Ranveer Singh: ధ్రువ్ రాఠీకి ర‌ణ్‌వీర్ సింగ్‌ కౌంటర్? నెట్టింట వైరల్ అవుతున్న కొత్త యాడ్ వెనుక అసలు కథ ఇదే!

Ranveer Singh: ప్రముఖ నటుడు ర‌ణ్‌వీర్ సింగ్‌, మామ ప్రకాష్ పదుకొణె కలిసి నటించిన కొత్త యాడ్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి ర‌ణ్‌వీర్ సింగ్‌ ఈ యాడ్ ద్వారా గట్టి కౌంటర్ ఇచ్చారని ఫ్యాన్స్ అంటున్నారు.

Published on: Apr 15, 2026, 10:14:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ranveer Singh: బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్‌ వెండితెరపైనే కాదు, ఆఫ్ స్క్రీన్ అడ్వర్టైజ్‌మెంట్లలో కూడా దూకుడు చూపిస్తుంటాడు. తాజాగా తన మామ, బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాష్ పదుకొణెతో కలిసి అతను చేసిన 'రూపే' (RuPay) యాడ్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

యాడ్ లో ప్రకాష్ పదుకొణె, ర‌ణ్‌వీర్ సింగ్‌
యాడ్ లో ప్రకాష్ పదుకొణె, ర‌ణ్‌వీర్ సింగ్‌

ధ్రువ్ రాఠీకి కౌంటర్

ర‌ణ్‌వీర్ సింగ్‌, ప్రకాష్ పదుకొణె కలిసి నటించిన రూపే యాడ్ వీడియో వైరల్ గా మారింది. కేవలం ఆ యాడ్ బాగుందని మాత్రమే కాదు, అందులో ఒక సన్నివేశం ద్వారా ర‌ణ్‌వీర్ సింగ్‌.. ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి పరోక్షంగా చురకలు అంటించారనే చర్చ జోరుగా సాగుతోంది.

ఆ పోస్టర్ వెనుక

ఈ యాడ్‌లో ర‌ణ్‌వీర్ సింగ్‌, ప్రకాష్ పదుకొనే ఒక సినిమా థియేటర్ వద్ద టిక్కెట్లు, పాప్‌కార్న్ కొంటూ కనిపిస్తారు. ఎక్కడైనా, ఏ సమయంలోనైనా రూపే యాప్ ద్వారా పేమెంట్ చేయవచ్చని ర‌ణ్‌వీర్ సింగ్‌ వివరిస్తుంటాడు. అయితే, నెటిజన్ల కన్ను వారి వెనుక ఉన్న ఒక సినిమా పోస్టర్‌పై పడింది.

ఆ పోస్టర్‌పై ర‌ణ్‌వీర్ సింగ్‌ ఫోటోతో పాటు 'భవందర్' (Bhavandar) అని రాసి ఉంది. ఇది చూసిన వెంటనే నెటిజన్లు ఆ పేరును ధ్రువ్ రాఠీ విమర్శలతో ముడిపెడుతున్నారు.

ధ్రువ్ రాఠీ వర్సెస్ ధురంధర్

అసలు ఈ 'భవందర్' అనే పేరుకు, ధ్రువ్ రాఠీకి సంబంధం ఏమిటంటే.. ర‌ణ్‌వీర్ సింగ్‌ నటించిన 'ధురంధర్' చిత్రాలపై ధ్రువ్ రాఠీ గతంలో తీవ్ర విమర్శలు చేశాడు. 'ధురంధర్', 'ధురంధర్: ది రివెంజ్' సినిమాలు అధికార పార్టీకి అనుకూలంగా చేస్తున్న 'ప్రొపగండా' అని ఆయన ఆరోపించాడు.

ఒక కల్పిత చిత్రం పేరును 'ఆపరేషన్ భవందర్' అని ఉదహరిస్తూ.. ఇలాంటి సినిమాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తాయని తన వీడియోల్లో పేర్కొన్నాడు. ఇప్పుడు అదే పేరును ర‌ణ్‌వీర్ సింగ్‌ తన యాడ్‌లో పోస్టర్‌గా వాడటం యాదృచ్ఛికం కాదని, అది ధ్రువ్ రాఠీకి ఇచ్చిన గట్టి సమాధానమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

సోషల్ మీడియాలో సెటైర్లు

ఈ యాడ్ చూసిన నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ర‌ణ్‌వీర్ సింగ్‌ను ప్రశంసిస్తున్నారు. "ర‌ణ్‌వీర్ సింగ్‌ చాలా తెలివిగా ధ్రువ్ రాఠీని ట్రోల్ చేశాడు" అని ఒకరు కామెంట్ చేయగా, "ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇంత గట్టిగా కౌంటర్ ఇవ్వడం ర‌ణ్‌వీర్ సింగ్‌కు మాత్రమే సాధ్యం" అని మరొకరు రాసుకొచ్చారు. "ఈ జోక్ చాలా డీప్‌గా ఉంది.. భవందర్ సినిమా పోస్టర్ చూస్తుంటే నవ్వు ఆగడం లేదు" అంటూ ఫ్యాన్స్ మీమ్స్ షేర్ చేస్తున్నారు.

ధురంధర్ బాక్సాఫీస్ ప్రభంజనం

ర‌ణ్‌వీర్ సింగ్‌ నటించిన 'ధురంధర్: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం నాలుగు వారాల్లోనే దేశీయంగా రూ.1,000 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.1,700 కోట్ల వసూళ్లను సాధించింది.

భారతీయ సినిమా చరిత్రలో నెట్ కలెక్షన్ల పరంగా రూ. 1,000 కోట్లు దాటిన తొలి బాలీవుడ్ చిత్రంగా ఇది చరిత్ర సృష్టించింది. ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ వంటి భారీ తారాగణం ఉన్న ఈ సినిమాపై విమర్శలు వచ్చినా, ప్రేక్షకులు మాత్రం బ్రహ్మరథం పడుతున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

  1. ర‌ణ్‌వీర్ సింగ్‌ యాడ్‌లో 'భవందర్' అనే పేరుకు ప్రాముఖ్యత ఏమిటి?

ర‌ణ్‌వీర్ సింగ్‌ నటించిన 'ధురంధర్' సినిమాను విమర్శిస్తూ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ 'ఆపరేషన్ భవందర్' అనే పదాన్ని వాడాడు. దానికి కౌంటర్‌గా ర‌ణ్‌వీర్ సింగ్‌ తన కొత్త యాడ్‌లో అదే పేరుతో ఒక సినిమా పోస్టర్‌ను ప్రదర్శించాడు.

2. 'ధురంధర్: ది రివెంజ్' సినిమా సాధించిన రికార్డులు ఏమిటి?

ఈ చిత్రం దేశీయంగా రూ.1,000 కోట్లు వసూలు చేసిన మొదటి బాలీవుడ్ సినిమాగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1,700 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

3. ర‌ణ్‌వీర్ సింగ్‌ తదుపరి చిత్రం ఏమిటి?

ర‌ణ్‌వీర్ సింగ్‌ త్వరలో జై మెహతా దర్శకత్వంలో 'ప్రళయ్' అనే భారీ యాక్షన్ చిత్రంలో నటించనున్నాడు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More