Aishwarya Rai Aaradhya Airport Video: కూతురు ఆరాధ్యకు ఎయిర్‌పోర్టులో సర్‌ప్రైజ్ ఇచ్చిన ఐశ్వర్య రాయ్.. వీడియో వైరల్
Aishwarya Rai Aaradhya Airport Video: తన కూతురు ఆరాధ్య కోసం ఐశ్వర్య రాయ్ ఎయిర్ పోర్టుకు వెళ్లిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తల్లిని చూడగానే ఆరాధ్య ఇచ్చిన రియాక్షన్ పై నెటిజన్లు స్పందిస్తున్నారు.
Aishwarya Rai Aaradhya Airport Video: ఐశ్వర్య రాయ్ బచ్చన్ కేవలం స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు.. ఒక బాధ్యతాయుతమైన తల్లి అని మరోసారి నిరూపించుకున్నారు. స్కూల్ ట్రిప్ నుండి తిరిగి వస్తున్న కూతురు ఆరాధ్యకు ఎయిర్‌పోర్టులో సర్‌ప్రైజ్ ఇచ్చి ఆ క్షణాలను కెమెరాలో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అమ్మగా ఐశ్వర్య సందడి
ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఆమె కుమార్తె ఆరాధ్య బచ్చన్ మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎక్కడికి వెళ్లినా నీడలా వెంట ఉండే ఈ తల్లీకూతుళ్ల బాండింగ్ నెటిజన్ల మనసు గెలుచుకుంటూనే ఉంటుంది.
తాజాగా ఆరాధ్య తన స్కూల్ ట్రిప్ ముగించుకుని తిరిగి వస్తుండగా.. ఐశ్వర్య సాధారణ తల్లిలాగే ఎయిర్‌పోర్టుకు చేరుకుని ఎదురు చూశారు. అక్కడ ఉన్న ఇతర తల్లిదండ్రులతో కలిసి ఆమె వేచి ఉండటం విశేషం.
కెమెరా మెడలో వేసుకుని మరీ..
ఆరాధ్య ఎయిర్‌పోర్టు నుంచి బయటకు రాగానే.. ఐశ్వర్య వెంటనే తన ఫోన్ తీసి ఆ ఆనంద క్షణాన్ని షూట్ చేయడం మొదలుపెట్టారు. తన తల్లిని అక్కడ చూడగానే ఆరాధ్య ఆశ్చర్యంతో ఉబ్బితబ్బిబ్బయిపోయింది. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఐశ్వర్యను గట్టిగా హత్తుకుంది.
ఆ తర్వాత ఆరాధ్య తన స్నేహితులతో కలిసి ఫోటోలు దిగాలనుకోగా, స్వయంగా ఐశ్వర్యనే ఫోటోగ్రాఫర్‌గా మారి వారిని క్లిక్ మనిపించారు. ఈ క్రమంలో ఐశ్వర్య వైట్ షర్ట్, బ్లూ డెనిమ్ జీన్స్‌లో చాలా స్టైలిష్‌గా కనిపించగా, ఆరాధ్య తన స్కూల్ యూనిఫామ్‌లో ఉంది.
రోల్స్ రివర్స్ అయ్యాయి
సాధారణంగా అవార్డు ఫంక్షన్లలో లేదా కేన్స్ వంటి అంతర్జాతీయ వేదికలపై ఐశ్వర్య మెరిసిపోతుంటే, ఆరాధ్య పక్కన నిలబడి గర్వంగా చూస్తుంటుంది. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. కూతురి సంతోషాన్ని చూసి ఐశ్వర్య మురిసిపోవడం అభిమానులను ఆకట్టుకుంటోంది.
దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. "ప్రపంచంలోనే బెస్ట్ మామ్", "స్టార్ హోదా పక్కన పెట్టి కూతురి కోసం ఎంత సాధారణంగా ఉందో" అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు.
పేరెంటింగ్ గురించి అభిషేక్ ఏమన్నారంటే?
తమ పెంపకం గురించి అభిషేక్ బచ్చన్ ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "మేము ఆరాధ్యకు ఏది తప్పు, ఏది ఒప్పని క్లాసులు తీసుకోము. మేము ఎలా నడుచుకుంటున్నామో చూసి తను నేర్చుకుంటుంది. ఆమెకు ఆదర్శంగా ఉండేందుకు మేమిద్దరం ప్రయత్నిస్తాం. ఐశ్వర్య చాలా స్ట్రాంగ్ ఉమెన్.. తనను తాను రక్షించుకోగలదు. అది చూసి ఆరాధ్య కూడా ధైర్యంగా ఉండటం నేర్చుకుంటుంది" అని అభిషేక్ పేర్కొన్నారు. 2007లో వివాహం చేసుకున్న ఈ జంటకు 2011లో ఆరాధ్య జన్మించిన సంగతి తెలిసిందే.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. ఐశ్వర్య రాయ్ ఎయిర్‌పోర్టుకు ఎందుకు వెళ్లారు?
తన కుమార్తె ఆరాధ్య బచ్చన్ స్కూల్ ట్రిప్ నుండి తిరిగి వస్తుండటంతో, ఆమెకు సర్ప్రైజ్ ఇచ్చి ఇంటికి తీసుకెళ్లడానికి ఐశ్వర్య వెళ్లారు.
2. ఆరాధ్య బచ్చన్ వయస్సు ఎంత?
ఆరాధ్య బచ్చన్ 2011లో జన్మించారు. ప్రస్తుతం ఆమెకు 15 ఏళ్లు.
3. ఐశ్వర్య, అభిషేక్ వివాహం ఎప్పుడు జరిగింది?
బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య రాయ్ మరియు అభిషేక్ బచ్చన్ 2007లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


