...
...
Next Story

వైభవంగా అక్కినేని అఖిల్ వివాహం.. చిరూ, చరణ్, రాజమౌళి, ప్రశాంత్ నీల్ హాజరు.. టీమిండియా క్రికెటర్ కూడా..

అఖిల్ అక్కినేని వివాహం ఘనంగా జరిగింది. హైదరాబాద్‍లో పెళ్లి వేడుకగా సాగింది. చిరంజీవి, రామ్‍చరణ్ సహా మరికొందరు సినీ ప్రముఖులు హాజరయ్యారు. భారత క్రికెటర్ తిలక్ వర్మ కూడా పాల్గొన్నారు.

Published on: Jun 6, 2025, 10:43:53 IST
By
Prefer HTon Google
Advertisement

అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు, యంగ్ హీరో అక్కినేని అఖిల్ ఓ ఇంటి వాడయ్యారు. తన ప్రేయసి జైనాబ్ రవ్జీని అఖిల్ పెళ్లాడారు. నేటి (జూన్ 6) తెల్లవారుజామున జూబ్లిహిల్స్‌లోని నాగార్జున నివాసంలో అఖిల్, జైనాబ్ వివాహం వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాల సభ్యులతో పాటు సన్నిహితులు, కొందరు సినీ సెలెబ్రిటీలు ఈ వేడుకకు హాజరయ్యారు.

చిరంజీవి, రామ్‍చరణ్ సహా..

వైభవంగా అక్కినేని అఖిల్ వివాహం
వైభవంగా అక్కినేని అఖిల్ వివాహం

అఖిల్ - జైనాబ్ వివాహ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ హాజరయ్యారు. వారితో పాటు రామ్‍చరణ్, ఉపాసన దంపతులు కూడా పెళ్లికి వచ్చారు. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, శర్వానంద్, దర్శక ధీరుడు రాజమౌళి, అతడి కుమారుడు కార్తికేయతో పాటు మరికొందరు సినీ సెలెబ్రిటీలు హాజరయ్యారు. భారత క్రికెటర్ తిలక్ వర్మ కూడా పెళ్లికి వచ్చారు. వివాహంలో అఖిల్సోదరుడు, హీరో నాగచైతన్య సందడి చేశారు. చైతూ భార్య శోభితా ధూళిపాళ్ల చీరకట్టులో మెరిశారు. సుశాంత్, సుమంత్ కూడా ఉత్సాహంగా కనిపించారు.

ఇద్దరి మధ్య 8ఏళ్ల గ్యాప్

అఖిల్, జైనాబ్ మధ్య ఎనిమిది ఏళ్ల గ్యాప్ ఉంది. అఖిల్ వయసు ప్రస్తుతం 31 కాగా.. జైనాబ్‍ది 39. వీరిద్దరు సుమారు రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. ఎట్టకేలకు ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ముంబైకు చెందిన పారిశ్రామిక వేత్త జుల్ఫి రవ్జీ కుమార్తెనే జైనాబ్రవ్జీ. పెయింటింగ్ ఆర్టిస్టుగా, సోషల్ మీడియా ఇన్‍ఫ్లుయెన్సర్‌గా జైనాబ్ పాపులర్ అయ్యారు. ఓ చిత్రంలోనూ నటించారు.

రిసెప్షన్ డేట్

అఖిల్ - జైనాబ్ వివాహ రిసెప్షన్ వేడుక జూన్ 8వ తేదీన అన్నపూర్ణ స్టూడియోస్‍లో జరగనుంది. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో సినీ, రాజకీయ, వ్యాపార సహా పలు రంగాల ప్రముఖులు హాజరుకాన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా నాగార్జున ఆహ్వానించారు.

గతంలో శ్రేయా భూపాల్‍తో అఖిల్ ఎంగేజ్‍మెంట్ జరిగింది. అయితే, ఆ తర్వాత అది క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత జైనాబ్‍ను అతడు ప్రేమించారు. ఆమెతో ఇప్పుడు ఏడడుగులు వేశారు అఖిల్.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe