గురువారం (ఫిబ్రవరి 26) ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
“1500 ఎపిసోడ్ల మరచిపోలేని జ్ఞాపకాలు, భావోద్వేగాల బంధాలు ఇవి.. పాపే మా జీవనజ్యోతి లక్షలాది మంది మనసులను తాకింది. ప్రేక్షకుల ప్రోత్సాహానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. పాపే మా జీవనజ్యోతి సీరియల్ ను సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ మధ్యాహ్నం 12 గంటలకు చూడండి” అనే క్యాప్షన్ తో పోస్ట్ చేసింది.
ఈ సందర్భంగా 1500 ఎపిసోడ్ల స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. సుఖదు:ఖాల్ని సైతం జయించిన రెండు హృదయాల ప్రయాణం అని ఆ పోస్టర్ పై రాసి ఉంది.
“1500 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకుని ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన పాపే మా జీవనజ్యోతి టీమ్‌కు అభినందనలు” అంటూ మరో ట్వీట్ కూడా చేసింది. ఇందులో సీరియల్లో స్పెషల్ మూమెంట్స్ వీడియోను షేర్ చేసింది.
పాపే మా జీవనజ్యోతి సీరియల్ విశేషాలు
పాపే మా జీవనజ్యోతి సీరియల్ ఏప్రిల్, 2021లో ప్రారంభమైంది. సుమారు ఐదేళ్లుగా ఇది ప్రేక్షకులను అలరిస్తోంది. బెంగాలీ సీరియల్ మా.. తోమే చారా ఘుమ్ ఆషేనా కథ ఆధారంగా ఈ సీరియల్ ను తెలుగులో తెరకెక్కించారు. నిజానికి తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళం భాషల్లోనూ ఇప్పటికే ఈ సీరియల్ ను రీమేక్ చేయడం విశేషం. అయితే స్టార్ మాలో మాత్రమే ఐదేళ్లు, 1500 ఎపిసోడ్లుగా సాగిపోతోంది. బెంగాలీ భాషలో 2009 నుంచి 2014 వరకు ఈ సీరియల్ నడిచింది. రెండు తరాల చుట్టూ తిరిగే స్టోరీ ఇది.
పాపే మా జీవనజ్యోతి స్టోరీ ఇదీ..
జ్యోతి (పల్లవి రామిశెట్టి) తన కూతురు జీవనను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. కానీ ఒక జాతరలో 3 ఏళ్ల వయసున్న జీవనను కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ అయిన పాప మల్లిక అనే మహిళ వద్ద పెరుగుతుంది. అక్కడ ఆమె పేరు 'కుట్టి'. తన అసలు తల్లి కోసం కుట్టి, తన బిడ్డ కోసం జ్యోతి పడే వేదన ఈ కథలో ప్రధానాంశం.
జ్యోతికి తన బిడ్డను దూరం చేయడానికి విలన్లు అనేక కుట్రలు పన్నుతారు. చివరికి 'మల్లి' అనే వేరే అమ్మాయిని తన కూతురుగా జ్యోతి నమ్ముతుంది. ప్రస్తుతం కథ జీవన (హేమశ్రీ), సూరజ్ (సిద్ధార్థ్) చుట్టూ తిరుగుతోంది. జీవన తన అసలు మూలాలను ఎలా కనుక్కుంటుంది? తన తల్లి జ్యోతికి మళ్ళీ ఎలా దగ్గరవుతుంది? అనే ఉత్కంఠభరితమైన మలుపులతో సీరియల్ కొనసాగుతోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


