అమ్మాయిల ప్రపంచకప్ విక్టరీ.. రోహిత్ శర్మ ఎమోషనల్.. కంట్రోల్ చేసుకోలేని మాజీ కెప్టెన్ కళ్లలో నీళ్లు.. వీడియో వైరల్
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఎమోషనల్ అయ్యాడు. నీటితో అతను కళ్లు చెమ్మగిల్లాయి. భారత అమ్మాయిల జట్టు తొలిసారి ప్రపంచకప్ గెలుచుకున్న క్షణం రోహిత్ భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.
స్వదేశంలో ప్రపంచ కప్‌ను కోల్పోవడం ఎంత బాధ కలిగిస్తుందో రోహిత్ శర్మకు బాగా తెలుసు. నవంబర్ 19, 2023 నాటి చేదు జ్ఞాపకాన్ని ఎవరు మర్చిపోగలరు? అప్పుడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన 50 ఓవర్ల ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. ఆ టీమ్ కు రోహిత్ శర్మ కెప్టెన్. ఇప్పుడు ఇండియాలో మహిళల జట్టు వన్డే ప్రపంచకప్ గెలవగానే రోహిత్ ఫుల్ ఎమోషనల్ అయ్యాడు.

రోహిత్ కన్నీళ్లు
ఆదివారం (నవంబర్ 2) అర్ధరాత్రి నవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంలో భారత జట్టు తమ తొలి మహిళల ప్రపంచ కప్ టైటిల్‌ను గెలిచింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని టీమ్ చరిత్ర సృష్టించింది. స్టేడియంలో ఉన్న హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ తన భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయాడు. అతను కళ్లలో నీళ్లు కనిపించాయి. కిక్కిరిసిన స్టేడియంలో జరిగిన ఈ ఫైనల్ పోరులో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి హర్మన్‌ప్రీత్ జట్టు ట్రోఫీని ఎగరేసుకుపోయింది.
ఆ వికెట్ తో
ఆతిథ్య జట్టు పటిష్టమైన ప్రొటీస్ జట్టుపై ఆధిపత్యం చెలాయించింది. దీప్తి శర్మ 58 పరుగులు చేయడంతో పాటు ఐదు వికెట్లు తీసింది. ఆటలో చివరి వికెట్‌ను దీప్తి శర్మ పడగొట్టగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుతమైన క్యాచ్ పట్టి నాదిన్ డి క్లర్క్‌ను పెవిలియన్‌కు పంపింది. బంతి పట్టుకోగానే యావత్ జట్టు ఆ విజయాన్ని జరుపుకోవడానికి భారత కెప్టెన్ వద్దకు పరుగులు తీసింది. ఆటగాళ్లందరి కళ్లలో నీళ్లు తిరగడం ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు.
హిట్ మ్యాన్ ఎమోషనల్
అనంతరం కెమెరాలు త్వరగా స్టాండ్స్‌లో కూర్చున్న రోహిత్ వైపు మళ్లాయి. మహిళా జట్టు మొత్తం గ్రౌండ్‌లో సంబరాలు చేసుకుంటుండగా అతను మొదట చప్పట్లు కొడుతూ, ఉత్సాహపరుస్తూ కనిపించాడు. కాసేపటికే కెమెరాలు అతని ముఖంపై జూమ్ చేయగా డీవై పాటిల్‌లో బాణసంచా పేలుతుండగా, మాజీ భారత కెప్టెన్ ఆకాశం వైపు చూస్తూ కంటతడి పెట్టుకోవడం కనిపించింది. ఈ వీడియో వైరల్ గా మారింది.
మ్యాచ్ సాగిందిలా
నవీ ముంబైలో వర్షం కారణంగా భారత్, దక్షిణాఫ్రికా మహిళల ప్రపంచ కప్ 2025 ఫైనల్ మ్యాచ్ ప్రారంభం రెండు గంటలు ఆలస్యమైంది. చివరకు ప్రొటీస్ కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో మ్యాచ్ ప్రారంభమైంది.
భారత్ 298 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీనికి షఫాలీ వర్మ 87 పరుగుల ఇన్నింగ్స్ దోహదపడింది. బౌలింగ్‌లో కూడా, మళ్లీ షఫాలీయే గేమ్ ఛేంజర్‌గా నిరూపించుకుంది. ఆట ఆసక్తికరంగా సాగుతున్న సమయంలో ఆమె సునే లూస్ వికెట్‌ను పడగొట్టింది. వోల్వార్డ్ట్ మరోసారి సెంచరీ చేసినప్పటికీ దీప్తి వేసిన బౌలింగ్‌లో ఆమె ఔటవ్వడంతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. భారత్ 46వ ఓవర్‌లోనే మ్యాచ్‌ను ముగించింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper












