370 Biryani Controversy: రూ.370 బిర్యానీ వివాదంలో కమెడియన్ ప్రణిత్ మోరేపై కేసు- క్రౌడ్ వర్క్ పేరిట హద్దులు దాటితే అంతే!
370 Biryani Controversy: సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన ‘370 బిర్యానీ’ వివాదంలో స్టాండప్ కమెడియన్ ప్రణిత్ మోరే, హిమాన్షు జంగ్రాలపై గురుగ్రామ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మహిళలను కించపరిచేలా ఉన్న ఈ వీడియోను డిలీట్ చేయాలని ఐటీ యాక్ట్ కింద ఆర్డర్స్ జారీ అయ్యాయి.
370 Biryani Controversy: ఇంటర్నెట్‌లో ఒక చిన్న వీడియో క్లిప్ ఎంతటి లీగల్ వివాదానికి దారితీస్తుందో చెప్పడానికి తాజా ‘రూ.370 బిర్యానీ’ వ్యవహారమే ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. మహిళల ఆత్మగౌరవాన్ని, మర్యాదను భంగపరిచేలా మాట్లాడిన ఈ కేసులో స్టాండప్ కమెడియన్ ప్రణిత్ మోరే (Pranit More), హిమాన్షు జంగ్రాలపై పోలీసులు చట్టపరమైన చర్యలు చేపట్టారు.

ప్రణిత్ మోరేపై కేసు
రూ.370 బిర్యానీ వివాదం ఎంతటి సంచలనంగా మారిందో తెలిసిందే. స్టాండప్ కామెడీ షోకు వెళ్లిన హిమాన్షు జంగ్రా నోరు అదుపు తప్పి మాట్లాడటం కలకలం రేపింది. అందులోనూ ఓ అమ్మాయి గురించి అసభ్యంగా మాట్లాడటం తీవ్ర విమర్శలకు కారణమైంది. ఈ నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ (NCW) తీవ్రంగా స్పందించడంతో గురుగ్రామ్ పోలీసులు నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
గురుగ్రామ్ పోలీసుల ఎఫ్ఐఆర్
గురుగ్రామ్‌లోని డిఎల్‌ఎఫ్ ఫేజ్-2 పోలీస్ స్టేషన్‌లో ప్రణీత్ మోరె, హిమాన్షు పై ఎఫ్ఐఆర్ నమోదైంది. కేవలం పాత ఐటీ యాక్ట్ మాత్రమే కాకుండా, కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహితలోని కఠినమైన సెక్షన్లను పోలీసులు ఇక్కడ ప్రయోగించారు. ఐటీ యాక్ట్ లోని సెక్షన్ 67, భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 294, 353(3), 75(2), 75(3) కింద కేసు బుక్ చేశారు.
కేసు తీవ్రత దృష్ట్యా ప్రణిత్ మోరే, హిమాన్షులకు పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.
'క్రౌడ్ వర్క్' పేరిట రీల్స్ పిచ్చి
స్టాండప్ కామెడీలో ప్రస్తుతం ‘క్రౌడ్ వర్క్’ అనేది ఒక పెద్ద ట్రెండ్. ఇందులో కమెడియన్లు ముందుగా స్క్రిప్ట్ సిద్ధం చేసుకోకుండా, ఆడియన్స్‌తో లైవ్‌గా మాట్లాడుతూ హస్యాన్ని పండిస్తారు. ప్రణిత్ మోరే నిర్వహించిన ఇలాంటి ఒక షోలోనే హిమాన్షు జంగ్రా అనే ప్రేక్షకుడు తాను గతంలో డేట్ చేసిన ఒక అమ్మాయి గురించి, '370 రూపాయల బిర్యానీ' బిల్లు కట్టి, ఆ అమ్మాయిని తనతో గడపాలని బలవంతం చేసిన విషయం గురించి చెప్పాడు.
ఇదో వార్నింగ్
ఈ రోజుల్లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో వైరల్ అవ్వడం కోసం కమెడియన్లు ఇలాంటి 'రా' కంటెంట్‌ను ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నారు. వ్యూస్ కోసం మహిళల వ్యక్తిగత జీవితాలను, వారి క్యారెక్టర్‌ను రోడ్డుపైకి లాగడం అనేది ఇక్కడ విమర్శలకు దారితీసింది. ఆడియన్స్ చప్పట్లు కొడుతున్నారు కదా అని ఫ్లోలో కొట్టుకుపోతే ఎలాంటి లీగల్ పరిణామాలు ఉంటాయో అనే విషయంలో ఈ కేసు ఇండస్ట్రీకి ఒక హెచ్చరికలా నిలిచింది.
ఉద్యోగం ఊడింది.. కమెడియన్ల పశ్చాత్తాపం
వివాదం ముదరడంతో హిమాన్షు జంగ్రా ఇన్‌స్టాగ్రామ్‌లో బహిరంగ క్షమాపణలు చెప్పాడు. "కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే ఆ కథను కాస్త మార్చి అబద్ధాలు చెప్పాను. ఈ వివాదం వల్ల నా ఉద్యోగం కూడా ఊడిపోయింది. ఇంట్లో వాళ్ళ ముఖాలు చూడలేకపోతున్నా" అని హిమాన్షు చెప్పాడు.
మరోవైపు కమెడియన్ ప్రణిత్ మోరే కూడా స్పందిస్తూ.. "ఆడియన్స్ నవ్వేసరికి నేను కూడా ఆ ఫ్లోలో కొట్టుకుపోయి తప్పు చేశాను. నన్ను క్షమించండి" అని వేడుకున్నాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


