Raaka: అల్లు అర్జున్ ‘రాకా’లో టాలీవుడ్ భామ.. సంచలన ప్రకటన చేసిన ఎస్‌కేఎన్.. గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ ఎవరంటే?
Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బిగ్గెస్ట్ కమర్షియల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న భారీ మూవీ 'రాకా'. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో తెలుగు భామ నటిస్తున్నట్లు సంచలన ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ ప్రకటించాడు. మరి ఆ యాక్ట్రెస్ ఎవరో ఇక్కడ చూసేయండి.
Raaka: 'పుష్ప 2' తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ 'రాకా'. కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా కాస్టింగ్ కి సంబంధించి టాలీవుడ్‌లో ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది.

'రాకా' లోకి తెలుగు బ్యూటీ సిరి హనుమంతు!
రీసెంట్‌గా ‘సీతా పయనం’ సినిమాలో మెరిసిన సిరి హనుమంతు గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. అల్లు అర్జున్-అట్లీ కాంబోలో వస్తున్న రాకా సినిమాలో నటించే బంపర్ ఆఫర్ దక్కింది. ఇటీవల జరిగిన చెన్నై లవ్ స్టోరీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ (SKN) ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించాడు.
సిరి క్యారెక్టర్ గురించిన వివరాలను మేకర్స్ గోప్యంగా ఉంచారు. అయినప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న బిగ్ కమర్షియల్ ప్రాజెక్ట్‌లో ఆమెకు చోటు దక్కడం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
చెన్నై లవ్ స్టోరీలో
సిరి వరుస సినిమాలతో బిజీగా మారింది. ఈ బ్యూటీ త్వరలో రిలీజ్ కానున్న చెన్నై లవ్ స్టోరీ మూవీలో నటించింది. ఇప్పుడు రాకాలో నటిస్తోంది. తమిళ డైరెక్టర్ అట్లీ తన సినిమాల్లో కేవలం లీడ్ స్టార్స్ మాత్రమే కాకుండా ప్రామిసింగ్ యంగ్ టాలెంట్‌కు సాలిడ్ రోల్స్ ఇవ్వడంలో సిద్ధహస్తుడు. బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ 'జవాన్' సినిమాలో పలువురు యంగ్ యాక్టర్లకు ప్రాధాన్యత ఇచ్చినట్లే, 'రాకా' లోనూ సిరి హనుమంతు క్యారెక్టర్‌ను చాలా పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారనే టాక్ వినిపిస్తోంది.
షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో వచ్చిన జవాన్ మూవీలోనూ సిరి కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు రాకాలోనూ డైరెక్టర్ ఆమెను కొనసాగిస్తున్నాడు.
సన్ పిక్చర్స్ గ్రాండ్ విజన్
ప్రస్తుతం రాకా సినిమా షూటింగ్ ముంబైలో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లలో శరవేగంగా జరుగుతోంది. గ్లోబల్ స్టార్ దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండగా, యంగ్ సెన్సేషన్ సాయి అభ్యభయంకర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు. అల్లు అర్జున్ మేకోవర్, అట్లీ విజువల్ టేకింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. 2027 చివరినాటికి ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను థియేటర్లలోకి తీసుకురావడానికి సన్ పిక్చర్స్ సన్నాహాలు చేస్తోంది.
అట్లీ స్కెచ్
అల్లు అర్జున్ అంతర్జాతీయ ఇమేజ్‌కి అట్లీ కమర్షియల్ మాస్ విజన్ తోడవ్వడం 'రాకా' మూవీకి అతిపెద్ద అడ్వాంటేజ్. ఒకవైపు దీపికా పదుకొణె వంటి గ్లోబల్ స్టార్స్, మరోవైపు సిరి హనుమంతు వంటి లోకల్ టాలెంట్‌ను బ్యాలెన్స్ చేస్తూ అట్లీ వేస్తున్న కాస్టింగ్ స్కెచ్ చాలా తెలివైంది. సన్ పిక్చర్స్ పెడుతున్న భారీ బడ్జెట్, సాయి అభ్యభయంకర్ అందించే ఫ్రెష్ మ్యూజిక్ ఈ సినిమాను 2027 నాటికి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మరో కొత్త మైలురాయిగా నిలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


