పోలీసులకు ది రాజా సాబ్ నిర్మాత ఫిర్యాదు.. హద్దులు దాటితే ఊరుకోం అంటూ సీరియస్ అయిన ఎస్‌కేఎన్

ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమాపై సోషల్ మీడియాలో జరుగుతున్న విపరీతమైన ట్రోలింగ్‌పై నిర్మాత ఎస్‌కేఎన్ పోలీసులను ఆశ్రయించారు. తన పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి సినిమాను, నటీనటులను కించపరుస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Published on: Jan 24, 2026, 11:35:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి తెరకెక్కించిన ‘ది రాజా సాబ్’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంజయ్ దత్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ వంటి భారీ తారాగణంతో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను మూటగట్టుకుంది.

పోలీసులకు ది రాజా సాబ్ నిర్మాత ఫిర్యాదు.. హద్దులు దాటితే ఊరుకోం అంటూ సీరియస్ అయిన ఎస్‌కేఎన్
పోలీసులకు ది రాజా సాబ్ నిర్మాత ఫిర్యాదు.. హద్దులు దాటితే ఊరుకోం అంటూ సీరియస్ అయిన ఎస్‌కేఎన్

సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు

అయితే, సినిమా ఫలితం ఎలా ఉన్నా.. సోషల్ మీడియాలో ది రాజా సాబ్‌పై జరుగుతున్న నెగెటివ్ క్యాంపెయిన్, ట్రోలింగ్ ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ఈ సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఎస్‌కేఎన్ (SKN), శుక్రవారం (జనవరి 23) నాడు హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

తన పేరుతో ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్ సృష్టించి, ది రాజా సాబ్ సినిమాను, అందులోని నటీనటులను ఉద్దేశపూర్వకంగా కించపరుస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ కోరారు.

"కొందరు వ్యక్తులు నా పేరుతో తప్పుడు పోస్ట్‌లు పెడుతూ ప్రేక్షకులను అయోమయానికి గురిచేస్తున్నారు. సినిమాపై విషం చిమ్మడమే లక్ష్యంగా పెట్టుకున్న ఇలాంటి వారిని ఉపేక్షించబోం. హద్దులు దాటితే ఊరుకోం. ప్రస్తుతం ఈ విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. త్వరలోనే బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయి" అని ఎస్‌కేఎన్ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

ముందే హెచ్చరించిన నిర్మాత

ది రాజా సాబ్ టీజర్ విడుదల సమయంలోనే ఎస్‌కేఎన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షూటింగ్ మొదలైనప్పటి నుంచే ఒక నిర్మాత ఈ సినిమాపై నెగెటివ్ ప్రచారం చేయాలని చూశారని, కానీ ప్రభాస్ అలాంటి మాటలు నమ్మకుండా సినిమా పూర్తి చేశారని ఎస్‌కేఎన్ గుర్తు చేశారు. ది రాజా సాబ్ మూవీ రిలీజ్ తర్వాత ట్రోలర్స్ ప్రధానంగా ఎస్‌కేఎన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తుండటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

బాక్సాఫీస్ వద్ద పరిస్థితి

ఇదిలా ఉంటే, సుమారు రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ది రాజా సాబ్ మూవీ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల వసూళ్లను మాత్రమే సాధించింది.

ది రాజా సాబ్ కథ

తప్పిపోయిన తన తాతయ్య కోసం వెతుకుతూ ఒక పాత బంగళాలోకి వెళ్లిన యువకుడికి అక్కడ ఎదురైన భయానక పరిస్థితుల నేపథ్యంలో ది రాజా సాబ్ అనే హారర్-కామెడీ డ్రామా సాగుతుంది.

సంక్రాంతి బరిలో చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ వంటి భారీ చిత్రాల నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ, ప్రభాస్ క్రేజ్ వల్ల వసూళ్లు నిలకడగానే ఉన్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More