Alia Bhatt: ర్యాంప్‌పై వ‌య్యారంగా.. అద‌ర‌గొట్టిన అలియా భ‌ట్‌.. షో స్టాప‌ర్‌గా హీరోయిన్‌.. వీడియోలు వైర‌ల్‌

Alia Bhatt: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ మరోసారి అదరగొట్టింది. ర్యాంప్ పై వయ్యారంగా నడిచి సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఆమె లేటెస్ట్ గ్లామర్ పిక్స్, వీడియోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. 

Published on: Sep 27, 2026, 20:18:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Alia Bhatt: అందాల బొమ్మ ర్యాంప్ వాక్ చేస్తే ఎలా ఉంటుందో అలియా భట్ మరోసారి నిరూపించింది. ర్యాంప్ పై మెరుపులా మెరిసింది. తాజాగా అలియా భట్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె గ్లామర్ పిక్స్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.

ర్యాంప్‌పై వ‌య్యారంగా.. అద‌ర‌గొట్టిన అలియా భ‌ట్‌.. షో స్టాప‌ర్‌గా హీరోయిన్‌.. వీడియోలు వైర‌ల్‌ (x)
ర్యాంప్‌పై వ‌య్యారంగా.. అద‌ర‌గొట్టిన అలియా భ‌ట్‌.. షో స్టాప‌ర్‌గా హీరోయిన్‌.. వీడియోలు వైర‌ల్‌ (x)

అలియా భట్ ర్యాంప్ వాక్

పాపులర్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ప్రతి సంవత్సరం మిజ్వాన్ ఫండ్ రైజర్ ఈవెంట్ గా ఓ ఫ్యాషన్ షో నిర్వహిస్తారు. ఈ సారి కూడా 15వ యానివర్సరీగా ఈ మిజ్వాన్ ఫండ్ రైజర్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఇందులో షో స్టాపర్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ అదరగొట్టింది.

వైరల్ వీడియోలు

ర్యాంప్ పై సింగిల్ గా, గ్రూప్ గా, విక్కీ కౌశల్ తో కలిసి అలియా భట్ నడిచిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. బ్యూటీఫుల్, అందం అదరహో, గ్లామరస్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

అలియా భట్ సినిమాలు

స్టార్ కిడ్ గా బాలీవుడ్ లో అడుగుపెట్టిన అలియా తనదైన యాక్టింగ్ తో అభిమానులను సంపాదించుకుంది. హిందీలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా అలియా భట్ ఎదిగింది. హార్ట్ ఆఫ్ స్టోన్ అనే అమెరికన్ సినిమాలోనూ అలియా నటించింది.

తెలుగులో

ఆర్ఆర్ఆర్ సినిమాతో అలియా భట్ తెలుగులో అడుగుపెట్టింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. ఇందులో సీత అనే క్యారెక్టర్లో అలియా భట్ మంచి పర్ఫార్మెన్స్ చేసింది.

అయితే రీసెంట్ గా ‘ఆల్ఫా’ అనే స్పై యాక్షన్ థ్రిల్లర్ లో ఫైట్స్ తో అలియా భట్ అదరగొట్టింది. యశ్ రాజ్ స్పై యూనివర్స్ లో ఫస్ట్ ఫీమేల్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. అయితే బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాలతో రిలీజైన ఆల్ఫా మూవీ బొక్కబోర్లా పడింది.

బోల్డ్ లుక్

అలియా భట్ ప్రస్తుతం ‘లవ్ అండ్ వార్’, ‘తుంబాడ్ 2’ సినిమాల్లో నటిస్తోంది. లవ్ అండ్ వార్ మూవీ నుంచి రీసెంట్ గా అలియా భట్ బోల్డ్ అండ్ పవర్ ఫుల్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక బ్లాక్ బస్టర్ మూవీ తుంబాడ్ సీక్వెన్స్ లో అలియా పవర్ ఫుల్ రోల్ చేస్తుందని తెలిసింది. ఈ మూవీపై భారీ హైప్ నెలకొంది. ఇది మిస్టరీ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More