Lokesh Kanagaraj: ఒక్క ఫొటోతో పుకార్లన్నింటికీ చెక్ పెట్టిన లోకేష్ కనగరాజ్.. అల్లు అర్జున్‌తో మూవీపై సూపర్ అప్డేట్
Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ మూవీ అటకెక్కిందా? ఈ పుకార్లకు తాజాగా లోకేష్ ఓ ఫొటోతో చెక్ పెట్టారు. ఇన్‌స్టాలో బన్నీతో లోకేష్ ఉన్న ఫొటో అది. ఇప్పుడీ ఫొటో, దానికి పెట్టిన క్యాప్షన్ వైరల్ అవుతున్నాయి.
Lokesh Kanagaraj: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రాబోతున్నట్లు ఎప్పుడో అనౌన్స్‌మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించి ఊహించని వార్తలు చక్కర్లు కొట్టాయి.

ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోయిందని, లోకేష్ కనగరాజ్ చెప్పిన నెరేషన్ బన్నీకి నచ్చకపోవడంతో ఈ కాంబినేషన్ క్యాన్సిల్ అయిందంటూ పెద్ద ఎత్తున రూమర్స్ వైరల్ అయ్యాయి. అంతేకాకుండా అల్లు అర్జున్ ఇప్పటికే ఇతర దర్శకుల కథలు వినడం మొదలుపెట్టారని జోరుగా ప్రచారం జరిగింది.
రూమర్లకు చెక్ పెట్టిన లోకేష్
ఈ నేపథ్యంలో జరుగుతున్న ప్రచారానికి దర్శకుడు లోకేష్ కనగరాజ్ తనదైన శైలిలో చెక్ పెట్టారు. సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్‌తో కలిసి తాను స్టోరీ డిస్కషన్స్‌లో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ అన్ని రూమర్స్‌కు ఫుల్ స్టాప్ పెట్టారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ వస్తాయని ఆయన స్పష్టం చేయడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
లోకేష్ తన ఇన్‌స్టా అకౌంట్లో ఈ ఫొటోను షేర్ చేశారు. దీనికి అల్లు అర్జున్ తోపాటు మూవీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ను కూడా ట్యాగ్ చేశాడు. ఈ ఫొటోలో లోకేష్ చెబుతున్న నెరేషన్ ను బన్నీ చాలా సీరియస్ గా వినడం చూడొచ్చు.
షూటింగ్ ఎందుకు ఆలస్యం అవుతోంది? అసలు విషయం ఇదే
ఈ భారీ ప్రాజెక్ట్ అటకెక్కలేదని, కేవలం షెడ్యూల్స్ కారణంగానే కొద్దిగా సమయం పడుతుందని చిత్ర వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాకా' (Raaka) సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ పూర్తయిన వెంటనే బన్నీ నేరుగా లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టనున్నారు.
ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించనుంది. లోకేష్ కనగరాజ్ తనదైన ట్రేడ్‌మార్క్ యాక్షన్, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ఈ కథను సిద్ధం చేస్తుండటంతో టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించిన అఫీషియల్ అప్‌డేట్ రానుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


