Ram Pothineni: రియల్ హీరో రామ్ పోతినేని..అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని కోసం ఏం చేశాడంటే? సెల్యూట్ కొట్టాల్సిందే!

Ram Pothineni: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రియల్ హీరో అనిపించుకున్నారు. అరుదైన జెనెటిక్ వ్యాధితో పోరాడుతున్న తన అభిమాని పరిస్థితిని తెలుసుకుని వెంటనే స్పందించారు. ఆ కుటుంబానికి కొండంత అండలా నిలబడ్దారు. రామ్ చేసిన పనికి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ హీరోకి సెల్యూట్ కొడుతున్నాడు. 

Published on: Sep 12, 2026, 13:39:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ram Pothineni: టాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని మరోసారి తన మంచి మనసుతో వార్తల్లో నిలిచారు. వెండితెరపై ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్‌లతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న హీరో రామ్. నిజ జీవితంలోనూ తన అభిమాని ఆపదలో ఉన్నాడని తెలిసి వెంటనే స్పందించి రియల్ హీరో అనిపించుకున్నారు.

రియల్ హీరో రామ్ పోతినేని..అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమానికి కోసం ఏం చేశాడంటే? సెల్యూట్ కొట్టాల్సిందే! (x)
రియల్ హీరో రామ్ పోతినేని..అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమానికి కోసం ఏం చేశాడంటే? సెల్యూట్ కొట్టాల్సిందే! (x)

అభిమానికి రామ్ పోతినేని సాయం

తీవ్రమైన మరియు అరుదైన జెనెటిక్ డిజార్డర్ తో బాధపడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక అభిమాని చికిత్స కోసం రామ్ పోతినేని ముందుకు వచ్చారు. ఆసుపత్రికి అయ్యే పూర్తి వైద్య ఖర్చులను తానే భరిస్తానని హామీ ఇవ్వడంతో పాటు ఇంటికి నిత్యవసర వస్తువులు పంపించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అసలు ఏం జరిగింది?

తూర్పు గోదావరి జిల్లాలోని దుప్పలపూడి గ్రామానికి చెందిన 18 ఏళల్ అమ్మాయి శశికి ఓ అరుదైన జన్యువ్యాధి సోకింది. మతిస్థిమితం కోల్పోయిన ఆమె మంచానికే పరిమితమైంది. అయితే రామ్ పోతినేని పేరు చెప్తే మాత్రం రియాక్టవుతుంది. ఆ హీరో ఫొటోలు చూస్తూ తల్లి తినిపిస్తే శశి అన్నం తింటుంది. ఈ విషయం తెలుసుకున్న రామ్ పోతినేని మనసు కరిగింది.

వీడియో కాల్ తో

సోషల్ మీడియా ద్వారా శశి గురించి తెలుసుకున్న వెంటనే రామ్ పోతినేని రంగంలోకి దిగారు. ఆ అమ్మాయితో వీడియో కాల్ లో మాట్లాడారు. ఆమె చికిత్సకు అవసరమైన మందులు, నిత్యవసర సరుకులు, పౌష్టిక ఆహారంతో పాటు తన కళ్లజోడును కూడా బహుమతిగా పంపించాడు. తాజాగా రామ్ పోతినేని అభిమానులు ఈ వస్తువులను శశి కుటుంబానికి అందించారు.

ట్రీట్మెంట్ కూడా

శశి కుటుంబానికి రామ్ పొోతినేని అండగా నిలిచారు. శశి వైద్య ఖర్చులను కూడా తానే భరిస్తానని రామ్ చెప్పడం వైరల్ గా మారింది. అతని మంచి మనసుపై మరోసారి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఈ విషయం బయటకు రావడంతో ఎక్స్, ఇన్ స్టాగ్రామ్ వేదికగా అభిమానులు, సాధారణ నెటిజన్లు రామ్ పోతినేనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. "ఎనర్జెటిక్ స్టార్ విత్ ఎ గోల్డెన్ హార్ట్’’ అని, ‘‘మా హీరో బంగారం’’ అని కామెంట్లు పెడుతున్నారు.

సొంత డైరెక్షన్ లో

రామ్ పోతినేనికి కొంతకాలంగా సరైన హిట్ లేదు. దీంతో ఆయనే స్వయంగా మెగాఫోన్ పట్టుకొని రంగంలోకి దిగారు. తన నెక్స్ట్ మూవీలో హీరోగా నటించడంతో పాటు డైరెక్షన్ కూడా చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీలో హీరోయిన్ సంయుక్త మీనన్ కీ రోల్ ప్లే చేస్తుందని మూవీ టీమ్ ప్రకటించింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More