టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ రిలీజ్ చేసిన ఐసీసీ.. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ఆరోజే.. బ్రాండ్ అంబాసిడర్‌గా రోహిత్ శర్మ
టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ రిలీజ్ చేసింది ఐసీసీ. ఈ మెగా టోర్నీకి రోహిత్ శర్మ బ్రాండ్ అంబాసిడర్ కావడం విశేషం. ఇక ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ఫిబ్రవరి 15న జరగనుంది.
భారత్, శ్రీలంకల సంయుక్త ఆతిథ్యంలో జరగనున్న 2026 పురుషుల టీ20 ప్రపంచ కప్ పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం (నవంబర్ 25) ముంబైలో జరిగిన ఒక ఈవెంట్‌లో అనౌన్స్ చేసింది. క్రికెట్ అభిమానులంతా ఉత్కంఠగా ఎదురుచూసే ఇండియా, పాకిస్థాన్ పోరు ఫిబ్రవరి 15న కొలంబోలో జరగనుంది. గతేడాది సెప్టెంబర్‌లో దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు విజయం సాధించింది. ఆ తర్వాత ఇరు జట్ల మధ్య జరుగుతున్న మొట్టమొదటి మ్యాచ్ ఇదే కానుంది.

భారత్ vs పాక్: మూడో మ్యాచ్ అదే
టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ ను ఐసీసీ రిలీజ్ చేసింది. అంతేకాదు ఈ మెగా టోర్నీకి మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటం విశేషం. ఇక భారీ అంచనాలున్న ఇండియా, పాకిస్థాన్ పోరు కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగుతుంది. ఇది గ్రూప్ దశలో భారత్‌కు మూడో మ్యాచ్. రోహిత్ శర్మ కెప్టెన్సీలో గతేడాది జూన్‌లో తమ రెండో టీ20 ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకున్న డిఫెండింగ్ ఛాంపియన్ భారత్.. గ్రూప్ బీలో యూఎస్ఏ, నెదర్లాండ్స్, నమీబియా, పాకిస్తాన్‌తో కలిసి ఉంది.
భారత్ తన తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న ముంబైలో యూఎస్ఏతో ఆరంభిస్తుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 12న ఢిల్లీలో నమీబియాతో తలపడుతుంది. ఫిబ్రవరి 15న కొలంబోలో పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 18న అహ్మదాబాద్‌లో నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌తో గ్రూప్ దశను ముగించనుంది.
భారత్, శ్రీలంకలలో ఎనిమిది వేదికలు
టీ20 వరల్డ్ కప్ 2026 ఎడిషన్‌కు భారత్, శ్రీలంకలు సంయుక్త ఆతిథ్యం ఇస్తున్నాయి. 10వ ఎడిషన్ టీ20 ప్రపంచ కప్ కోసం ఐసీసీ ఎనిమిది వేదికలను షార్ట్‌లిస్ట్ చేసింది. భారత్‌లో ఢిల్లీ, అహ్మదాబాద్, చెన్నై, కోల్‌కతా, ముంబైలలో జరగనున్నాయి. ఇక శ్రీలంకలో కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్, ఆర్. ప్రేమదాస స్టేడియం, అలాగే క్యాండీలలో మ్యాచ్ లు జరుగుతాయి. పాకిస్తాన్ తమ గ్రూప్ మ్యాచ్‌లు అన్నింటినీ కొలంబో, క్యాండీలలో ఆడనుంది.
ఫార్మాట్, నాకౌట్ మ్యాచ్‌ల వివరాలు
2026 టోర్నమెంట్ ఫార్మాట్‌లో ఎటువంటి మార్పు లేదు. మొత్తం 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్ నుండి టాప్ రెండు జట్లు సూపర్ 8కు అర్హత సాధిస్తాయి. ఈ ఎనిమిది జట్లను మళ్లీ నాలుగేసి జట్లు రెండు గ్రూపులుగా విభజిస్తారు. ఆ గ్రూపుల నుండి టాప్ రెండు జట్లు సెమీఫైనల్స్‌లోకి అడుగుపెడతాయి.
2026 టీ20 ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్‌ల వేదికలు అర్హత సాధించిన జట్లపై ఆధారపడి ఉంటాయి. పాకిస్తాన్ సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తే, వారి మ్యాచ్ కొలంబోలో జరుగుతుంది. ఇక రెండో సెమీఫైనల్ ముంబైలో జరుగుతుంది. సల్మాన్ అలీ ఆఘా నేతృత్వంలోని పాకిస్తాన్ ఫైనల్‌కు అర్హత సాధిస్తే, ఫైనల్ మ్యాచ్‌ను కొలంబోలో నిర్వహిస్తారు. లేదంటే, అహ్మదాబాద్‌లో జరుగుతుంది.
భారత్ రెండో సెమీఫైనల్‌ను ముంబైలో ఆడుతుంది. అయితే పాకిస్తాన్‌తో భారత్ తలపడాల్సి వస్తే, ఆ మ్యాచ్ కొలంబోకు మారుతుంది. భారత్, పాకిస్తాన్ లేదా శ్రీలంక.. ఈ మూడు జట్లలో ఏదీ క్వాలిఫై కాకపోయినా.. సెమీఫైనల్స్ కోల్‌కతా (మార్చి 4), ముంబై (మార్చి 5)లలో జరుగుతాయి. ఫైనల్ మ్యాచ్ మార్చి 8న జరుగుతుంది.
టోర్నీలో పాల్గొనే ఇతర జట్లు
ఆతిథ్య దేశాలతో పాటు టోర్నమెంట్‌లో పాల్గొనే ఇతర జట్లలో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వెస్టిండీస్, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్, కెనడా, ఇటలీ, నెదర్లాండ్స్, నమీబియా, జింబాబ్వే, నేపాల్, ఒమన్, యూఏఈ ఉన్నాయి. యూరోపియన్ క్వాలిఫైయర్‌లో చారిత్రక విజయం సాధించడం ద్వారా ఇటలీ తొలిసారిగా ఐసీసీ టోర్నమెంట్‌లో ఆడుతోంది.
ICC T20 ప్రపంచ కప్ 2026 గ్రూపులు
గ్రూప్ A: ఇండియా, పాకిస్తాన్, యూఎస్ఏ, నెదర్లాండ్స్, నమీబియా
గ్రూప్ B: ఆస్ట్రేలియా, శ్రీలంక, ఐర్లాండ్, జింబాబ్వే, ఒమన్
గ్రూప్ C: ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీ
గ్రూప్ D: న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, కెనడా, యూఏఈ
ICC T20 ప్రపంచ కప్ 2026 పూర్తి షెడ్యూల్ (గ్రూప్ దశ)
ఫిబ్రవరి 7, పాకిస్తాన్ vs నెదర్లాండ్స్, కొలంబో, 11:00 AM
ఫిబ్రవరి 7, వెస్టిండీస్ vs బంగ్లాదేశ్, కోల్‌కతా, 3:00 PM
ఫిబ్రవరి 7, భారత్ vs USA, ముంబై, 7:00 PM
ఫిబ్రవరి 8, న్యూజిలాండ్ vs ఆఫ్ఘనిస్తాన్, చెన్నై, 3:00 PM
ఫిబ్రవరి 8, ఇంగ్లాండ్ vs నేపాల్, ముంబై, 7:00 PM
ఫిబ్రవరి 8, శ్రీలంక vs ఐర్లాండ్,కొలంబో,7:00 PM
ఫిబ్రవరి 9,బంగ్లాదేశ్ vs ఇటలీ,కోల్‌కతా,11:00 AM
ఫిబ్రవరి 9,జింబాబ్వే vs ఒమన్,కొలంబో,3:00 PM
ఫిబ్రవరి 9,దక్షిణాఫ్రికా vs కెనడా,అహ్మదాబాద్,7:00 PM
ఫిబ్రవరి 10,నెదర్లాండ్స్ vs నమీబియా,అహ్మదాబాద్,11:00 AM
ఫిబ్రవరి 10,న్యూజిలాండ్ vs UAE,చెన్నై,3:00 PM
ఫిబ్రవరి 10,పాకిస్తాన్ vs UAE,కొలంబో,7:00 PM
ఫిబ్రవరి 11,దక్షిణాఫ్రికా vs ఆఫ్ఘనిస్తాన్,అహ్మదాబాద్,3:00 PM
ఫిబ్రవరి 11,ఆస్ట్రేలియా vs ఐర్లాండ్,కొలంబో,7:00 PM
ఫిబ్రవరి 11,ఇంగ్లాండ్ vs వెస్టిండీస్,ముంబై,7:00 PM
ఫిబ్రవరి 12,శ్రీలంక vs ఒమన్,క్యాండీ,3:00 PM
ఫిబ్రవరి 12,నేపాల్ vs ఇటలీ,ముంబై,7:00 PM
ఫిబ్రవరి 12,భారత్ vs నమీబియా,ఢిల్లీ,7:00 PM
ఫిబ్రవరి 13,ఆస్ట్రేలియా vs జింబాబ్వే,కొలంబో,3:00 PM
ఫిబ్రవరి 13,కెనడా vs నమీబియా,కొలంబో,7:00 PM
ఫిబ్రవరి 13,USA vs నెదర్లాండ్స్,చెన్నై,7:00 PM
ఫిబ్రవరి 14,ఐర్లాండ్ vs ఒమన్,కొలంబో,11:00 AM
ఫిబ్రవరి 14,ఇంగ్లాండ్ vs బంగ్లాదేశ్,కోల్‌కతా,3:00 PM
ఫిబ్రవరి 14,న్యూజిలాండ్ vs దక్షిణాఫ్రికా,అహ్మదాబాద్,7:00 PM
ఫిబ్రవరి 15,వెస్టిండీస్ vs నేపాల్,ముంబై,11:00 AM
ఫిబ్రవరి 15,USA vs నమీబియా,చెన్నై,3:00 PM
ఫిబ్రవరి 15,భారత్ vs పాకిస్తాన్,కొలంబో,7:00 PM
ఫిబ్రవరి 16,ఆఫ్ఘనిస్తాన్ vs UAE,ఢిల్లీ,11:00 AM
ఫిబ్రవరి 16,ఇంగ్లాండ్ vs ఇటలీ,కోల్‌కతా,3:00 PM
ఫిబ్రవరి 16,ఆస్ట్రేలియా vs శ్రీలంక,క్యాండీ,7:00 PM
ఫిబ్రవరి 17,న్యూజిలాండ్ vs కెనడా,చెన్నై,3:00 PM
ఫిబ్రవరి 17,ఐర్లాండ్ vs జింబాబ్వే,క్యాండీ,7:00 PM
ఫిబ్రవరి 18,బంగ్లాదేశ్ vs నేపాల్,ముంబై,11:00 AM
ఫిబ్రవరి 18,దక్షిణాఫ్రికా vs UAE,ఢిల్లీ,3:00 PM
ఫిబ్రవరి 18,పాకిస్తాన్ vs నమీబియా,కొలంబో,3:00 PM
ఫిబ్రవరి 18,భారత్ vs నెదర్లాండ్స్,అహ్మదాబాద్,7:00 PM
ఫిబ్రవరి 19,ఇటలీ vs వెస్టిండీస్,కోల్‌కతా,3:00 PM
ఫిబ్రవరి 19,శ్రీలంక vs జింబాబ్వే,కొలంబో,7:00 PM
ఫిబ్రవరి 20,ఆఫ్ఘనిస్తాన్ vs కెనడా,చెన్నై,3:00 PM
ఫిబ్రవరి 20,ఆస్ట్రేలియా vs ఒమన్,క్యాండీ,7:00 PM
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


