Dhruv Rathee: ధురంధర్ 2పై ధ్రువ్ రాథీ సంచలన వ్యాఖ్యలు! వాట్సాప్ ఫార్వర్డ్స్ కథ అంటూ ఫైర్.. పోయిన ఆ ప్రాణాలను చూపించరా?

Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాథీ మరోసారి 'ధురంధర్ 2' సినిమాపై తీవ్ర విమర్శలు చేశాడు. దీన్ని 'వాట్సాప్ ఫార్వర్డ్స్' సినిమాగా అభివర్ణిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Published on: Mar 27, 2026, 11:29:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రణ్‌వీర్ సింగ్ లీడ్ రోల్ ప్లే చేసిన 'ధురంధర్ 2' చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. అయితే ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాథీ తన లేటెస్ట్ వీడియో 'ధురంధర్ 2 ఎక్స్పోజ్డ్' లో ఈ సినిమాపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. గతంలో ఈ చిత్రాన్ని 'బ్రెయిన్‌రాట్' అని పిలిచిన రాథీ, ఇప్పుడు దేశ చరిత్రను, ప్రజల అనుభవాలను ఈ సినిమా తప్పుగా చూపిస్తోందని ఆరోపించాడు.

ధురంధర్ 2పై మరోసారి విరుచుకుపడ్డ ధ్రువ్
ధురంధర్ 2పై మరోసారి విరుచుకుపడ్డ ధ్రువ్

వాట్సాప్ ఫార్వర్డ్స్ నుంచి పుట్టిన సినిమా?

ధురంధర్ 2 దర్శకుడు ఆదిత్య ధర్ పై ధ్రువ్ రాథీ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. "ఆదిత్య ధర్ వాట్సాప్ ఫార్వర్డ్‌ల ఆధారంగా ఒక సినిమాటిక్ విశ్వాన్ని సృష్టించాడు" అని ధ్రువ్ ఎద్దేవా చేశాడు.

చీట్ కోడ్

ధురంధర్ 2 సినిమా ప్రారంభంలో 'నిజ జీవిత సంఘటనల నుంచి ప్రేరణ పొందింది' అని వేసే డిస్‌క్లైమర్‌ పై ధ్రువ్ రాథీ విరుచుకుపడ్డాడు. దీని బదులుగా 'వాట్సాప్ ఫార్వర్డ్‌ల నుంచి ప్రేరణ పొందింది' అని వేస్తే మరింత కరెక్ట్ గా ఉంటుందని విమర్శించాడు. ఈ డిస్‌క్లైమర్‌ను ఒక 'చట్టపరమైన చీట్ కోడ్' గా ధ్రువ్ పేర్కొన్నాడు.

నోట్ల రద్దు

ఈ సినిమాలో నోట్ల రద్దు (Demonetization) ప్రక్రియను ఒక మాస్టర్‌స్ట్రోక్‌గా చూపించడాన్ని ధ్రువ్ తీవ్రంగా తప్పుబట్టాడు. ఆర్‌బీఐ రిపోర్ట్స్, పరిశోధనాత్మక కథనాలను ఉదాహరణగా చూపుతూ, వాస్తవ పరిస్థితి చాలా భిన్నంగా ఉందని అతను వాదించాడు.

నోట్ల రద్దు సమయంలో ఏటీఎం క్యూలలో నిలబడి ప్రాణాలు కోల్పోయిన సామాన్య ప్రజల కష్టాలను ఈ సినిమా మర్చిపోయిందని ధ్రువ్ ఫైర్ అయ్యాడు. కేవలం ఒక రాజకీయ నాయకుడిని ప్రోత్సహించడానికి నిజాలను అబద్ధాలతో కలిపారని అతను ఆరోపించాడు.

సుప్రీంకోర్టుకు ప్రశ్న

ఒక జాతీయ రాజకీయ పార్టీని దేశ వ్యతిరేక పార్టీగా చూపిస్తూ ఇలాంటి సినిమాలు తీయడానికి అనుమతి ఉందా అని ఎన్నికల సంఘాన్ని, సుప్రీంకోర్టును ధ్రువ్ రాథీ ప్రశ్నించాడు. భవిష్యత్తులో ఇవే పద్ధతులను ఉపయోగించి ఇతర పార్టీలకు వ్యతిరేకంగా కూడా సినిమాలు తీసే ప్రమాదం ఉందన్నాడు. ఈ సినిమా కేవలం ఒక గూఢచారి థ్రిల్లర్ మాత్రమే కాదు, ఒక రాజకీయ ఎజెండా అని అతను అభిప్రాయపడ్డాడు.

ధురంధర్ హవా

ఇన్ని విమర్శలు ఉన్నప్పటికీ రణ్‌వీర్ సింగ్, ఆర్.మాధవన్, అక్షయ్ ఖన్నా వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసింది. కరాచీ అండర్ వరల్డ్‌లో చొరబడిన ఒక భారతీయ గూఢచారి కథగా ప్రేక్షకులు దీన్ని ఆదరిస్తున్నారు. కానీ ధ్రువ్ రాథీ వంటి విమర్శకులు మాత్రం సినిమాలోని రాజకీయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More