అల్లరి నరేష్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ట్రైలర్ రిలీజ్.. ఊహకందని మర్డర్ కేసును పరిష్కరించే పాత్రలో..
అల్లరి నరేష్ మరోసారి క్రైమ్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నాడు. అతని నెక్ట్స్ మూవీ 12ఎ రైల్వే కాలనీ ట్రైలర్ మంగళవారం (నవంబర్ 11) రిలీజైంది. ఈ ట్రైలర్ చాలా ఉత్కంఠగా సాగింది. ఓ అంతు చిక్కని మర్డర్ మిస్టరీని పరిష్కరించే పాత్రలో అతడు నటించాడు.
ఎన్నో ఏళ్లపాటు కామెడీ పాత్రలకే పరిమితమైన అల్లరి నరేష్.. ఇప్పుడు రూటు మార్చాడు. అప్పుడప్పుడూ భిన్నమైన కథలతో వస్తున్నాడు. అలా మరోసారి 12ఎ రైల్వే కాలనీ మూవీతో రానున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. ఓ మర్డర్ మిస్టరీగా ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.

12ఎ రైల్వే కాలనీ ట్రైలర్
అల్లరి నరేష్, కామాక్షి భాస్కర్ల లీడ్ రోల్స్ లో నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ 12ఎ రైల్వే కాలనీ. పొలిమేర, పొలిమేర 2 లాంటి హారర్ థ్రిల్లర్ సినిమాలకు కథలు అందించిన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాకు కూడా కథ అందించడం విశేషం. ఇక ఈ సినిమాను నాని కాసరగడ్డ డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ ట్రైలర్ మంగళవారం (నవంబర్ 11) రిలీజైంది. ఇది చాలా ఆసక్తికరంగా సాగింది. మొదట్లోనే అల్లరి నరేష్.. మంచు కొండల్లో కనిపిస్తాడు. మీకు కనిపించడం లేదు కానీ నాకు మాత్రం ఎందుకు కనిపిస్తోందన్న అతని మాటలు బ్యాక్‌గ్రౌండ్ లో వినిపిస్తాయి. నువ్వు మళ్లీ ఊహించుకుంటున్నావా అని మరో పాత్ర అంటుంది.
నువ్వు చెప్పేది ఏదీ నమ్మశక్యంగా లేదంటూ సాయికుమార్ పాత్ర ఎంటరవుతుంది. అసలు అంతు చిక్కని ఈ మర్డర్ కేసును మీరు ఎలా పరిష్కరించారు అని మరో పాత్ర సాయికుమార్ పాత్రను అడుగుతుంది. దానిని తాను సాల్వ్ చేయలేదని అతడు అంటాడు. అప్పుడు అల్లరి నరేష్ మరో పూర్తి భిన్నమైన గెటప్ లో ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత ట్రైలర్ మొత్తం ఆ మర్డర్ మిస్టరీ చుట్టే తిరుగుతుంది. అసలు ఆ హత్యకు గురైంది ఎవరు? దీనికి, సినిమాలో లీడ్ రోల్స్ కి సంబంధం ఏంటి? దీనిని ఎలా పరిష్కరిస్తాన్నది 12ఎ రైల్వే కాలనీలో చూడొచ్చు.
12ఎ రైల్వే కాలనీ మూవీ గురించి..
అల్లరి నరేష్ చివరిగా బచ్చల మల్లి మూవీలో నటించాడు. కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడీ 12ఎ రైల్వే కాలనీ సినిమాతో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోనున్నాడు. నవంబర్ 21న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఈ సినిమా తర్వాత ఆల్కహాల్, సభకు నమస్కారం అనే మరో రెండు సినిమాలు కూడా అతడు చేస్తున్నాడు. అయితే ఈ 12ఎ రైల్వే కాలనీ మూవీ థ్రిల్లింగ్ ట్రైలర్ తో అంచనాలను పెంచేస్తోంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


