Ajay Devgn Kajol: సెలబ్రేషన్స్‌లా కాదు అగ్ని ప్రమాదంలా అనిపిస్తోంది: భర్త అజయ్‌కి కాజోల్ సెటైరికల్ బర్త్‌డే విషెస్
Ajay Devgn Kajol: బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ తన 57వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భార్య కాజల్ తనదైన శైలిలో సరదాగా విష్ చేయగా, అక్షయ్ కుమార్, కరీనా కపూర్, రోహిత్ శెట్టి వంటి ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
Ajay Devgn Kajol: బాలీవుడ్ వెండితెరపై 'సింగం'గా తనదైన ముద్ర వేసిన అజయ్ దేవగణ్ గురువారం (ఏప్రిల్ 2) 57వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అతనికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు అతని ఇంటికి భారీగా తరలివచ్చి తమ అభిమాన నటుడిని చూడాలని ఎదురుచూస్తుంటే, చిత్ర పరిశ్రమకు చెందిన సన్నిహితులు, సహనటులు ఆసక్తికరమైన పోస్ట్‌లతో అజయ్‌కు విష్ చేశారు. ముఖ్యంగా భార్య కాజోల్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట నవ్వులు పూయిస్తోంది.

కాజోల్ ఫన్నీ విష్.. అక్షయ్ 'దోస్తీ'
అజయ్ దేవగణ్, కాజోల్ జంట సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు సరదాగా సెటైర్లు వేసుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు. ఈసారి కూడా కాజోల్ అజయ్ ఫోటోను షేర్ చేస్తూ.. "కేక్ మీద క్యాండిల్స్ చూస్తుంటే అవి సెలబ్రేషన్స్ లా కాకుండా.. 'ఫైర్ హజార్డ్' (అగ్ని ప్రమాదం) లాగా కనిపిస్తున్నాయి. నా ఉద్దేశం ప్రకారం నువ్వు ఆ స్థాయికి చేరుకున్నావు. ఏదేమైనా పుట్టినరోజు శుభాకాంక్షలు.. నీకు ఎప్పుడూ కేక్ దొరకాలని కోరుకుంటున్నాను" అంటూ సెటైరికల్ గా, ప్రేమగా రాసుకొచ్చింది. వీరిద్దరూ 1995లో 'హల్ చల్' సెట్స్‌లో కలిసి, 1999లో పెళ్లి చేసుకున్నారు. వీరికి కూతురు నైసా, కొడుకు యుగ్ ఉన్నారు.
అటు యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందిస్తూ.. 'గోల్‌మాల్ 5' అనౌన్స్‌మెంట్ వీడియోలోని ఒక ఫోటోను షేర్ చేశాడు. అందులో అజయ్ బుగ్గపై అక్షయ్ ముద్దు పెడుతూ కనిపించాడు. "దోస్తీ ఇంత పాతదైతే.. ప్రేమ ఖచ్చితంగా ఉంటుంది. హ్యాపీ బర్త్ డే అజయ్" అని అతడు పేర్కొన్నాడు. ఇక కరీనా కపూర్ "హ్యాపీ బర్త్ డే సింగం.. ఎప్పుడూ నీకు బిగ్ హగ్" అంటూ తన విషెస్ తెలియజేసింది.
రోహిత్ శెట్టి ఎమోషనల్ వీడియో
దర్శకుడు రోహిత్ శెట్టి, అజయ్ దేవగణ్ మధ్య వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ గొప్ప అనుబంధం ఉంది. 90వ దశకం నుంచి నేటి వరకు వీరిద్దరి ప్రయాణాన్ని వివరిస్తూ ఒక ప్రత్యేక వీడియోను రోహిత్ పోస్ట్ చేశారు.
"సంవత్సరాలు గడిచాయి.. కథలు మారాయి.. కానీ కొన్ని బంధాలు మాత్రం అలాగే ఉన్నాయి. తక్కువ మాటలు.. ఎక్కువ యాక్షన్. హ్యాపీ బర్త్ డే బిగ్ బ్రదర్" అంటూ రోహిత్ తన కృతజ్ఞతను చాటుకున్నారు.
అజయ్ దేవగణ్ చేతిలో క్రేజీ ప్రాజెక్టులు
ప్రస్తుతం అజయ్ దేవగణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇంద్ర కుమార్ దర్శకత్వంలో వస్తున్న కామెడీ ఎంటర్టైనర్ 'ధమాల్ 4' (Dhamaal 4) విడుదలకు సిద్ధమవుతోంది. రితేష్ దేశ్‌ముఖ్, అర్షద్ వార్సీ, సంజయ్ మిశ్రా, జావేద్ జాఫ్రీ, రవి కిషన్ వంటి భారీ తారాగణంతో రూపొందిన ఈ సినిమా జూన్ 12న థియేటర్లలోకి రానుంది.
ఇది కాకుండా అక్టోబర్ 2న అత్యంత ఆసక్తికరమైన మూవీ 'దృశ్యం 3' (Drishyam 3) విడుదల కానుంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 'గోల్‌మాల్ 5' కూడా త్వరలోనే ప్రేక్షకులను పలకరించనుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


