Deepika Padukone: వామ్మో.. అన్ని కోట్లా? అల్లు అర్జున్ రాకా కోసం దీపికా పదుకొణె రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవాల్సిందే!
Deepika Padukone: అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగాా నటిస్తున్న 'రాకా' చిత్రం సంచలన వార్తలతో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా భారీ బడ్జెట్, నటీనటుల రెమ్యునరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఇక హీరోయిన్ దీపికా పదుకొణె అందుకుంటున్న మొత్తం తెలిస్తే షాక్ అవాల్సిందే.
Deepika Padukone: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక చిత్రం 'రాకా'. అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా, తాజాగా బడ్జెట్, నటీనటుల రెమ్యునరేషన్ వివరాలతో మరోసారి వార్తల్లో నిలిచింది. ఇండియన్ సినిమాలోనే అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కుతున్న చిత్రాలలో ‘రాకా’ ఒకటి. ఈ సినిమా కోసం దీపికా పదుకొణె కళ్లు చెదిరే రెమ్యునరేషన్ అందుకుంటుందని తెలిసింది.

దీపికా పదుకొణె రెమ్యునరేషన్
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘రాకా’ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్. ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆమె మరోసారి పలకరించనుంది. ఈ సినిమా కోసం దీపికా పదుకొణె 25 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తోంది. దీని కోసం ఆమెకు సుమారు 5 కోట్ల రూపాయలు అందుతున్నట్లు టాక్.
భారీ బడ్జెట్..
రాకా సినిమాను సుమారు 700 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇంతటి భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ సినిమాలో నటీనటుల రెమ్యునరేషన్ లు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. తాజా నివేదికల ప్రకారం, ఈ ప్రాజెక్ట్ కోసం అల్లు అర్జున్ ఏకంగా రూ.175 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో బన్నీ కేవలం ఒకే పాత్రకు పరిమితం కాకుండా, మూడు విభిన్న గెటప్స్‌లో కనిపించనున్నాడు. ఒక పోలీస్ ఆఫీసర్‌గా, సగం మనిషి సగం రాక్షసుడి రూపంలో, అలాగే ఒక తండ్రి పాత్రలో అల్లు అర్జున్ నటన అద్భుతంగా ఉండబోతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఫస్ట్ లుక్
అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన 'రాకా' ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాను ఊపేసింది. ఈ పోస్టర్ సినిమాపై ఉన్న క్యూరియాసిటీని రెట్టింపు చేసింది. సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్, దీపికా పదుకొణె, రష్మిక మందన్న కాకుండా మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి స్టార్స్ కూడా కీలక పాత్రల్లో మెరిసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ముంబైలో తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది పొడవునా చిత్రీకరణ కొనసాగించి, 2026 చివరి నాటికి సినిమాను పూర్తి చేయాలని చిత్ర యూనిట్ లక్ష్యంగా పెట్టుకుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 'రాకా' సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయం.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: 'రాకా' సినిమాలో అల్లు అర్జున్ ఎన్ని పాత్రల్లో కనిపిస్తారు?
అల్లు అర్జున్ ఈ చిత్రంలో పోలీస్, సగం మనిషి-సగం రాక్షసుడు, తండ్రిగా మొత్తం మూడు విభిన్న పాత్రల్లో కనిపిస్తారని సమాచారం.
ప్రశ్న: ఈ సినిమా బడ్జెట్ ఎంత?
'రాకా' చిత్రాన్ని సుమారు 700 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.
ప్రశ్న: ఈ చిత్రంలో దీపికా పదుకోణె రెమ్యునరేషన్ ఎంత?
రిపోర్ట్స్ ప్రకారం, దీపికా పదుకొణె ఈ సినిమా కోసం 25 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


