Ram Pothineni: బర్త్‌డే సర్‌ప్రైజ్.. డైరెక్టర్‌గా మారిన రామ్ పోతినేని.. ఫస్ట్ లుక్ తోనే సెన్సేషన్!
Ram Pothineni: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్‌లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. తన 23వ సినిమాకు తనే దర్శకుడిగా మారుతూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు ఈ హీరో. ఈ మూవీ నుంచి 'వీర'గా రామ్ ఊరమాస్ లుక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
Ram Pothineni: తెలుగు చిత్రసీమలో 'ఎనర్జిటిక్ స్టార్'గా తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్న హీరో రామ్ పోతినేని. వెండితెరపై అతను వేసే స్టెప్పులు, పండించే కామెడీ, చూపించే యాక్షన్.. ఇలా ప్రతి దాంట్లోనూ ఒక వైవిధ్యం ఉంటుంది. ఇన్ని రోజులూ హీరోగా అలరించిన రామ్ పోతినేని.. ఇప్పుడు మెగా ఫోన్ పట్టాడు. తన కొత్త సినిమాకు తానే డైరెక్షన్ చేస్తూ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నాడు.

డైరెక్టర్ గా రామ్ పోతినేని
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని డైరెక్టర్ గా మారాడు. తన 23వ సినిమా కోసం మెగాఫోన్ పట్టాడు. తానే హీరోగా నటిస్తున్న మూవీకి దర్శకత్వం వహించడంతో పాటు కథ కూడా రామ్ పోతినేనినే అందిస్తున్నాడు. రాపో23 (rapo23) అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇవాళ (మే 15) రామ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ రివీల్ చేశారు.
'వీర'గా మాస్ లుక్
రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే రామ్ ఎంతటి పకడ్బందీ కథతో వస్తున్నాడో అర్థమవుతోంది. ఇందులో రామ్ 'వీర' అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. పోస్టర్‌లో రామ్ వెనక్కి తిరిగి ఉన్నప్పటికీ, ఆ కటౌట్ చూస్తుంటేనే ఒక రకమైన తిరుగుబాటు కనిపిస్తోంది.
లెదర్ జాకెట్ ధరించి, సరికొత్త 'V' కట్ హెయిర్ స్టైల్‌తో రామ్ లుక్ చాలా రఫ్ అండ్ టఫ్ గా ఉంది.వీటన్నింటికీ మించి 'ది స్టోరీ ఆఫ్ ఎ లోన్ వోల్ఫ్' (ఒంటరి వేటగాడి కథ) అనే ట్యాగ్‌లైన్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.
సైకలాజికల్ థ్రిల్లర్
రామ్ పోతినేని కేవలం నటుడిగానే పరిమితం కాకుండా, ఇప్పుడు దర్శకుడి అవతారమెత్తుతున్నాడు. అతని కెరీర్‌లో 23వ చిత్రంగా వస్తున్న #RAPO23 ద్వారా మెగా ఫోన్ పట్టి ఒక సరికొత్త లోకాన్ని ఆవిష్కరించబోతున్నాడు. తన సొంత ఆలోచనల నుంచి పుట్టిన కథకు అతనే దర్శకత్వం వహించడం విశేషం. ఇది ఒక సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ కావడం గమనార్హం. సాధారణంగా కమర్షియల్ ఫార్మాట్ సినిమాలు చేసే రామ్, డైరెక్టర్‌గా తన మొదటి ప్రయత్నానికి ఇలాంటి క్లిష్టమైన జానర్‌ను ఎంచుకోవడం సాహసమనే చెప్పాలి.
కేవలం నటుడిగానే కాకుండా 'ఆంధ్రా కింగ్ తాలూకా' వంటి సినిమాలో సింగర్‌గా, లిరిక్ రైటర్‌గానూ తనలోని మరో కోణాన్ని అభిమానులకు పరిచయం చేశాడు రామ్. అయితే, ఇప్పుడు రామ్ తీసుకున్న ఈ డైరెక్షన్ నిర్ణయం టాలీవుడ్‌ను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది.
నిర్మాణ వివరాలు
ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని రాపో సినిమాటిక్స్ (Rapo Cinematics) బ్యానర్‌పై కృష్ణ పోతినేని నిర్మిస్తున్నారు. నటన, దర్శకత్వంతో పాటు ఈ చిత్రానికి కథను కూడా రామ్ స్వయంగా అందించాడు. జూన్ నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. నటుడి నుంచి దర్శకుడిగా మారుతున్న రామ్ ప్రయాణం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: రామ్ పోతినేని డైరెక్ట్ చేస్తున్న సినిమా పేరు ఏంటి?
జవాబు: ప్రస్తుతం ఈ సినిమాను #RAPO23 అని పిలుస్తున్నారు. ఇందులో రామ్ పోషిస్తున్న పాత్ర పేరు 'వీర'.
ప్రశ్న: ఈ సినిమా ఏ జానర్‌లో ఉండబోతోంది?
జవాబు: ఇది ఒక సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్. రామ్ స్వయంగా ఈ కథను సిద్ధం చేసుకున్నాడు.
ప్రశ్న: సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది?
జవాబు: ఈ చిత్రం జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


