Nayanthara: నాకు నయనతార కావాలి.. మీరు ఆ కోరిక తీరుస్తారా?: ఎంపీ వివాదాస్పద కామెంట్స్‌పై భగ్గుమన్న ఆర్టిస్ట్స్ అసోసియేషన్

Nayanthara: నాకు నయనతార కావాలంటూ ఏఐఏడీఎంకే ఎంపీ షణ్ముగం చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. మహిళల రక్షణ కోసం జరిపిన ర్యాలీలోనే ఆయన ఈ కామెంట్స్ చేయడంపై సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తీవ్రంగా స్పందించింది.

Mar 17, 2026, 20:34:29 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) వార్తల్లో నిలుస్తోంది. మహిళల భద్రత కోసం జరిగిన ఒక ర్యాలీలో ఏఐఏడీఎంకే ఎంపీ సీవీ షణ్ముగం (C Ve Shanmugam) ఆమెను ఉద్దేశించి చేసిన ఒక కామెంట్ పెద్ద కాంట్రవర్సీకి దారితీసింది. దీనిపై అధికార డీఎంకే పార్టీ కూడా సీరియస్‌గా రియాక్ట్ అయింది. విల్లుపురంలో జరిగిన ఒక ఏఐఏడీఎంకే నిరసన కార్యక్రమంలో షణ్ముగం మాట్లాడుతూ.. "నాకు నయనతార కావాలి, నెరవేరుస్తారా? ఎవరికో నయనతారను పెళ్లి చేసుకోవాలని కల ఉంటే, దాన్ని ముఖ్యమంత్రి తీరుస్తారా?" అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Nayanthara: నాకు నయనతార కావాలి.. మీరు ఆ కోరిక తీరుస్తారా?: ఎంపీ వివాదాస్పద కామెంట్స్‌పై భగ్గుమన్న ఆర్టిస్ట్స్ అసోసియేషన్
Nayanthara: నాకు నయనతార కావాలి.. మీరు ఆ కోరిక తీరుస్తారా?: ఎంపీ వివాదాస్పద కామెంట్స్‌పై భగ్గుమన్న ఆర్టిస్ట్స్ అసోసియేషన్

షణ్ముగం కామెంట్స్‌పై ఫైర్

న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ (ANI) లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. ఎంపీ షణ్ముగం.. నయనతారపై చేసిన ఈ వ్యాఖ్యలను సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (SIAA) తీవ్రంగా తప్పుబట్టింది. ఆ ఎంపీకి డైరెక్ట్‌గా ఒక స్టేట్‌మెంట్ రిలీజ్ చేస్తూ.. ఆయన రీసెంట్ స్పీచ్ వీడియో చూసిన తర్వాత సినిమా ఇండస్ట్రీ సభ్యులందరూ విపరీతమైన కోపంతో ఉన్నారని అసోసియేషన్ పేర్కొంది.

ఆ స్టేట్‌మెంట్‌లో ఇలా రాసుకొచ్చారు. "గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు సీవీ షణ్ముగం గారికి, మీరు రీసెంట్‌గా ఇచ్చిన స్పీచ్‌కు సంబంధించిన అత్యంత అవమానకరమైన, సిగ్గుచేటైన వీడియో మా దృష్టికి వచ్చింది. అప్పటినుంచి సినిమా ఇండస్ట్రీలోని సభ్యులందరూ ఫోన్ల ద్వారా తమ ఆగ్రహాన్ని, అభ్యంతరాలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఎన్నికల టైమ్‌లో రాజకీయ పార్టీలు తమ ఇష్టమొచ్చినట్లు తమ భావజాలాన్ని పంచుకోవచ్చు. కానీ ప్రజలు ఎన్నుకున్న ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవాళ్లు మాట్లాడేటప్పుడు పదాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా, హుందాగా వ్యవహరించాలి" అని అన్నారు.

"కానీ దురదృష్టవశాత్తూ పబ్లిక్ గా అత్యంత అభ్యంతరకరమైన కామెంట్స్ చేశారు. మా కో-స్టార్, నటి నయనతారను మీ స్పీచ్‌లోకి లాగారు. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం" అని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.

‘రాజకీయాల్లో పవర్‌ఫుల్ మహిళలు లేరా?’

సినిమా ఇండస్ట్రీలోని మహిళలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఎస్ఐఏఏ (SIAA) నిలదీసింది. "ఇది మహిళల యుగం. అంతరిక్షంలోకి రాకెట్లు పంపడం దగ్గర్నుంచి.. డాక్టర్లు, టీచర్లు, లాయర్లుగా, భారీ మిషనరీలను ఆపరేట్ చేస్తూ, బస్సులు కూడా నడుపుతూ వాళ్లు లేని రంగం అంటూ ఏదీ లేదు. రాజకీయాల్లో కూడా ఇందిరా గాంధీ, మీ సొంత లీడర్ జయలలిత లాంటి పవర్‌ఫుల్ మహిళలు బెస్ట్ ఎగ్జాంపుల్స్‌గా ఉన్నారు కదా? అలాంటప్పుడు సినిమా ఇండస్ట్రీలోని మహిళల గురించి ఇంత అగౌరవంగా మాట్లాడటం ఏ రకమైన రాజకీయ సంస్కారం? మీ ఐడియాలజీ (సిద్ధాంతం) నేర్పించింది ఇదేనా? ఇలా మాట్లాడమని మీ లీడర్లు మీకు గైడ్ చేశారా, లేక వాళ్లు కూడా ఇలాంటి కామెంట్స్‌ను ఎంకరేజ్ చేస్తున్నారా?" అని అసోసియేషన్ చురకలు అంటించింది.

క్షమాపణలు చెప్పాల్సిందే అని డిమాండ్!

షణ్ముగం వెంటనే క్షమాపణలు చెప్పాలని, భవిష్యత్తులో మహిళల గురించి ఇలా అగౌరవంగా మాట్లాడనని హామీ ఇవ్వాలని అసోసియేషన్ గట్టిగా డిమాండ్ చేసింది. "ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధిగా మీకు ఇంకా ఆ గౌరవం ఉంది కాబట్టి, ఫిల్మ్ ఇండస్ట్రీ సభ్యులమైన మేమంతా ఏకగ్రీవంగా డిమాండ్ చేస్తున్నాం.. మీరు కచ్చితంగా క్షమాపణ చెప్పాలి. భవిష్యత్తులో మా ఇండస్ట్రీకి చెందిన మహిళల గురించి మీరు మళ్లీ ఇలా అగౌరవంగా మాట్లాడరని మాకు హామీ ఇవ్వాలి" అని స్పష్టం చేసింది.

ఇండియన్ సినిమాలో నయనతారను అందరూ 'లేడీ సూపర్ స్టార్' అని పిలుచుకుంటారు. ఆమె తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి మెప్పించింది. ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఆమె ఒకరు. గీతూ మోహన్‌దాస్ డైరెక్షన్‌లో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్' (Toxic) లో నయనతార కనిపించనుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More