Deepika Padukone ICC: రెండోసారి తల్లి కాబోతున్న దీపికా పదుకొణె.. ఆ ఐసీసీ రూల్స్‌పై ప్రశంసలు.. విమెన్ క్రికెటర్లకు వరం
Deepika Padukone ICC: ప్రగ్నెన్సీ తర్వాత మళ్లీ ఆటలోకి వచ్చేలా విమెన్ క్రికెటర్ల కోసం ఐసీసీ తెచ్చిన కొత్త రూల్స్ పై దీపికా పదుకొణె ప్రశంసలు కురిపించింది. రెండో సారి బిడ్డకు జన్మనివ్వబోతున్న తరుణంలో ఆమె చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Deepika Padukone ICC: మాతృత్వం అనేది ఏ రంగంలోనైనా ఒక మహిళ కెరీర్‌కు బ్రేక్ కాకూడదనే దిశగా ఐసీసీ (ICC) ఛైర్మన్ జై షా నేతృత్వంలో తీసుకున్న ‘పోస్ట్-ప్రెగ్నెన్సీ గైడ్‌లైన్స్’ నిర్ణయంపై గ్లోబల్ వైడ్ ప్రశంసలు దక్కుతున్నాయి. దీనిపై బాలీవుడ్ అగ్ర నటి దీపికా పదుకొణె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా స్పందించడం ఇప్పుడు సినీ, క్రీడా రంగాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

దీపికా పదకొణె రియాక్షన్
2018లో రణ్‌వీర్ సింగ్‌ను వివాహం చేసుకుని, 2024లో కుమార్తె దువాకు జన్మనిచ్చింది దీపికా పదుకొణె. ప్రస్తుతం తన రెండో ప్రెగ్నెన్సీ ఫేజ్‌ను ఆమె ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో ప్రెగ్నెన్సీ తర్వాత విమెన్ క్రికెటర్ల కమ్ బ్యాక్ కోసం ఐసీసీ తీసుకున్న గైడ్‌లైన్స్‌ను క్రీడారంగంలో ఒక సరికొత్త మైలురాయిగా దీపినా పేర్కొంది.

దీపికా ఓపెన్ వార్
దీపికా కేవలం ఒక సోషల్ మీడియా పోస్ట్‌కు మాత్రమే పరిమితం కాలేదు. వర్కింగ్ మదర్స్ హక్కుల గురించి, ముఖ్యంగా గ్లామర్ ఇండస్ట్రీలో ఉండే మితిమీరిన శ్రమ గురించి ఆమె నిరంతరం గళం విప్పుతూనే ఉంది. గత నవంబర్ లో ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. "మన సమాజం విపరీతమైన అలసటను సైతం అంకితభావంగా పొరబడుతోంది. మానవ శరీరానికి రోజుకు 8 గంటల పని మాత్రమే సరిపోతుంది" అని గట్టిగా చెప్పింది.
ఆ సినిమాల నుంచి ఔట్
ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ ‘స్పిరిట్’ నుంచి ఇప్పటికే దీపికాను తప్పించిన సంగతి తెలిసిందే. అలాగే ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌లో కూడా ఆమె నటించడం లేదని మేకర్స్ అనౌన్స్ చేశారు. దీని వెనుకాల ఉన్న కారణాలు ఇప్పటికే హాట్ టాపిక్ గా మారాయి.
ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్ ప్రకారం, దీపికా తన సినిమాల కోసం పక్కా కార్పొరేట్ స్ట్రైల్ కండిషన్స్ పెడుతున్నారు. రోజుకు కేవలం 7 నుంచి 8 గంటల షిఫ్ట్ మాత్రమే చేస్తానని, ఒకవేళ గంట దాటితే అదనపు పారితోషికం ఇవ్వాలని, అలాగే సినిమా లాభాల్లో వాటా కావాలని ఆమె డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
ఐసీసీ గైడ్‌లైన్స్‌తో కనెక్షన్
ఐసీసీ తీసుకొచ్చిన కొత్త పాలసీ కూడా క్రీడాకారిణులు ప్రెగ్నెన్సీ తర్వాత దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి లేదా మాతృత్వానికి మధ్య ఒకదాన్నే ఎంచుకోవాల్సిన అవసరం లేకుండా వర్క్‌లోడ్‌ను సురక్షితంగా నిర్వహించేలా టైమ్‌లైన్స్ సెట్ చేసింది. దీపికా సరిగ్గా ఇలాంటి ఒక వ్యవస్థీకృత మార్పునే సినీ పరిశ్రమలో కూడా ఆశిస్తోంది కాబట్టే, ఐసీసీ నిర్ణయాన్ని అంతలా ఓపెన్‌గా ఓన్ చేసుకుంది.
అల్లు అర్జున్‌తో ‘రాకా’
సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ ‘రాకా’ (Raaka) లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తోంది. స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ 2027లో గ్లోబల్ వైడ్ రిలీజ్ కానుంది. దీనితో పాటు షారుఖ్ ఖాన్‌తో కలిసి ‘కింగ్’ సినిమాలో కూడా దీపికా నటిస్తూ కెరీర్ అండ్ పర్సనల్ లైఫ్‌ను పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తోంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


