Raaka Guinness Record: అల్లు అర్జున్ ‘రాకా’ 37 సీక్రెట్ ఇదే.. గిన్నిస్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన ఐకాన్ స్టార్ మూవీ
Raaka Guinness Record: అల్లు అర్జున్ రాకా మూవీ గిన్నిస్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. మోషన్ క్యాప్చర్ లో ఒకేసారి 37 మందిని షూట్ చేసి ఈ రికార్డును సొంతం చేసుకోవడం విశేషం. బన్నీతోపాటు అట్లీ ఈ అవార్డును అందుకున్నారు.
Raaka Guinness Record: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న 'రాకా' (Raaka) సినిమా రిలీజ్‌కు ముందే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. లేటెస్ట్‌గా ఈ మూవీ టీమ్ హాలీవుడ్ రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్ ప్రయోగంతో ఏకంగా 'గిన్నిస్ వరల్డ్ రికార్డ్' సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది.

రివీల్ అయిన '37' మిస్టరీ.. మోషన్ క్యాప్చర్‌లో గిన్నిస్ రికార్డ్
డైరెక్టర్ అట్లీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్‌ను మేకర్స్ రివీల్ చేశారు. కొద్దిరోజుల క్రితం '37' నంబర్‌తో ఒక సస్పెన్స్ పోస్టర్ రిలీజ్ చేసి సోషల్ మీడియాలో విపరీతమైన క్యూరియాసిటీ పెంచారు. ఇప్పుడు ఆ 37 సీక్రెట్ ఏంటో అఫీషియల్‌గా అనౌన్స్ చేసి ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చారు.
ఒకేసారి 37 మంది నటీనటులను రియల్ టైమ్‌లో 'మోషన్ క్యాప్చర్' (Motion Capture) టెక్నాలజీతో షూట్ చేసి రాకా టీమ్ ఈ అరుదైన గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా గతంలో ఈ రికార్డు కేవలం 19 మందిని ఒకేసారి క్యాప్చర్ చేయడంతో ఉండేది. ఇప్పుడు ఆ రికార్డును రాకా సినిమా డబుల్ మార్జిన్‌తో బ్రేక్ చేసింది.
పాన్ ఇండియా బాక్సాఫీస్‌పై కన్నేసిన సన్ పిక్చర్స్
ఈ అద్భుతమైన ఫీట్‌కు గుర్తింపుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీలకు అఫీషియల్ సర్టిఫికెట్ అందజేశారు. ఇండియన్ సినిమా హిస్టరీలో వీఎఫ్ఎక్స్ (VFX) వర్క్స్ పరంగా ఇదొక పెద్ద మైలురాయి అని చెప్పాలి. షారుఖ్ ఖాన్‌తో 'జవాన్' లాంటి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ తర్వాత అట్లీ డైరెక్ట్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ అయిన సన్ పిక్చర్స్ ఈ పాన్ ఇండియా ప్రాజెక్టును అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇందులో గ్లోబల్ స్టార్ దీపికా పదుకోన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ లాంటి స్టార్ హీరోయిన్స్ నటిస్తుండటం ప్రాజెక్ట్‌కి మరింత క్రేజ్ తీసుకొచ్చింది.
బన్నీ ఫ్యాన్స్‌కు విజువల్ ఫీస్ట్ ఖాయం
పుష్ప సిరీస్‌తో గ్లోబల్ వైడ్ ఇమేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్, ఈ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో ఆడియన్స్‌కు ఒక అన్‌రియల్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతున్నారు. భారీ తారాగణం, వరల్డ్ క్లాస్ విజువల్స్, అట్లీ మార్క్ మాస్ ఎలివేషన్స్‌తో వస్తున్న 'రాకా' బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో అని టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ఈ మూవీపై ఉన్న అంచనాలను పెంచేస్తూ ఈ మధ్యే తమిళ డైరెక్టర్ సిబి చక్రవర్తి.. రాకాలోని విజువల్స్ పై ప్రశంసలు కురిపించారు. ఇందులోని విజువల్స్ తాను అవతార్ మూవీలోనూ చూడలేదని, మూడు రోజుల్లో మీరే చూస్తారంటూ ఓ హైప్ క్రియేట్ చేశారు. అయితే అది ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డే అని తాజాగా తేలింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


