గాల్లో ఎగురుతూ వచ్చిన కప్..టీ20 ప్రపంచకప్ ఓపెనింగ్ సెర్మనీ.. బాద్షా పాట..నోరా ఆట..టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్..బుమ్రా ఔట్

వావ్.. కళ్లు మెరిసేలా, కాళ్లు కదిలేలా టీ20 ప్రపంచకప్ ఓపెనింగ్ సెర్మనీ కన్నుల పండుగగా జరిగింది. డ్రమ్స్ తో శివమణి, వీణతో రిషబ్ శర్మ మ్యాజిక్ చేశారు. ఐసీసీ ఛైర్మన్ జై షాతో కలిసి రోహిత్ శర్మ ట్రోఫీని గ్రౌండ్ లోకి తెచ్చాడు. అమెరికాతో మ్యాచ్ లో ఇండియా టాస్ ఓడింది. ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది.  

Published on: Feb 07, 2026 6:41 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శివమణి డ్రమ్స్ తో, రిషబ్ శర్మ వీణతో మ్యాజిక్ చేశారు. వీళ్లు సంగీత వాయిద్యాలు వాయిస్తుంటే స్టేడియం మొత్తం ఊగిపోయింది. టీ20 ప్రపంచకప్ 2026 ఓపెనింగ్ సెర్మనీ గ్రాండ్ గా జరిగింది. ఈ టీ20 ప్రపంచకప్ లో ఇండియా తన ఫస్ట్ మ్యాచ్ అమెరికాతో ఆడుతోంది. టాస్ గెలిచిన అమెరికా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది.

నోరా ఫతేహి (AFP)
నోరా ఫతేహి (AFP)

ట్రోఫీతో రోహిత్

జెట్ ప్యాక్ తో ఓ వ్యక్తి గాల్లో ఎగురుతూ ప్రపంచకప్ ట్రోఫీని స్టేడియంలోకి తీసుకొచ్చాడు. దీంతో కప్ ఎగురుతూ వచ్చినట్లు అనిపించింది. ఆ తర్వాత ఐసీసీ ఛైర్మన్ జై షా, టీ20 ప్రపంచకప్ అంబాసిడర్ రోహిత్ శర్మ కలిసి ట్రోఫీని మైదానంలోకి తెచ్చారు. రోహిత్ శర్మ ట్రోఫీ పట్టుకుని నడుచుకుంటూ వచ్చాడు. వెంటనే డ్రమ్స్ మోతతో స్టేడియం మార్మోగింది. అనంతరం అమెరికా టాస్ గెలిచింది. బౌలింగ్ ఎంచుకుంది.

నోరా డ్యాన్స్

టాస్ వేసిన తర్వాత టీ20 ప్రపంచకప్ 2026 ఓపెనింగ్ సెర్మనీ కొనసాగింది. పాపులర్ ర్యాపర్ బాద్షా తన పాటలతో స్టేడియాన్ని ఊపేశాడు. ఇక బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి తన డ్యాన్స్ మూవ్స్ తో ఆడియన్స్ తో డ్యాన్స్ చేయించింది.

బుమ్రా దూరం

టీ20 ప్రపంచకప్ 2026లో తమ ఫస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది. అయితే స్టార్ పేసర్ బుమ్రా అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు.

నంబర్ వన్ టీమ్

టీ20 వరల్డ్ ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ టీమ్ గా ఇండియా ఈ ప్రపంచకప్ లో ఆడుతోంది. అలాగే టీ20ల్లో నంబర్ వన్ బ్యాటర్ అభిషేక్ శర్మ, నంబర్ వన్ బౌలర్ వరుణ్ చక్రవర్తి కూడా ఇండియా క్రికెటర్లే కావడం విశేషం. ఈ నేపథ్యంలో మన టీమ్ పై భారీ అంచనాలున్నాయి. సొంతగడ్డపై టైటిల్ నిలబెట్టుకోవాలన్నది ప్రతి ఒక్క ఫ్యాన్ ఆశ.

డిఫెండింగ్ ఛాంపియన్

టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో దిగుతోంది. 2024లో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ఇండియా ఛాంపియన్ గా నిలిచింది. అప్పుడు ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించింది. ఆ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టీ20 క్రికెట్ కు గుడ్ బై చెప్పారు.

టోర్నీ ఇలా

2026 టీ20 ప్రపంచకప్ కు ఇండియా, శ్రీలంక ఆతిథ్యమిస్తున్నాయి. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు తలపడుతున్నాయి. వీటిని నాలుగు గ్రూప్ లుగా విభజించారు. టీమ్-ఏ లో భారత్, పాకిస్థాన్, నెదర్లాండ్స్, నమీబియా, అమెరికా టీమ్స్ ఉన్నాయి. ఇప్పటికే టీ20 ప్రపంచకప్ స్టార్ట్ అయింది. శ్రీలంకలో పాక్ వర్సెస్ నెదర్లాండ్స్, కోల్ కతాలో వెస్టిండీస్ వర్సెస్ స్కాట్లాండ్ మ్యాచ్ లు జరిగాయి. ఇండియా హోస్ట్ కాబట్టి ఈ అమెరికాతో మ్యాచ్ కంటే ముందు ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More