Raaka Movie: రాకా మూవీ బడ్జెట్ 1000 కోట్లు.. రెండు భాగాలుగా అల్లు అర్జున్ సినిమా.. నలుగురు హీరోయిన్లు.. క్రేజీ రిపోర్ట్
Raaka Movie: రాకా మూవీకి సంబంధించి తాజాగా వచ్చిన ఓ రిపోర్ట్ దిమ్మదిరిగిపోయేలా ఉంది. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో ఈ మూవీ రెండు భాగాలుగా రాబోతోందని, బడ్జెట్ ఏకంగా రూ.1000 కోట్లు అని ఇండియా టుడే రిపోర్టు వెల్లడించింది.
Raaka Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ (Atlee) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ 'రాకా' (Raaka) మూవీకి సంబంధించి ఒక్కసారిగా ఇండస్ట్రీ మైండ్ బ్లాంక్ అయ్యే అప్‌డేట్ బయటకు వచ్చింది. ఏకంగా రూ. 1,000 కోట్ల మైండ్ బ్లాకింగ్ బడ్జెత్‌తో రూపొందుతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ పక్కా ప్లాన్ సిద్ధం చేసినట్లు ఇండియా టుడే ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్ వెల్లడించింది.

టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత భారీ లెవెల్‌లో రూపొందుతున్న ఈ పీరియాడిక్ విజువల్ వండర్ ఇండియన్ సినిమా రేంజ్‌ను అంతర్జాతీయ వేదికపై నిలబెట్టబోతోంది.
డ్యూయల్ టైమ్‌లైన్స్.. వేద కాలం నుంచి నేటి ట్రెండ్ వరకు..
'రాకా' కథ రెండు వేర్వేరు ప్రపంచాల్లో, భిన్నమైన కాలమానాల్లో సాగుతుందని టాక్ నడుస్తోంది. ఒక ప్రపంచం ప్రాచీన గిరిజన పౌరాణిక వేద కాలం నాటి బ్యాక్‌డ్రాప్ కాగా, రెండో ప్రపంచం నేటి ఆధునిక కాలంలో జరిగే ఇంటెన్స్ డ్రామాగా డిజైన్ చేశారు. ఈ రెండు విభిన్న కాలాలను కలుపుతూ అట్లీ రాసుకున్న స్క్రీన్ ప్లే విజువల్ ఎఫెక్ట్స్ పరంగా, కథనం పరంగా ఆడియన్స్‌కి సరికొత్త థ్రిల్ ఇవ్వబోతోంది.
నలుగురు స్టార్ హీరోయిన్లు.. కాలానికి తగ్గట్టుగా క్యారెక్టర్లు
ఈ విజువల్ స్పెక్టకిల్‌లో అల్లు అర్జున్ సరసన ఏకంగా నలుగురు మోస్ట్ పాపులర్ లేడీ సూపర్ స్టార్స్ నటిస్తుండటం విశేషం. కథలోని రెండు విభిన్న టైమ్‌లైన్‌లకు తగ్గట్టుగా వీరి పాత్రలను చాలా ఆసక్తికరంగా డివైడ్ చేశారు.
ప్రస్తుత ఆధునిక కాలంలో సాగే కథలో మృణాల్ ఠాకూర్ మెయిన్ లీడ్‌గా కనిపించనుంది. ఇక ప్రాచీన వేద కాలం నాటి ఎపిసోడ్‌లో బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకోన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న, గ్లామర్ బ్యూటీ జాన్వీ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
షారుఖ్ ఖాన్ స్పెషల్ కేమియో.. ఓవర్సీస్ షూటింగ్ షెడ్యూల్
ఈ సినిమాకు మరో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ కింగ్ షారుఖ్ ఖాన్ స్పెషల్ కేమియో. ఇప్పటికే 'జవాన్' సినిమాతో రూ. 1,100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన అట్లీ.. అల్లు అర్జున్ ప్రాజెక్ట్‌లో షారుఖ్ కోసం ఒక పవర్‌ఫుల్ రోల్ డిజైన్ చేశారు.
ఈ రోల్‌కి సంబంధించిన షూటింగ్ ఇంకా జరగాల్సి ఉందని, త్వరలోనే విదేశాల్లో షారుఖ్ ఖాన్ పాల్గొనే సన్నివేశాలను చాలా గ్రాండ్‌గా చిత్రీకరించబోతున్నారని సమాచారం.
'పుష్ప 2' క్రేజ్.. అట్లీ విజన్ కలయికలో నెవర్ బిఫోర్ ఎపిక్
'పుష్ప 2: ది రూల్' గ్రాండ్ సక్సెస్ తర్వాత అల్లు అర్జున్ గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ప్రణాళికలు వేస్తున్నారు. మరోవైపు వరుస బ్లాక్‌బస్టర్లతో దూసుకెళ్తున్న అట్లీ టేకింగ్, విజువల్ విజన్ ఈ సినిమాను వేరే లెవెల్‌కి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.
రెండు భాగాల ఫ్రాంచైజ్‌గా వస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ నుంచి త్వరలోనే ప్రొడక్షన్ హౌస్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశాలున్నాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


