Rajinikanth Ram: రజనీకాంత్ ధర్మన్‌లో రామ్ పోతినేని.. అనుకోకుండా కన్ఫామ్ చేసిన రాశీ ఖన్నా.. వెంటనే ఫొటో డిలీట్
Rajinikanth Ram: సూపర్ స్టార్ రజినీకాంత్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ధర్మన్’ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఊహించని సంచలన పిక్ లీకైంది. ఈ సినిమాలో రామ్ పోతినేని నటిస్తున్నాడనేది కన్ఫామ్ అయింది. రాశీ ఖన్నా పోస్టు చేసి డిలీట్ చేసిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Rajinikanth Ram: రజినీకాంత్ హీరోగా తమిళ దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెరకెక్కిస్తున్న 'ధర్మన్' షూటింగ్ ప్రస్తుతం మైసూర్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్ విశేషాలను అభిమానులతో పంచుకునే క్రమంలో రాశి ఖన్నా పొరపాటున లీక్ చేసిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది.

ధర్మన్ లో రామ్ పోతినేని
రాశి ఖన్నా షేర్ చేసిన మల్టీ-పిక్ పోస్ట్‌లో ఓ ఫొటోలో రజినీకాంత్, రాశి ఖన్నాలతో పాటు హీరో రామ్ పోతినేని కూడా కనిపించారు. రామ్, రజినీ మధ్యలో రాశీ ఖన్నా ఉంది. ఈ ఫొటో వెంటనే వైరల్ గా మారింది.
ఫ్యాన్స్ వరుసగా స్క్రీన్ షాట్స్ తీసి నెట్టింట షేర్ చేయడంతో రాశి ఖన్నా తక్షణమే ఆ పిక్‌ను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ నుంచి డిలీట్ చేసింది. అయినప్పటికీ, అంతకంటే ముందే స్క్రీన్ గ్రాబ్స్ సోషల్ మీడియాలోకి చేరిపోవడంతో 'ధర్మన్' లో రామ్ పోతినేని యాక్ట్ చేస్తున్నాడన్న దానిపై క్లారిటీ వచ్చేసింది.
ఆసక్తిగా మారిన కాంబో!
చాన్నాళ్లుగా రామ్ పోతినేని 'ధర్మన్' సినిమాలో ఒక పవర్‌ఫుల్ కేమియో లేదా కీలక పాత్ర పోషిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై మూవీ యూనిట్ ఇంకా అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్ మెంట్ చేయలేదు. కానీ ఇప్పుడు రాశి ఖన్నా ఎగ్జైట్మెంట్ లీక్‌తో రామ్ పోతినేని ప్రెజెన్స్ కన్ఫర్మ్ కావడమే కాకుండా, ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుందనే దానిపై సరికొత్త చర్చ మొదలైంది.
ధర్మన్ రిలీజ్ డేట్
ధర్మన్ మూవీని బిగ్ ప్రాజెక్టుగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మైసూర్ షెడ్యూల్‌లోనే రామ్‌పై కీలక దృశ్యాలు చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది. అనిరుధ్ ఇస్తున్న మాస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు, రజినీ-రామ్ కాంబినేషన్ తోడైతే థియేటర్లు షేక్ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ మూవీ 2027 సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.
తెలుగు మార్కెట్ లెక్కలే వేరు
ఇటీవలి కాలంలో కోలీవుడ్ బిగ్ ప్రాజెక్టులలో తెలుగు నటుల కేమియోలు లేదా మల్టీస్టారర్ కాంబినేషన్లు వ్యాపార పరంగా చాలా కీలకంగా మారాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన రామ్ పోతినేని లాంటి యూత్, మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో నటించడం వల్ల 'ధర్మన్' సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ప్రి-రిలీజ్ బిజినెస్ పరంగా భారీ అడ్వాంటేజ్ లభించనుంది.
దర్శకుడు అశ్వత్ మారిముత్తు గత చిత్రాల మాదిరిగానే ధర్మన్ ను కూడా నయా ఎమోషన్స్, ఎనర్జీతో కథతో నడిపించనున్నారని టాక్. రజినీతో పాటు రామ్ పోతినేనిని ఆయన ఎలా ప్రజెంట్ చేయబోతున్నారనేది ట్రేడ్ వర్గాల్లో పెద్ద ఆసక్తిని రేకెత్తిస్తోంది. 2027 సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ బిగ్ ప్రాజెక్ట్‌కి ఈ లీక్ ఓ రకంగా ప్రమోషన్స్ పరంగా అనుకోకుండా దక్కిన అతిపెద్ద మైలేజ్ అని చెప్పొచ్చు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


