Raaka: అల్లు అర్జున్, అట్లీ 'రాకా' ఫస్ట్ లుక్ పై షారుఖ్ ఖాన్ రియాక్షన్.. కింగ్ ఖాన్ క్రేజీ పోస్ట్ వైరల్!

Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రిలీజైన 'రాకా' సినిమా ఫస్ట్ లుక్ వైరల్ గా మారింది. దీనిపై బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ స్పందిస్తూ పెట్టిన పోస్టు కూడా ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. 

Published on: Apr 9, 2026, 05:39:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు అంటే అభిమానులకు పండగే. అయితే ఈ ఏడాది వచ్చిన 'రాకా' (Raaka) మూవీ అనౌన్స్‌మెంట్ బన్నీ బర్త్‌డే ను మరింత స్పెషల్ గా మార్చింది. ఈ పోస్టర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఈ లుక్ పై రియాక్టయ్యాడు.

రాకా ఫస్ట్ లుక్ పై షారుఖ్ ఖాన్ రియాక్షన్
రాకా ఫస్ట్ లుక్ పై షారుఖ్ ఖాన్ రియాక్షన్

మాస్.. మాస్.. మాస్..

అట్లీ దర్శకత్వంలో 'జవాన్' వంటి భారీ బ్లాక్‌బస్టర్‌ను అందుకున్న షారుఖ్ ఖాన్, తాజాగా విడుదలైన 'రాకా' ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు. "పుట్టినరోజు శుభాకాంక్షలు అల్లు అర్జున్.. పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అచ్చం నీలాగే అద్భుతంగా ఉంది. మీరిద్దరూ కలిసి ఏం మ్యాజిక్ చేశారో చూడాలని ఆత్రుతగా ఉంది. అట్లీ మాటల్లో చెప్పాలంటే.. ఈ అనుభవం 'మాస్.. మాస్.. మాస్' లా ఉండబోతోంది. రాకా చాలా ఎగ్జైటింగ్‌గా కనిపిస్తోంది. మూవీ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్" అని షారుఖ్ రాసుకొచ్చారు.

రాకా ఫస్ట్ లుక్

అట్లీ- అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ రాకాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పుడీ ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఆ హైప్ మరింతగా పెరిగింది. ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ ముఖాన్ని తోడేలు లాంటి చేతితో దాచుకున్నట్లు కనిపించాడు. కళ్లకు కాటుక, గుండు, నెరిసిన గడ్డం, మీసాలతో అల్లు అర్జున్ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు.

18 ఏళ్ల కల

దర్శకుడు అట్లీ రాకా సినిమా గురించి చెబుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. "రాకా అనేది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు.. ఇది నాలో ఎన్నో ఏళ్లుగా దాచుకున్న ఒక భావం. గత 18 ఏళ్లుగా ఈ కథను, ఆలోచనను నా వెంటే ఉంచుకున్నాను. ఎప్పుడూ దీనిని మర్చిపోలేదు. ఈ ప్రయాణం నన్ను పరీక్షించింది, తీర్చిదిద్దింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే" అని అట్లీ పేర్కొన్నాడు.

రిలీజ్ ఎప్పుడు?

సన్ పిక్చర్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న రాకా చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె హీరోయిన్. ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు అట్లీతో షారుఖ్ చేసిన 'జవాన్' ఆయనకు ఉత్తమ నటుడిగా తొలి జాతీయ అవార్డును తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: 'రాకా' సినిమాకు దర్శకుడు ఎవరు?

జవాబు: ఈ చిత్రానికి కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది అల్లు అర్జున్‌తో ఆయనకు మొదటి సినిమా.

ప్రశ్న: ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు?

జవాబు: 'రాకా'లో అల్లు అర్జున్ సరసన దీపికా పదుకొణె నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా ఇది.

ప్రశ్న: ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది?

జవాబు: ప్రస్తుత సమాచారం ప్రకారం, ఈ చిత్రం 2027లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More