Dhurandhar 2 OTT: వెయిటింగ్ ఓవర్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ధురంధర్ 2.. ఒకే రోజు రెండు ఓటీటీల్లో.. ఎప్పుడంటే?

Dhurandhar 2 OTT: సినిమా లవర్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ వచ్చేసింది. ఈ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఒకే రోజు రెండు ఓటీటీల్లోకి రానుంది. ఫ్యాన్స్ డబుల్ ట్రీట్ అందించనుంది.

Published on: May 8, 2026, 11:56:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Dhurandhar 2 OTT: ఇంకెప్పుడు అంటూ ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు, సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. వాళ్ల నిరీక్షణకు తెరదించే రోజు త్వరలోనే రాబోతుంది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన స్పై యాక్షన్ థ్రిల్లర్ డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ వచ్చింది.

ధురంధర్ 2లో ర‌ణ్‌వీర్ సింగ్‌ (x)
ధురంధర్ 2లో ర‌ణ్‌వీర్ సింగ్‌ (x)

ధురంధర్ 2 ఓటీటీ

ర‌ణ్‌వీర్ సింగ్‌ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ పై ఇన్ని రోజులూ చాలా పుకార్లు వినిపించాయి. స్ట్రీమింగ్ డేట్ పై ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పుడు ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ మే 15, 2026న డిజిటల్ డెబ్యూ చేయనుంది. అదే రోజు ఓటీటీలోకి అడుగుపెట్టనుంది.

రెండు ఓటీటీల్లో

ధురంధర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ లో మరో ట్విస్ట్ నెలకొంది. ఈ సినిమా ఒక ఓటీటీలో కాదు ఒకే రోజు రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అయిన నెట్‌ఫ్లిక్స్‌, జియోహాట్‌స్టార్‌లో ధురంధర్ 2 రిలీజ్ కానుంది. ఇండియాలోనేమో జియోహాట్‌స్టార్‌లో ధురంధర్ 2 విడుదల కానుంది. ఇక ఇండియా మినహా మిగతా దేశాల్లో నెట్‌ఫ్లిక్స్‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది.

తెలుగులోనూ

ధురంధర్ 2 మూవీ తెలుగులోనూ ఓటీటీలోకి రానుంది. ఒరిజినల్ హిందీతో పాటు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ లాంటి ప్రాంతీయ భాషల్లోనూ ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ అవుతుంది. అంతే కాకుండా మూవీ థియేటర్ వర్షన్ కాకుండా రా అండ్ అన్ కట్ వర్షన్ ను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. అంటే థియేటర్లలో మూవీలో చూడని సీన్లు కూడా ఓటీటీలో చూడొచ్చన్నమాట.

బ్లాక్ బస్టర్

2025 చివర్లో రిలీజై సంచలనం క్రియేట్ చేసిన ధురంధర్ మూవీకి సీక్వెల్ గా ధురంధర్ 2 వచ్చింది. ఈ చిత్రం మార్చి 19, 2026న రిలీజైంది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది. అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీస్ లిస్ట్ లో బాహుబలి 2ను దాటి ధురంధర్ 2 సెకండ్ ప్లేస్ కు చేరుకుంది. ఫస్ట్ ప్లేస్ లో ‘దంగల్’ ఉంది.

ఆదిత్య ధర్ దర్శకత్వంలో ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ధురంధర్ 2 తెరకెక్కింది. ఇందులో ర‌ణ్‌వీర్ సింగ్‌, సారా అర్జున్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్.మాధవన్ తదితరులు నటించారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More