Dhurandhar 2 OTT: ధురంధర్ 2 స్ట్రీమింగ్ ఎక్కడ? ఇండియన్ ఫ్యాన్స్ కు షాకిచ్చిన ప్లాట్ ఫామ్.. విదేశాల్లో ఓటీటీ రిలీజ్
Dhurandhar 2 OTT: అనుకున్నదే అయింది. ధురంధర్ 2 స్ట్రీమింగ్ విషయంలో ఇండియన్ సినీ లవర్స్ కు షాక్ తగిలింది. ఈ మూవీ మన దేశంలో ఇంకా ఓటీటీలోకి రాలేదు. మరోవైపు విదేశాల్లో మాత్రం స్ట్రీమింగ్ స్టార్ట్ అయింది.
Dhurandhar 2 OTT: బాక్సాఫీస్ ను షేక్ చేసి, రికార్డుల మోత మోగించిన ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ కోసం సినీ లవర్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ఎప్పుడెప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుందా? అని ఆత్రుతతో ఉన్నారు. కానీ ఇండియన్ ఓటీటీ ఆడియన్స్ కు షాక్ తప్పలేదు. ఈ మూవీ ఇండియాలో ఇంకా ఓటీటీ రిలీజ్ కాలేదు.

ధురంధర్ 2 ఓటీటీ
ధురంధర్ 2 ఓటీటీ విషయంలో ఇండియన్ మూవీ లవర్స్ కు షాక్ తగిలింది. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇండియాలో ఓటీటీ రిలీజ్ కాలేదు. అదే సమయంలో విదేశాల్లో మాత్రం స్ట్రీమింగ్ షురూ అయింది. ఇతర దేశాల్లో ఓటీటీలోకి వచ్చేసింది ధురంధర్ 2.
రెండు ఓటీటీలు
ధురంధర్ 2 ఓటీటీ రైట్స్ ను రెండు పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ దక్కించుకున్నాయి. నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్ ఈ హక్కులను సొంతం చేసుకున్నాయి. నెట్‌ఫ్లిక్స్ ఏమో ఓవర్సీస్ ఓటీటీ రైట్స్ ను ఖాతాలో వేసుకుంది. అంటే ఇండియా మినహా ఇతర దేశాల్లో ధురంధర్ 2ను నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేస్తోంది. ఇప్పటికే వేరే దేశాల్లో నెట్‌ఫ్లిక్స్‌లో ధురంధర్ 2 రిలీజ్ అయింది.
ఇండియాలో నో రిలీజ్
ఇక జియోహాట్‌స్టార్ విషయానికి వస్తే.. ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఏమో ధురంధర్ 2 మూవీ ఇండియా ఓటీటీ రైట్స్ ను కొనుగోలు చేసింది. ఇండియాలో మూవీని స్ట్రీమింగ్ చేసే హక్కులను సంపాదించింది. కానీ ఇంకా ధురంధర్ 2 రిలీజ్ కు సంబంధించి జియోహాట్‌స్టార్ నుంచి ఎలాంటి అప్ డేట్ రాలేదు. ఇండియాలో ఇంకా ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ కాలేదు.
అదే కారణమా?
విదేశాల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ధురంధర్ 2 ఇండియాలో జియోహాట్‌స్టార్‌లో రిలీజ్ కాకపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటేమో ఐపీఎల్ 2026. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026 సీజన్ ను జియోహాట్‌స్టార్ స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ధురంధర్ 2ను ఓటీటీలో రిలీజ్ చేస్తే ఐపీఎల్ వ్యూయర్ షిప్ పై ప్రభావం పడుతుందని జియోహాట్‌స్టార్ భావించినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఇప్పటికీ థియేటర్లలో ధురంధర్ 2 షోలు వేస్తున్నారు. మార్చి 19, 2026న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు ఇంకా కొన్ని చోట్ల మంచి రెస్పాన్స్ వస్తోంది. అందుకే ఇండియాలో లాంగ్ థియేటర్ రన్ కోసమని ఇప్పుడే ఓటీటీ రిలీజ్ చేయలేదని అంటున్నారు. మరి ఇండియాలో ఓటీటీ స్ట్రీమింగ్ పై అప్ డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


