Akhil Accident: బాత్రూమ్‌లో జారి పడ్డాను.. 16 నెలల నరకం.. రెండు సర్జరీలు.. చిన్న బరువులూ ఎత్తలేకపోయా: అఖిల్ అక్కినేని

Akhil Accident: అఖిల్ అక్కినేని ఏజెంట్ మూవీ తర్వాత చాలా రోజులకు మళ్లీ లెనిన్ మూవీతో వస్తున్నాడు. అయితే ఇంత లాంగ్ గ్యాప్ రావడానికి తనకు బాత్రూమ్ లో జరిగిన యాక్సిడెంటే కారణమని అతడు తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో వెల్లడించాడు.

Published on: Jul 2, 2026, 16:24:06 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Akhil Accident: అక్కినేని అఖిల్ ఫ్యాన్స్ కు ఒక రేంజ్ లో షాక్ ఇచ్చే న్యూస్ బయటపడింది. 'ఏజెంట్' మూవీ డిజాస్టర్ తర్వాత అఖిల్ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నాడు అని తెగ ఫీల్ అయిన ఫ్యాన్స్ కు ఇప్పుడు అసలు నిజం తెలిసింది. భారీ అంచనాలతో వస్తున్న అఖిల్ లేటెస్ట్ యాక్షన్ డ్రామా 'లెనిన్' (Lenin) వచ్చే వారం థియేటర్లలోకి రాబోతోంది.

Akhil Accident: బాత్రూమ్‌లో జారి పడ్డాను.. 16 నెలల నరకం.. రెండు సర్జరీలు.. చిన్న బరువులూ ఎత్తలేకపోయా: అఖిల్ అక్కినేని
Akhil Accident: బాత్రూమ్‌లో జారి పడ్డాను.. 16 నెలల నరకం.. రెండు సర్జరీలు.. చిన్న బరువులూ ఎత్తలేకపోయా: అఖిల్ అక్కినేని

ఈ సినిమా ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచిన అఖిల్.. రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన లాంగ్ బ్రేక్ వెనుక ఉన్న చేదు నిజాన్ని రివీల్ చేశాడు. గత 16 నెలలుగా తాను అనుభవించిన నరకం గురించి చెబుతూ అందరినీ ఎమోషనల్ చేశాడు. నాగార్జున కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ కు ఇప్పటివరకు సరైన బ్లాక్ బస్టర్ పడలేదు.

ఏజెంట్ ఫ్లాప్ తర్వాత అనుభవించిన నరకం

అఖిల్ నటించిన 'హలో', 'మిస్టర్ మజ్ను' సినిమాలు తీవ్ర నిరాశ పరిచాయి. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' పర్వాలేదు అనిపించినా.. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో పాన్ ఇండియా లెవెల్లో చేసిన 'ఏజెంట్' దారుణంగా ఫ్లాప్ అయింది. ఆ భారీ డిజాస్టర్ తర్వాత అఖిల్ ఎందుకు సైలెంట్ అయిపోయాడు అని అందరూ కంగారు పడ్డారు. కానీ ఆ గ్యాప్ కు కారణం కేవలం సినిమా ఫ్లాప్ అవ్వడమే కాదు, ఒక ఘోరమైన యాక్సిడెంట్ అని అఖిల్ క్లారిటీ ఇచ్చాడు.

ఈ సుదీర్ఘమైన బ్రేక్ లో సగం తప్పు తనదైతే, మిగతా సగం అసలు తన చేతుల్లోనే లేదని ఎమోషనల్ అయ్యాడు అఖిల్. "ఏజెంట్ సినిమా రిలీజ్ అయిన నాలుగు నెలల తర్వాత నేను తడిగా ఉన్న బాత్రూంలో జారి పడ్డాను. ఆ టైమ్ లో ఓ పగిలిన గాజు ముక్క నా ఎడమ చేతికి బలంగా గుచ్చుకుంది. అది నేరుగా వెళ్లి నా చేతి నరాలు కట్ చేసింది. అది చాలా భయంకరమైన యాక్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ నన్ను పూర్తిగా కుదిపేసింది" అని అఖిల్ ఆ చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు.

8 నెలల పాటు కనీసం బరువులు ఎత్తలేక..

ఈ యాక్సిడెంట్ తర్వాత అఖిల్ కు ఏకంగా రెండు సర్జరీలు జరిగాయట. మొత్తంగా 48 కుట్లు పడినట్లు కూడా అతడు వెల్లడించాడు. ఆ చేతి గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు 16 నెలల టైమ్ పట్టిందని అతను చెప్పాడు. కనీసం ఏడు ఎనిమిది నెలల పాటు జిమ్ లో చిన్న బరువులు కూడా ఎత్తలేని దారుణమైన పరిస్థితిలో ఉండిపోయానని అఖిల్ వివరించాడు.

పూర్తిగా రికవర్ అయ్యి, మళ్లీ జిమ్ లో వర్కౌట్స్ స్టార్ట్ చేయడానికి 16 నెలలు పట్టిందట. ఈ విషయం తెలియని అక్కినేని ఫ్యాన్స్ ఇన్నాళ్లు అఖిల్ తన కెరీర్ ను సీరియస్ గా తీసుకోవడం లేదు, కావాలనే ప్రాజెక్ట్స్ లేట్ చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో తెగ విమర్శించారు. కానీ ఇప్పుడు ఈ సర్జరీల గురించి తెలుసుకుని అఖిల్ కు సపోర్ట్ గా నిలబడుతున్నారు.

ఇక ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించిన అఖిల్.. 'లెనిన్' మూవీతో మంచి కమ్‌బ్యాక్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. ఒక పవర్ ఫుల్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా అక్కినేని ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ యాక్షన్ డ్రామా అఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. లెనిన్ మూవీ జులై 10న థియేటర్లలో రిలీజ్ కానుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More