రాజా సాబ్ దెబ్బకు సలార్ 2 పక్కన పెట్టారా.. ప్రభాస్ మూవీ మేకర్స్ ఏమన్నారంటే?
ప్రభాస్ ‘ది రాజా సాబ్’ ఫలితం తర్వాత ‘సలార్ 2’ సినిమా ఆగిపోయిందన్న వార్తలను నిర్మాతలు పరోక్షంగా ఖండించారు. శృతి హాసన్ పుట్టినరోజు సందర్భంగా మూవీ టీమ్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు ఆ పుకార్లన్నింటికీ చెక్ పెట్టింది. సినిమా ఆగిపోలేదని, పక్కాగా పట్టాలెక్కుతుందని ఈ పోస్ట్ ద్వారా స్పష్టత ఇచ్చారు.
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ 'సలార్: పార్ట్ 1'కు సీక్వెల్‌గా రాబోతున్న 'సలార్ 2' (Salaar 2) ఆగిపోయిందంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో, మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ ఇటీవల నటించిన 'ది రాజా సాబ్' సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవడంతో, నిర్మాతలు 'సలార్ 2'ను నిరవధికంగా వాయిదా వేశారని ఒక ప్రముఖ పత్రిక రిపోర్ట్ చేసింది. మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కథను మార్చాలని దర్శకుడు ప్రశాంత్ నీల్, ప్రభాస్ భావిస్తున్నారన్నది ఆ వార్త సారాంశం.

పుకార్లకు చెక్ పెట్టిన సలార్ మేకర్స్
సలార్ మూవీ సీక్వెల్ పక్కన పట్టలేదని మేకర్స్ చెప్పకనే చెప్పారు. ఈ మూవీని నిర్మించిన హోంబలే ఫిలింస్.. తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. సినిమాలో 'ఆద్య' పాత్రలో నటించిన శృతి హాసన్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ పోస్ట్ చేశారు. ఇందులో ప్రభాస్, శృతి హాసన్ ఇద్దరూ ఒక ఫోన్ చూస్తూ నవ్వుతూ ఉన్న ఫోటోను పంచుకున్నారు.
అయితే దీనికి పెట్టిన క్యాప్షన్ హైలైట్ గా నిలిచింది. ఆ ఫోటోకు పెట్టిన క్యాప్షన్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. "సలార్ 2లో తనకు ఏం జరుగుతుందో ఆద్య (శృతి).. దేవా (ప్రభాస్)కు చూపిస్తోంది!! మీరేమనుకుంటున్నారో చెప్పండి?" అని రాసుకొచ్చారు. ఈ ఒక్క పోస్ట్‌తో సినిమా ఆగిపోలేదని, పనులు సజావుగా సాగుతున్నాయని మేకర్స్ చెప్పకనే చెప్పారు.
ప్రభాస్ ఫ్యాన్స్ ఖుష్
సలార్ మేకర్స్ ఇచ్చిన ఈ అప్డేట్‌తో ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. "ఎట్టకేలకు దేవా నవ్వుతూ కనిపించాడు", "సలార్ 2లో ఆద్య కోసం దేవా చేసే సాహసాలు ఊహించుకుంటుంటేనే గూస్‌బంప్స్ వస్తున్నాయి" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సలార్ 2లో ఏం ఉండబోతోంది?
'సలార్ పార్ట్ 2: శౌర్యాంగ పర్వం' మొదటి భాగం ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే మొదలవుతుంది. ఖాన్సార్ రాజ్యంలో ప్రాణ స్నేహితులుగా ఉన్న దేవా (ప్రభాస్), వరద (పృథ్వీరాజ్ సుకుమారన్) బద్ధ శత్రువులుగా ఎలా మారారు? వారి మధ్య ఘర్షణ ఖాన్సార్‌ను ఎలా మారుస్తుందన్నదే ఈ సీక్వెల్ కథ.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


