Chennai Love Story: కిరణ్ అబ్బవరం స్పీడు మామూలుగా లేదు.. చెన్నై లవ్ స్టోరీ రికార్డు ప్రీరిలీజ్ బిజినెస్.. రూ.42 కోట్లా?

Chennai Love Story: కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియ లీడ్ రోల్స్ లో నటిస్తున్న చెన్నై లవ్ స్టోరీ రికార్డు స్థాయి ప్రీరిలీజ్ బిజినెస్ తో ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తోంది. అతని కెరీర్లోనే అత్యధికంగా రూ.42 కోట్ల బిజినెస్ జరగడం విశేషం.

Published on: Jul 13, 2026, 14:50:23 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Chennai Love Story: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం బాక్సాఫీస్ దగ్గర తన లేటెస్ట్ మూవీ 'చెన్నై లవ్ స్టోరీ'తో మునుపెన్నడూ లేని రేంజ్‌లో ప్రీ-రిలీజ్ బిజినెస్ నమోదు చేసి ట్రేడ్ వర్గాలను షాక్‌కు గురిచేస్తున్నాడు. రీసెంట్ హిట్స్‌తో సాలిడ్ ఫామ్‌లోకి వచ్చిన ఈ యంగ్ ప్రామిసింగ్ యాక్టర్.. జులై 24న థియేటర్లలోకి రాబోతున్న తన కొత్త సినిమాతో టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి రెడీ అయ్యాడు. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమాకు బిజినెస్ పరంగా భారీ ఆఫర్స్ వచ్చాయి.

Chennai Love Story: కిరణ్ అబ్బవరం స్పీడు మామూలుగా లేదు.. చెన్నై లవ్ స్టోరీ రికార్డు ప్రీరిలీజ్ బిజినెస్.. రూ.42 కోట్లా?
Chennai Love Story: కిరణ్ అబ్బవరం స్పీడు మామూలుగా లేదు.. చెన్నై లవ్ స్టోరీ రికార్డు ప్రీరిలీజ్ బిజినెస్.. రూ.42 కోట్లా?

ఏరియాల వారీగా థియేట్రికల్ రైట్స్ లెక్కలు

కిరణ్ అబ్బవరం మార్కెట్ స్టామినా ఏ స్థాయిలో ఉందో నిరూపిస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మైండ్ బ్లోయింగ్ థియేట్రికల్ డీల్స్ కుదిరాయి. ఆంధ్ర ఏరియా రైట్స్ ఏకంగా రూ.8 కోట్ల రేషియోలో క్లోజ్ అవ్వగా, రాయలసీమ (సీడెడ్) బిజినెస్ రూ.3 కోట్ల రేషియోలో ఫైనల్ అయింది. టాలీవుడ్‌కు గుండెకాయ లాంటి నైజాం ఏరియా రైట్స్ కూడా భారీ స్థాయిలో రూ.8 కోట్లకు అమ్ముడుపోయాయి.

తెలుగు రాష్ట్రాలే కాకుండా ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమాకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఓవర్సీస్ థియేట్రికల్ బిజినెస్ రూ.4 కోట్లకు డీల్ కుదిరింది. ఇందులో రూ.1 కోటి రికవరీ ఆప్షన్ కూడా ఉంది. ఈ లెక్కన కేవలం థియేట్రికల్ రైట్స్ ద్వారానే ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ.23 కోట్ల గ్రాండ్ టోటల్‌ను టచ్ చేసింది.

నాన్-థియేట్రికల్ బిజినెస్‌లో 'బేబి' మ్యాజిక్

ఈ చెన్నై లవ్ స్టోరీ నాన్-థియేట్రికల్ రైట్స్‌కు ఊహించని రేంజ్‌లో రేటు పలకడం వెనుక ఒక ఇంట్రెస్టింగ్ రీజన్ ఉంది. ఈ చిత్ర నిర్మాతలు సాయి రాజేష్, ఎస్కేఎన్ గతంలో టాలీవుడ్‌లో కల్ట్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'బేబి' సినిమాను నిర్మించారు. ఆ నమ్మకంతోనే ప్రముఖ మ్యూజిక్ లేబుల్ టీ-సిరీస్ (T-Series) ఈ సినిమా ఆడియో రైట్స్‌ను ఏకంగా రూ.5 కోట్లకు సొంతం చేసుకుంది. మణిశర్మ మ్యూజిక్ కావడంతో ఇప్పటికే రిలీజైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

దీనికి తోడు డిజిటల్ రైట్స్ పరంగా కూడా ఈ సినిమా సాలిడ్ డీల్ సెట్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను రూ.14 కోట్లకు లాక్ చేసింది. హిందీ డబ్బింగ్, శాటిలైట్ రైట్స్ డీల్స్ ఇంకా క్లోజ్ అవ్వాల్సి ఉంది. అవి కూడా పూర్తయితే ఈ నంబర్ ఇంకా పెరుగుతుంది. ప్రస్తుతానికి మొత్తం ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ.42 కోట్లకు చేరి కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే ఆల్‌టైమ్ హయ్యెస్ట్ రికార్డ్ సెట్ చేసింది.

బాక్సాఫీస్ దగ్గర తలపడనున్న విజయ్ 'జన నాయగన్'

అయితే జులై 24 రిలీజ్ డేట్ దగ్గర ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. అదే రోజు కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు సీఎం విజయ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'జన నాయగన్' థియేటర్లలోకి వస్తోంది. రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో వెళ్లే ముందు విజయ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న చివరి సినిమా కావడంతో తమిళనాడుతో పాటు ఓవర్సీస్ మార్కెట్లలో ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఈ రెండు సినిమాలు ఒకే రోజు క్లాష్ అయితే మాత్రం ఓపెనింగ్స్ కలెక్షన్లపై ఆ ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉంది. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీ సర్కిల్స్‌లో మాత్రం 'చెన్నై లవ్ స్టోరీ' కంటెంట్ పై సూపర్ పాజిటివ్ బజ్ నడుస్తోంది. కిరణ్ అబ్బవరం కచ్చితంగా ఈ సినిమాతో మరో వన్ మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More