Bad Boy కార్తీక్: సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చేసిన నాగ‌శౌర్య సినిమా.. అక్క కోసం తమ్ముడి పోరాటం..7.2 రేటింగ్

Bad Boy కార్తీక్: వైవిధ్యమైన కథలతో పలకరించే టాలీవుడ్ హీరో నాగశౌర్య నటించిన తాజా చిత్రం ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన ఈ యాక్షన్ డ్రామా ఇప్పుడు అమేజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

Published on: May 15, 2026, 10:54:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bad Boy కార్తీక్: శుక్రవారం వచ్చిందంటే ఓటీటీలో కొత్త సినిమాలో జోష్ ఉంటుంది. ఇవాళ అలాగే సెలైంట్ గా ఓ తెలుగు మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నాగశౌర్య కెరీర్‌లో చాలా కాలంగా వార్తల్లో నిలుస్తూ, పలు వాయిదాల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. ఈ మూవీ ఇవాళ (మే 15) ఓటీటీలోకి అడుగుపెట్టింది.

ఓటీటీలోకి నాగశౌర్య సినిమా (x)
ఓటీటీలోకి నాగశౌర్య సినిమా (x)

బ్యాడ్ బాయ్ కార్తీక్ ఓటీటీ

నాగశౌర్య హీరోగా నటించిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ మూవీ సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ నుంచే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 17, 2026న థియేటర్లలో విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. సినిమా మేకింగ్ పరంగా క్వాలిటీ ఉన్నప్పటికీ, ప్రమోషన్ల విషయంలో చిత్ర యూనిట్ వెనుకబడటం ఈ సినిమాకు పెద్ద మైనస్‌గా మారింది.

థియేటర్లలో ఫ్లాప్

ఏ మూవీకైనా ప్రమోషన్లు చాలా ముఖ్యం. కానీ బ్యాడ్ బాయ్ కార్తీక్ సినిమా విషయంలో ప్రమోషన్లు పెద్దగా కనిపించలేదు. సినిమా విడుదలకు ముందు ప్రేక్షకుల్లో తగినంత బజ్ క్రియేట్ చేయడంలో మేకర్స్ విఫలమయ్యారు. తక్కువ ప్రమోషన్ల కారణంగా ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన విషయం కూడా చాలా మంది సినీ ప్రియులకు తెలియకుండా పోయింది.

రొటీన్ కథ

థియేటర్లలోకి ఇలా వచ్చి, అలా వెళ్లిపోయిన మూవీ బ్యాడ్ బాయ్ కార్తీక్. అసలు ఇది ఎప్పుడు రిలీజ్ అయింది? అని ఆశ్చర్యపోయే సినీ లవర్స్ కూడా ఉన్నారు. ఇక సినిమా చూసిన విమర్శకుల నుంచి కూడా ఈ మూవీకి సానుకూల స్పందన లభించలేదు రొటీన్ కథ,టేకింగ్ అనే విమర్శలు వచ్చాయి. ఫలితంగా కమర్షియల్‌గా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చేతులేత్తేసింది. ఐఎండీబీలో ఈ మూవీకి 7.2 రేటింగ్ ఉంది.

సైలెంట్‌గా డిజిటల్ ఎంట్రీ

థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఎలాంటి హడావిడి లేకుండా బ్యాడ్ బాయ్ కార్తీక్ ఇప్పుడు ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అమేజాన్ ప్రైమ్ వీడియోలో ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ప్రస్తుతం అందుబాటులో ఉంది. థియేటర్లకు వెళ్లని సినీ ప్రేమికులు ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని ఈ సినిమాను వీక్షించవచ్చు. బిగ్ స్క్రీన్‌పై డిజాస్టర్‌గా మిగిలిన ఈ చిత్రం, డిజిటల్ వేదికపై ఎలాంటి ఆదరణ పొందుతుందో వేచి చూడాలి.

డెబ్యూ డైరెక్టర్

ఈ చిత్రంతో రమేష్ దేశిన దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. నాగశౌర్య సరసన విధి యాదవ్ హీరోయిన్‌గా నటించగా, కీలక పాత్రలో వెర్సటైల్ యాక్టర్ సముద్రఖని కనిపించారు. శ్రీ వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌పై అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ సినిమాను రూపొందించారు. నాగశౌర్యకు అక్కగా శ్రీదేవి నటించింది. అక్క కోసం తమ్ముడు చేసే పోరాటం చుట్టూ ఈ మూవీ సాగుతుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

1. ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ సినిమా ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది?

ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.

2. ఈ సినిమా దర్శకుడు ఎవరు?

ఈ చిత్రానికి రమేష్ దేశిన దర్శకత్వం వహించారు. ఇది ఆయనకు మొదటి సినిమా.

3. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు?

ఈ యాక్షన్ డ్రామాలో నాగశౌర్య సరసన విధి యాదవ్ కథానాయికగా నటించింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More