Akhil Akkineni On Salaar 2: ప్రభాస్ సలార్ 2లో అక్కినేని అఖిల్- అసలు విషయం చెప్పిన లెనిన్- అంతా గడ్డంతోనే!

Akhil Akkineni Clarity On Prabhas Salaar 2 Entry: రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ 'సలార్ 2'లో అక్కినేని అఖిల్ నటిస్తున్నారంటూ వస్తున్న వార్తలపై స్వయంగా తాజాగా అఖిల్ స్పందించారు. లెనిన్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఈ వైరల్ రూమర్ల వెనకున్న అసలు నిజం ఏంటో చెబుతూ అఖిల్ క్లారిటీ ఇచ్చారు.

Published on: Jul 9, 2026, 13:48:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Akhil Akkineni Clarity On Prabhas Salaar 2 Entry: రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన 'సలార్: పార్ట్ 1 - సీజ్‌ఫైర్' బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.

ప్రభాస్ సలార్ 2లో అక్కినేని అఖిల్- అసలు విషయం చెప్పిన లెనిన్- అంతా గడ్డంతోనే!
ప్రభాస్ సలార్ 2లో అక్కినేని అఖిల్- అసలు విషయం చెప్పిన లెనిన్- అంతా గడ్డంతోనే!

సలార్ 2లో అక్కినేని అఖిల్

ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా రానున్న 'సలార్ 2: శౌర్యాంగ పర్వం'పై టాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, గత కొన్ని రోజులుగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త తెగ హల్‌చల్ చేస్తోంది.

యంగ్ హీరో అఖిల్ అక్కినేని సలార్ 2 సినిమాలో ఒక పవర్‌ఫుల్ పాత్రలో మెరవబోతున్నారని, ప్రభాస్ (దేవ)కు తమ్ముడిగా కనిపిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే, తాజాగా ఈ వైరల్ రూమర్లపై అఖిల్ అక్కినేని ఎట్టకేలకు స్పందించారు. ఈ వార్తల వెనకున్న అసలు నిజాన్ని బయటపెడుతూ క్లారిటీ ఇచ్చారు.

అసలు ఈ రూమర్లు ఎలా మొదలయ్యాయి?

'సలార్ 1' భారీ విజయం సాధించిన తర్వాత చిత్రబృందం బెంగళూరులో ఒక గ్రాండ్ సక్సెస్ పార్టీని ఏర్పాటు చేసింది. హోంబలే ఫిల్మ్స్ నిర్వహించిన ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. వారిలో అక్కినేని అఖిల్ కూడా ఉండటం అందరి దృష్టిని ఆకర్షించింది. పార్టీలో ప్రభాస్, ప్రశాంత్ నీల్‌లతో కలిసి అఖిల్ దిగిన ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో అభిమానులు రకరకాల అంచనాలకు వచ్చేశారు.

'ఏజెంట్' సినిమా కోసం భారీగా మేకోవర్ మార్చుకున్న అఖిల్.. చేతికి చిన్న గాయంతో రగ్గడ్ లుక్‌లో ఆ పార్టీకి వెళ్లారు. దాంతో ప్రశాంత్ నీల్ కచ్చితంగా అఖిల్‌ను 'సలార్ 2' లోని శౌర్యాంగ తెగకు చెందిన ఒక యోధుడిగా చూపిస్తారని, అందుకే ఆయన ఆ లుక్‌లో ఉన్నారని ఫ్యాన్స్ థియరీలు అల్లేశారు. సోషల్ మీడియాలో ఈ టాపిక్ కాస్తా పెద్ద ఎత్తున వైరల్‌గా మారింది.

అసలు విషయం చెప్పిన అఖిల్

ఈ క్రేజీ రూమర్లపై అఖిల్ తాజాగా నటించిన లెనిన్ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో నవ్వుతూ సమాధానమిచ్చారు. "సలార్ సీక్వెల్‌లో మీరున్నారని" అని యాంకర్ అంటుండగా.. "సలార్ సీక్వెల్.. నేను దీనిపై చాలా సింపుల్‌గా క్లారిటీ ఇస్తాను" అని అఖిల్ అన్నారు.

"సలార్ సీక్వెల్‌కి నా క్లోజ్ ఫ్రెండ్, నా బ్రదర్ ప్రశాంత్ నీల్ దర్శకుడు. సలార్ సక్సెస్ అయినప్పుడు నేను బెంగళూరులో ఉన్నాను. నేను ఏదో పనిపై వెళ్లాను. ఆ పార్టీకి రమ్మని నాకు కాల్ చేసి ఇన్వైట్ చేశారు. ఇవాళ సక్సెస్ మీట్ ఉంది. నువ్వు వస్తే నాకు బాగుంటుందని ప్రశాంత్ కాల్ చేశాడు. నాకు అప్పుడు గడ్డం ఎక్కువ ఉండటం వల్ల నేను కూడా సలార్ చేస్తున్నాను అని అనుకున్నారు" అని నవ్వేశాడు అఖిల్ అక్కినేని.

నవ్వుతూ చెప్పిన లెనిన్

అలా అనుకోకుండా సలార్ సక్సెస్ పార్టీకి వెళ్లడం, అప్పుడు గడ్డం ఎక్కువగా ఉండటం వల్లే ఈ రూమర్స్ పుట్టుకొచ్చాయని లెనిన్ సినిమాతో వస్తున్న అక్కినేని అఖిల్ నవ్వుతూ చెప్పారు. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More