Allu Arjun: ఐకాన్ స్టార్ రూలింగ్.. టాలీవుడ్ టు బాలీవుడ్.. అల్లు అర్జున్ హిస్టారికల్ లైనప్.. ఇండియాను షేక్ చేసే సినిమాలు!

Allu Arjun: 'పుష్ప' ఫ్రాంచైజీతో ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లైనప్ మామూలుగా లేదు. ప్రస్తుతం ఇండియాలోని టాప్ మోస్ట్ డైరెక్టర్లతో బ్యాక్-టు-బ్యాక్ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్స్‌ను ఐకాన్ స్టార్ లైన్‌లో పెట్టారు. అల్లు అర్జున్ చేయబోయే తర్వాతి సినిమాలు ఏంటో చూసేయండి.

Published on: Jul 15, 2026, 12:34:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Allu Arjun: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు ప్రాంతీయ మార్కెట్లకే పరిమితమైన స్టార్డమ్, ఇప్పుడు సరిహద్దులు దాటి విస్తరిస్తోంది. ఈ ట్రెండ్‌ను పక్కాగా ఒడిసిపట్టుకుని, సౌత్ టు నార్త్ అన్ని మేజర్ ఇండస్ట్రీలను కవర్ చేస్తూ హిస్టారికల్ లైనప్‌ను సెట్ చేసుకుంటున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం అల్లు అర్జున్ చేయబోయే సినిమాల లైనప్ చూస్తే మైండ్ బ్లాక్ అవడం ఖాయం.

ఐకాన్ స్టార్ రూలింగ్.. టాలీవుడ్ టు బాలీవుడ్.. అల్లు అర్జున్ హిస్టారికల్ లైనప్.. ఇండియాను షేక్ చేసే సినిమాలు!
ఐకాన్ స్టార్ రూలింగ్.. టాలీవుడ్ టు బాలీవుడ్.. అల్లు అర్జున్ హిస్టారికల్ లైనప్.. ఇండియాను షేక్ చేసే సినిమాలు!

1. అట్లీ ‘రాకా’

అల్లు అర్జున్, మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘రాకా’. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో బాలీవుడ్ టాప్ నటి దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది.

బాలీవుడ్ పై గురి

‘పుష్ప’ చిత్రంతో నార్త్ బెల్ట్‌లో అల్లు అర్జున్‌కు వచ్చిన క్రేజ్‌ను స్టెబిలైజ్ చేయడానికి ‘రాకా’ మూవీ అనేది పక్కా ప్లాన్. బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్‌కు ‘జవాన్’తో రూ.1000 కోట్ల బ్లాక్‌బస్టర్ ఇచ్చిన అట్లీ, ఇప్పుడు బన్నీ మాస్ ఇమేజ్‌ను నార్త్ మార్కెట్‌కు సరిపోయేలా సరికొత్త రగ్గడ్ అవతారంలో ప్రజెంట్ చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఇంటెన్స్ బాల్డ్ లుక్ విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది.

2. లోకేష్ కనగరాజ్ తో

కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ 23వ చిత్రం (AA23) తెరకెక్కనుంది. దీనికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. లోకేష్ సినిమా అంటేనే డార్క్ యాక్షన్, లీనియర్ స్క్రీన్‌ప్లే ఉంటుంది. ఈ కాంబో అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో ఒకటే చర్చ నడుస్తోంది. బన్నీ ఈ చిత్రంతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) లోకి అడుగుపెట్టబోతున్నారా లేదా అనేది మాత్రం సస్పెన్స్.

3. మలయాళ సెన్సేషన్ బసిల్ జోసెఫ్

అల్లు అర్జున్ కెరీర్‌లో ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్ అయిన 25వ సినిమాను (AA25) మలయాళంలో ‘మిన్నల్ మురళి’ లాంటి విలక్షణమైన సూపర్ హీరో చిత్రాన్ని తీసిన బసిల్ జోసెఫ్ డైరెక్ట్ చేయబోతున్నట్లు ఇండస్ట్రీ టాక్.

కేరళలో అల్లు అర్జున్‌కు రెండు దశాబ్దాలుగా ‘మల్లు అర్జున్’ అనే భీభత్సమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఒక మలయాళ డైరెక్టర్‌తో బన్నీ సినిమా చేయడం ఇదే తొలిసారి కాబోతుండటం విశేషం. బాసిల్ జోసెఫ్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఐకాన్ అనే పేరుతో ఉన్న క్యాప్ ఫొటో పెట్టడం వైరల్ గా మారింది.

సొంత బ్యానర్ లో

అల్లు అర్జున్- బాసిల్ జోసెఫ్ మూవీని సొంత బ్యానర్ అయిన గీతా ఆర్ట్స్ పై నిర్మిస్తారని సమాచారం. ఈ మూవీ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు బసిల్ జోసెఫ్ మార్క్ అద్భుతమైన హ్యూమర్, ఎమోషన్స్ కలబోతగా ఉండబోతుందని టాక్.

4. సంజయ్ లీలా భన్సాలీతో చర్చలు!

ఇక బాలీవుడ్ లెజెండరీ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ ముంబైలో బన్నీని కలిసి ఒక భారీ హిస్టారికల్ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ గురించి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. షెడ్యూల్స్ అన్నీ కుదిరితే ఈ కాంబినేషన్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ విజువల్ గ్రాండియర్ మూవీగా నిలిచే అవకాశం ఉంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More