Dhurandhar 2 OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి ధురంధర్ 2.. స్ట్రీమింగ్ లో ట్విస్ట్..ఇండియన్ ఫ్యాన్స్ కు వెయిటింగ్ తప్పదా?
Dhurandhar 2 OTT: బాక్సాఫీస్ వద్ద రూ.1800 కోట్లకు పైగా వసూళ్లతో చరిత్ర సృష్టించిన రణ్‌వీర్ సింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ధురంధర్ 2' ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్ కు రాబోతున్న ఈ మూవీ ఓటీటీ రిలీజ్ విషయంలో ట్విస్ట్ నెలకొంది.
Dhurandhar 2 OTT: బాక్సాఫీస్ వద్ద కనీవినీ ఎరుగని రీతిలో వసూళ్ల ప్రభంజనం సృష్టించిన బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ చిత్రం 'ధురంధర్ 2: ది రివెంజ్' ఇప్పుడు డిజిటల్ తెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. థియేటర్లలో రికార్డులను తిరగరాసిన ఈ చిత్రం 'ధురంధర్ ది రివెంజ్ (రా అండ్ అన్ దేఖ)' అనే టైటిల్‌తో ఓటీటీలోకి అడుగుపెడుతోంది.

ధురంధర్ 2 ఓటీటీ
ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ కోసం సినీ లవర్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ మరికొన్ని గంటల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఈ రోజు అర్దరాత్రి 12 గంటల నుంచి ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి రానుంది.
అదే ట్విస్ట్
అయితే ధురంధర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ లో ట్విస్ట్ నెలకొంది. ఈ చిత్రం విదేశీ ఓటీటీ రైట్స్ ను పాపులర్ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఇండియాలో స్ట్రీమింగ్ హక్కులను మరో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ సొంతం చేసుకుంది. అయితే మే 15న ధురంధర్ 2 ఓటీటీలోకి వస్తుందని నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే ప్రకటించింది. కానీ జియోహాట్‌స్టార్ నుంచి ఎలాంటి అనౌన్స్ మెంట్ రాలేదు.
వెయిటింగ్ తప్పదా?
జియోహాట్‌స్టార్ ఓటీటీ నుంచి ఇంకా ధురంధర్ 2 స్ట్రీమింగ్ గురించి ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో ధురంధర్ 2 ఇండియా ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ కు వెయిటింగ్ తప్పదా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్ హోరాహోరీగా సాగుతోంది. దీంతో ధురంధర్ 2ను ఇప్పుడే స్ట్రీమింగ్ చేస్తే ఐపీఎల్ 2026 వ్యూస్ పై ఎఫెక్ట్ పడుతుందని జియోహాట్‌స్టార్ భావిస్తుందని సమాచారం.
ఈ నేపథ్యంలో జియోహాట్‌స్టార్ లో ధురంధర్ 2 మూవీ రిలీజ్ పై సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ చిత్రం ఈ ఓటీటీలోకి వచ్చేస్తుందా? లేదా కొన్ని రోజుల తర్వాత రిలీజ్ చేస్తారా? అన్నది ఈ రాత్రితో తేలిపోతుంది.
అదనపు ఫుటేజీతో
ఓటీటీ వెర్షన్ విషయంలో ధురంధర్ 2 చిత్ర బృందం ఒక సర్ ప్రైజ్ ప్లాన్ చేసినట్లు సమాచారం. థియేటర్లో చూసిన వెర్షన్ కంటే అదనపు సీన్లతో కలిపి మొత్తం 3 గంటల 52 నిమిషాల 24 సెకన్ల నిడివితో ఈ సినిమా రాబోతోంది. అంటే థియేటర్లలో సెన్సార్ వల్ల కట్ అయిన సీన్లు, అన్ సెన్సార్ కట్ కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది. ఈ చిత్రం 4K ఫార్మాట్, డాల్బీ 5.1 ఆడియో సపోర్ట్‌తో లభ్యం కానుంది.
కథా నేపథ్యం
దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ అదరగొట్టాడు. ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, సారా అర్జున్ వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. గతేడాది విడుదలైన మొదటి భాగం ఎక్కడ ముగిసిందో, అక్కడి నుండే ఈ సీక్వెల్ కథ మొదలవుతుంది.
ముంబై 26/11 దాడులకు ప్రతీకారం తీర్చుకునే క్రమంలో ఒక భారతీయ ఇంటెలిజెన్స్ అధికారి పాకిస్థాన్ లోని కరాచీకి వెళ్లి అక్కడి క్రిమినల్ నెట్‌వర్క్‌లను ఎలా అంతం చేశాడనేది ఈ సినిమా కథాంశం. దేశ భద్రత, రాజకీయ అంశాల చుట్టూ సాగే ఈ కథ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తుంది.
రికార్డుల వేటలో
మార్చి 19న విడుదలైన 'ధురంధర్ 2' కేవలం మొదటి వారంలోనే రూ.1000 కోట్ల మార్కును దాటి అందరినీ ఆశ్చర్యపరిచింది. టోటల్ రన్ లో ఈ సినిమా రూ. 1800 కోట్లకు పైగా వసూలు చేసి, భారతీయ చలనచిత్ర చరిత్రలో రెండో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. బాహుబలి, కల్కి 2898 ఏడీ, యానిమల్, పుష్ప వంటి బిగ్గెస్ట్ హిట్లను ఈ సినిమా అధిగమించడం విశేషం. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
1. ధురంధర్ 2 ఓటీటీలో ఏ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉంటుంది?
ధురంధర్ 2 మూవీ విదేశాల్లో అయితే నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది. ఇండియాలో అయితే దీని ఓటీటీ పార్ట్ నర్ జియోహాట్‌స్టార్.
2. థియేటర్ వెర్షన్ కంటే ఓటీటీ వెర్షన్ భిన్నంగా ఉంటుందా?
అవును, ఓటీటీ వెర్షన్ సుమారు 3 గంటల 52 నిమిషాల నిడివితో ఉంటుంది. ఇందులో థియేటర్లలో ప్రదర్శించని అదనపు సీన్లు (Uncensored Cut) ఉండే అవకాశం ఉంది.
3. ఈ సినిమా ఏయే భాషల్లో స్ట్రీమింగ్ కానుంది?
ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


