...
...
Next Story

అఖిల్ పెళ్లికి సీఎం రేవంత్‍ను ఆహ్వానించిన నాగార్జున, అమల.. వివాహం ఎప్పుడంటే!

అక్కినేని అఖిల్ త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. ఈ వివాహ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు నాగార్జున, అమల. అమ్మాయి తల్లిదండ్రులు కూడా వారి వెంట ఉన్నారు.

Published on: May 31, 2025, 14:52:32 IST
By
Prefer HTon Google
Advertisement

అక్కినేని ఇంట పెళ్లిబాజాలు అతిత్వరలో మోగనున్నాయి. కింగ్ నాగార్జున చిన్న కుమారుడు, హీరో అక్కినేని అఖిల్ వివాహం జూన్‍లోనే జరగనుంది. తన ప్రేయసి జైనాబ్ రవ్ద్‌జీని అఖిల్ పెళ్లాడనున్నారు. గతేడాది నవంబర్‌లోనే వీరి ఎంగేజ్‍మెంట్ జరిగింది. ఇప్పుడు వివాహానికి సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో అఖిల్ పెళ్లికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కింగ్ నాగార్జున, అమల ఆహ్వానించారు.

సీఎంను కలిసిన ఇరు కుటుంబాల పెద్దలు

అఖిల్ పెళ్లికి సీఎం రేవంత్‍ను ఆహ్వానించిన నాగార్జున, అమల.. వివాహం ఎప్పుడంటే!
అఖిల్ పెళ్లికి సీఎం రేవంత్‍ను ఆహ్వానించిన నాగార్జున, అమల.. వివాహం ఎప్పుడంటే!

అఖిల్ - జైనాబ్‍ల పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు.. సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం పలికారు. అఖిల్ తల్లిదండ్రులు అక్కినేని నాగార్జున, అమలతో పాటు జైనాబ్ పేరెంట్స్ నేడు (మే 31) రేవంత్‍ను కలిశారు. జూబ్లిహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటికి వచ్చాయి.

పెళ్లి తేదీ, వేదిక ఇవే!

అఖిల్, జైనాబ్ పెళ్లి వేడుక జూన్ 6వ తేదీన జరుగుతుందని సమాచారం. హైదరాబాద్‍లోని అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా ఈ వేదిక జరగనుందని తెలుస్తోంది. అయితే, ఈ విషయాలపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. గతేడాది అక్కినేని నాగచైతన్య, శోభితా దూళిపాళ్ల వివాహం కూడా అన్నపూర్ణ స్టూడియోస్‍లోనే జరిగింది.

ఎన్‍ కన్వెన్షన్ వివాదం

కాగా, గతేడాది తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత హాట్ టాపిక్ అయింది. ఈ విషయంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టును కూడా నాగార్జున ఆశ్రయించారు. కూల్చివేత సరికాదనేలా ట్వీట్ కూడా చేశారు. ప్రతిపక్షాలు కూడా ఎంటర్ అవ్వడంతో ఈ అంశం అప్పట్లో రాజకీయ మలుపు కూడా తీసుకుంది. అయితే, కొన్నాళ్లకు ఇది సద్దుమణిగింది. ఇప్పుడు సీఎం రేవంత్‍ను స్వయంగా కలిసి అఖిల్ పెళ్లికి ఆహ్వానించారు నాగార్జున.

లెనిన్‍తో అఖిల్ బిజీ

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks