...
...
Next Story

Ajith Dare Devil: డేర్ డెవిల్‌గా వస్తున్న అజిత్.. అధిక్ రవిచంద్రన్ సినిమాకు క్రేజీ టైటిల్.. భార్యే నిర్మాత

Ajith Dare Devil: అజిత్ తన కార్ రేసింగ్ కాస్త బ్రేక్ ఇచ్చి మళ్లీ సినిమా షూటింగ్స్ మొదలుపెట్టాడు. తన నెక్ట్స్ మూవీకి డేర్ డెవిల్ అనే టైటిల్ పెట్టడం విశేషం. ఈ మూవీని షాలిని ప్రొడ్యూస్ చేస్తుండగా.. అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు.

Published on: Aug 3, 2026, 18:53:30 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Ajith Dare Devil: తమిళ సూపర్‌స్టార్, కోలీవుడ్ 'తలా' అజిత్ కుమార్ కార్ రేసింగ్ ట్రాక్‌కి కాస్త గ్యాప్ ఇచ్చి ఫ్యాన్స్‌కు అల్టిమేట్ సర్ ప్రైజ్ ఇచ్చేశారు. గత కొన్ని నెలలుగా కొత్త సినిమాలేవీ సైన్ చేయకుండా స్పీడ్ రేసింగ్‌పైనే పూర్తి దృష్టి పెట్టిన అజిత్.. తన 64వ సినిమా అనౌన్స్‌మెంట్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఈ మాసివ్ ప్రాజెక్ట్‌కి 'డేర్ డెవిల్' (Dare Devil) అనే ఇంటెన్స్ టైటిల్‌ను కన్ఫర్మ్ చేస్తూ మేకర్స్ గ్రాండ్‌గా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

భార్య షాలిని సొంత ప్రొడక్షన్‌లో సినిమా..

Ajith Dare Devil: డేర్ డెవిల్‌గా వస్తున్న అజిత్.. అధిక్ రవిచంద్రన్ సినిమాకు క్రేజీ టైటిల్.. భార్యే నిర్మాత
Ajith Dare Devil: డేర్ డెవిల్‌గా వస్తున్న అజిత్.. అధిక్ రవిచంద్రన్ సినిమాకు క్రేజీ టైటిల్.. భార్యే నిర్మాత

'గుడ్ బ్యాడ్ అగ్లీ' లాంటి మాసివ్ సక్సెస్ తర్వాత డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్, అజిత్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కావడం ఫ్యాన్స్‌లో భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ భారీ యాక్షన్ డ్రామాను అజిత్ భార్య, నటి షాలిని అజిత్ కుమార్ తన సొంత నిర్మాణ సంస్థ 'బ్రేవ్ హార్ట్స్ ప్రొడక్షన్' బ్యానర్‌పై స్వయంగా నిర్మిస్తున్నారు. సినిమాకి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ స్వరాలు అందిస్తున్నారు.

34 ఏళ్ల సినీ ప్రయాణం.. పోస్టర్‌పై ఫ్యాన్స్ మిశ్రమ స్పందన

అజిత్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 34 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు అధిక్ రవిచంద్రన్ ఈ స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. రెడ్ అండ్ వైట్ కలర్ థీమ్‌తో పాచికల (Dice) డిజైన్‌పై 'డేర్ డెవిల్' అని ఉన్న ఈ పోస్టర్‌పై ఫ్యాన్స్ నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.

టైటిల్ అదిరిపోయినా, పోస్టర్ డిజైన్ ఇంకా బెటర్‌గా ఉంటే బాగుండేదని, టెక్నికల్ టీమ్‌లో ఎడిటర్‌ను అయినా మార్చాల్సింది అంటూ కొంతమంది ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఆరు సార్లు యాక్సిడెంట్స్.. రేసింగ్ డాక్యుమెంటరీ ‘గ్లాడియేటర్స్’

ఆయన రేసింగ్ కెరీర్‌పై ప్రముఖ డైరెక్టర్ ఏఎల్ విజయ్ 'గ్లాడియేటర్స్' పేరుతో ఒక డాక్యుమెంటరీని కూడా రూపొందిస్తున్నారు, దీనికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

రూ.248 కోట్ల కలెక్షన్లు.. రెమ్యునరేషన్ వివాదంపై క్లారిటీ

2025లో అజిత్ నటించిన 'విదాముయర్చి' రూ.135.89 కోట్ల కలెక్షన్లతో యావరేజ్‌గా నిలవగా, అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వచ్చిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ప్రపంచవ్యాప్తంగా రూ.248.25 కోట్ల గ్రాస్ వసూలు చేసి బిగ్గెస్ట్ హిట్ కొట్టింది. అయితే ఆ తర్వాత అజిత్ కొత్త సినిమాలు సైన్ చేయకపోవడంపై కోలీవుడ్ సీనియర్ డిస్ట్రిబ్యూటర్ తిరుప్పూర్ సుబ్రమణ్యన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

అజిత్ భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారని, ప్రొడ్యూసర్లు ప్రాఫిట్ షేరింగ్ పద్ధతిలో పనిచేస్తేనే సినిమాలు ముందుకు సాగుతాయని అభిప్రాయపడ్డారు.

2027 సమ్మర్ టార్గెట్.. బాక్సాఫీస్ రికార్డులు బద్దలే

ఇప్పుడు సొంత ప్రొడక్షన్‌లోనే సినిమా తీస్తుండటంతో బాక్సాఫీస్ రికార్డులన్నీ బద్దలు కొట్టడం ఖాయమని అజిత్ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానుండగా, 2027 సమ్మర్ కానుకగా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe