Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో కోర్టుకు రాని అల్లు అర్జున్..ఇప్పుడు ఏం జరుగుతుంది? న్యాయస్థానం ఆదేశాలు ఇవే!

Allu Arjun: హైదరాబాద్‌ సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టు ఎదుట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేరుగా హాజరుకాలేదు. ముంబైలో సినిమా షూటింగ్‌లో ఉన్నందున వర్చువల్‌గా హాజరవుతాడని ఆయన లీగల్ టీమ్ కోర్టుకు తెలిపింది. దీనిపై న్యాయస్థానం ఆదేశాలు ఏంటో ఇక్కడ చూసేయండి.

Published on: Jun 22, 2026, 12:20:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Allu Arjun: హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా థియేటర్‌లో 'పుష్ప 2: ది రూల్' ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన విషాదకర తొక్కిసలాట కేసులో సోమవారం (జూన్ 22) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణకు సంబంధించి నాంపల్లి క్రిమినల్ కోర్టు ఎదుట సినీ నటుడు అల్లు అర్జున్ నేరుగా హాజరుకాలేదు.

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో కోర్టుకు రాని అల్లు అర్జున్..ఇప్పుడు ఏం జరుగుతుంది? (x/alluarjun)
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో కోర్టుకు రాని అల్లు అర్జున్..ఇప్పుడు ఏం జరుగుతుంది? (x/alluarjun)

అల్లు అర్జున్ లీగల్ టీమ్

సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో వ్యక్తిగతంగా అటెండ్ కావాలని అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. కానీ ప్రస్తుతం ఆయన ముంబైలో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారని, అందుకే వ్యక్తిగతంగా రాలేకపోయారని బన్నీ తరఫు న్యాయవాదుల బృందం (లీగల్ టీమ్) న్యాయస్థానానికి వివరించింది.

"ఈరోజు వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు సమన్లు జారీ చేసింది. అయితే ముంబైలో సినిమా షూటింగ్ జరుగుతున్నందున అల్లు అర్జున్ ఆన్‌లైన్ ద్వారా హాజరయ్యేందుకు అనుమతి కోరారు. ఆయన నాంపల్లి కోర్టు విచారణకు వర్చువల్‌గా హాజరవుతారు" అని నటుడి లీగల్ టీమ్ స్పష్టం చేసింది.

న్యాయస్థానం ఆదేశాలు

అల్లు అర్జున్ కోర్టుకు రాకపోవడంతో అతని న్యాయవాది ఆబ్సెంట్ పిటిషన్ వేశారు. అయితే మోమో దాఖలు చేయాలని న్యాయస్థానం సూచించింది. ఈ కేసును జులై 6కు కోర్టు వాయిదా వేసింది. అయితే అప్పుడు కూడా అల్లు అర్జున్ వర్చువల్ గానే హాజరు అవుతాడని అతని లాయర్ కోర్టుకు తెలిపారు. మరి దీనిపై కోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

ఏ11గా అల్లు అర్జున్

2024 డిసెంబర్లో 'పుష్ప 2' ప్రత్యేక ప్రదర్శన సమయంలో జరిగిన ఈ తొక్కిసలాట ఘటనపై నాంపల్లి కోర్టు గతంలోనే నిందితులకు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ను 11వ నిందితుడిగా (A11) చేర్చారు. సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని, నిర్వాహకులను 1 నుంచి 10వ నిందితులుగా (A1–A10) పేర్కొన్నారు. థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి నాంపల్లి కోర్టు మొత్తం 19 మంది నిందితులకు సమన్లు జారీ చేసింది.

నిందితులు చేసిన పలు తప్పుల వల్లే ఈ తొక్కిసలాట జరిగిందని పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. సరైన ముందస్తు అనుమతులు లేకుండానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని, అక్కడ కనీస భద్రతా ఏర్పాట్లు కూడా చేయలేదని దర్యాప్తులో తేలింది. అలాగే పోలీసుల మార్గదర్శకాలను, నిబంధనలను నిర్వాహకులు పూర్తిగా ఉల్లంఘించారని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే.

రాకా షూటింగ్ లో

అల్లు అర్జున్ ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న 'రాకా' (Raaka) సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతున్నందు వల్లే బన్నీ కోర్టుకు రాలేకపోయారని సమాచారం.

సోషల్ మీడియాలో ట్రోల్స్

అయితే అల్లు అర్జున్ కేసు విచారణ కోసం కోర్టుకు రాకపోవడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. సెలబ్రిటీ అయితే ఏంటీ? అందరూ చట్టం ముందు సమానమే అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More