టీ20 ప్రపంచకప్ లో ఇండియాతో ఆడాలంటే ఆ 3 కండీషన్లకు ఓకే చెప్పాల్సిందే.. ఐసీసీ ముందు పీసీబీ షాకింగ్ డిమాండ్స్!

టీ20 ప్రపంచకప్ లో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ చుట్టూ నెలకొన్న వివాదంలో కీలక పరిణామలు చోటు చేసుకుంటున్నాయి.  ఈ వరల్డ్ కప్ లో ఇండియాతో మ్యాచ్ ఆడాలంటే ఐసీసీకి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మూడు కండీషన్లు పెట్టినట్లు తెలిసింది. 

Published on: Feb 09, 2026 11:26 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ అంటే క్రికెట్ ప్రపంచం మొత్తం ఊగిపోతుంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు లేకపోవడంతో ఈ చిరకాల ప్రత్యర్థులు కేవలం ఐసీసీ టోర్నీల్లోనే తలపడున్నాయి. అయితే ఇప్పుడు టీ20 ప్రపంచకప్ లో ఇండియాతో మ్యాచ్ ను పాకిస్థాన్ బాయ్ కాట్ చేసింది. కానీ టీమిండియాతో ఆడాలంటే మూడు కండీషన్లకు ఓకే చెప్పాలని ఐసీసీకి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తెలిపిందనే వార్తలు వస్తున్నాయి.

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోసిన నఖ్వీ (X)
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోసిన నఖ్వీ (X)

మూడు కండీషన్లు

టీ20 ప్రపంచకప్ లోె ఇండియాతో మ్యాచ్ ఆడాలని పాకిస్థాన్ పై అన్ని వైపుల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం (ఫిబ్రవరి 8) రాత్రి లాహోర్ లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ), ఐసీసీ ప్రతినిధి మధ్య మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లోనే టీమిండియాతో ప్రపంచకప్ లో ఆడాలంటే మూడు కండీషన్లను ఐసీసీ ముందు పీసీబీ పెట్టినట్లు తెలిసింది.

వాటా ఇవ్వాలంటూ

పీసీబీ మూడు కండీషన్లు ఇవే అంటూ క్రిక్ బజ్ తన రిపోర్ట్ లో పేర్కొంది. అందులో ఒకటేమో.. ఐసీసీ ఆదాయంలో పాకిస్థాన్ కు వచ్చే వాటాను పెంచడం. రెండోది.. భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ లను మళ్లీ నిర్వహించడం. మూడోది.. ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ లో ఆటగాళ్లు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడం. ఈ మూడు కండీషన్లకు ఓకే చెప్తే ఇండియాతో టీ20 ప్రపంచకప్ మ్యాచ్ ఆడతామని పీసీబీ చెప్పినట్లు తెలిసింది.

శ్రీలంక జోక్యం

షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న శ్రీలంకలోని కొలంబో స్టేడియంలో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరగాల్సింది. కానీ బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను ఐపీఎల్ లో ఆడకుండా బీసీసీఐ వేటు వేయడం, ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ టీమ్ ను ఐసీసీ తప్పించడంతో వివాదం ముదిరింది. బంగ్లాదేశ్ కు సపోర్ట్ గా ప్రపంచకప్ లో ఇండియాతో మ్యాచ్ ను బాయ్ కాట్ చేస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది.

కానీ ప్రపంచకప్ అంటేనే ఇండియా వర్సెస్ పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అనేలా మారిపోయింది. ఈ దాయాదుల మధ్య మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఆత్రుతగా ఎదురు చూస్తారు. ఈ మ్యాచ్ జరిగితే శ్రీలంక క్రికెట్ బోర్డుకు పేరు, ఆదాయం వస్తాయి. అందుకే పాక్, ఇండియా మ్యాచ్ జరిగేలా శ్రీలంక జోక్యం చేసుకుంటోంది.

మరో 48 గంటల్లో

టీ20 ప్రపంచకప్ లో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ పై మరో 48 గంటల్లో నిర్ణయం ప్రకటిస్తారని తెలుస్తోంది. అయితే పీసీబీ మూడు కండీషన్లను ఐసీసీ ఒప్పుకుంటుందా? లేదా? అన్నదే ఇక్కడ కీలకం. ప్రస్తుత పరిస్థితుల్లో పాక్ తో భారత్ ద్వైపాక్షిక సిరీస్ లు ఆడటం జరగదనే చెప్పాలి. అలాగే ఆ దేశ ఆటగాళ్లతో మనవాళ్లు హ్యాండ్ షేక్ చేయరు. ఛాంపియన్స్ ట్రోఫీలో అలాగే జరిగింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More