Nayanthara: చెన్నైలో రూ.31.5 కోట్లు పెట్టి లగ్జరీ అపార్ట్‌మెంట్ కొన్న నయనతార.. రజనీకాంత్ ఇంటి పక్కనే..
లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara), ఆమె భర్త విఘ్నేష్ శివన్ చెన్నైలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన పోయెస్ గార్డెన్‌లో భారీ డూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. సుమారు ₹31.5 కోట్ల విలువైన ఈ ప్రాపర్టీలో నయనతారకు 90% వాటా ఉండటం విశేషం.
దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరైన నయనతార.. రియల్ ఎస్టేట్ రంగంలో తన పెట్టుబడులను కొనసాగిస్తోంది. తాజాగా చెన్నైలోని విలాసవంతమైన పోయెస్ గార్డెన్ (Poes Garden) ఏరియాలో నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్ ఒక లగ్జరీ డూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను సొంతం చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం ఈ డీల్ విలువ ₹31.5 కోట్లుగా ఉంది.

నయనతార ఆస్తి వివరాలు
సూపర్ స్టార్ రజనీకాంత్ ఉన్న ఏరియాలోనే నయనతార ఈ ఇల్లు కొనడం విశేషం. చెన్నైలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఇదీ ఒకటి. తేనాంపేటలోని 'లెగసీ' (Legacy) ప్రాజెక్ట్‌లో నాలుగు, ఐదవ అంతస్తుల్లో ఈ డూప్లెక్స్ అపార్ట్‌మెంట్ ఉంది. దీని విస్తీర్ణం 14,369 చదరపు అడుగుల సూపర్ బిల్ట్-అప్ ఏరియా కావడం విశేషం. దీని ధర చదరపు అడుగుకు సుమారు ₹21,946. ఈ ఆస్తిలో నయనతారకు 90% వాటా ఉండగా, విఘ్నేష్ శివన్‌కు 10% వాటా ఉంది. ఎనిమిది రిజర్వ్డ్ కార్ పార్కింగ్ స్లాట్లు ఈ అపార్ట్‌మెంట్‌తో పాటు కేటాయించారు.
మిగిలిన సెలబ్రిటీల పక్కనే..
పోయెస్ గార్డెన్ అంటేనే వీవీఐపీల అడ్రస్. ఇక్కడే సూపర్ స్టార్ రజనీకాంత్, దివంగత ముఖ్యమంత్రి జె. జయలలిత నివాసాలు ఉన్నాయి. ఇటీవల నటుడు ధనుష్ కూడా ఇదే ప్రాంతంలో ₹150 కోట్ల విలువైన బంగ్లాను నిర్మించుకుని వార్తల్లో నిలిచారు. ఇప్పుడు నయనతార కూడా అదే ప్రాంతంలో స్థిరపడటం విశేషం.
నయనతార ఇతర ఆస్తులు
నయనతారకు కేరళలోని తన పూర్వీకుల ఇల్లు కాకుండా, హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో సుమారు ₹15 కోట్ల విలువ చేసే రెండు ఇళ్లు ఉన్నట్లు సమాచారం. చెన్నై, కేరళలో కూడా ఆమెకు పలు రియల్ ఎస్టేట్ ఆస్తులు ఉన్నాయి.
నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం, 2025లో చెన్నై నివాస గృహాల ధరలు 7% పెరిగాయి. ముఖ్యంగా ఐటీ రంగం, మెట్రో కనెక్టివిటీ పెరగడం వల్ల పోయెస్ గార్డెన్ వంటి ప్రీమియం ఏరియాల్లో డిమాండ్ నిలకడగా కొనసాగుతోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


