Raaka: అసలు అట్లీ ఏం ప్లాన్ చేస్తున్నాడు? షారుఖ్ ఖాన్, విల్ స్మిత్-నలుగురు హీరోయిన్లు-పీక్స్‌కు అల్లు అర్జున్ రాకా హైప్!
Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లోనే ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ ‘రాకా’. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో వస్తున్న రాకాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తాజాగా ఈ చిత్రంలో హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ నటించనున్నాడనే వార్తలతో హైప్ పీక్స్ కు చేరింది. అట్లీ ఏం ప్లాన్ చేస్తున్నాడు?
Raaka: పుష్ప ఫ్రాంఛైజీతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు ప్రపంచస్థాయిలో మార్మోగింది. ఈ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర రికార్డు స్థాయి కలెక్షన్లు తెచ్చిపెట్టాయి. అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇలాంటి మూవీ తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న సినిమా ‘రాకా’. దీనిపై అంచనాలు మామూలుగా లేవు. అందుకు తగ్గట్లే డైరెక్టర్ అట్లీ ప్లాన్ బ్లాక్ బస్టర్ అనేలా ఉందనే టాక్ వినిపిస్తోంది.

రాకాపై హైప్
పుష్ప సినిమాల తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న మూవీ కావడంతో సాధారణంగానే ‘రాకా’పై హైప్ నెలకొంది. కానీ ఆ తర్వాత మూవీ నుంచి వస్తున్న అప్ డేట్లు, రూమర్ల కారణంగా ఆ హైప్ పీక్స్ కు చేరుతుంది. అల్లు అర్జున్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో మైండ్ బ్లోయింగ్ సర్ ప్రైజ్ లను అట్లీ ప్లాన్ చేసినట్లు టాక్.
హాలీవుడ్ స్టార్ హీరో
విల్ స్మిత్.. హాలీవుడ్ లో తిరుగులేని స్టార్ హీరో. తన సినిమాలతో రికార్డులు తిరగరాస్తుంటాడు. అలాంటి హీరోను ఇప్పుడు రాకా కోసం అట్లీ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడనే టాక్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో మంట పుట్టించింది. ఈ ప్రచారం ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
విలన్ గా
రాకా మూవీ కోసం విల్ స్మిత్ తో చర్చలు జరుగుతున్నాయనే టాక్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది. ఇక ఈ సినిమాలో విల్ స్మిత్ ఏకంగా విలన్ రోల్ ప్లే చేస్తారనే ప్రచారం ఇంకా వైరల్ గా మారింది. ఒకవేళ ఇదే నిజమై.. విల్ స్మిత్ రాకా మూవీలో విలన్ గా నటిస్తే మూవీ రేంజ్ మాత్రం మరో లెవల్ కు వెళ్లిపోతుంది.
షారుఖ్ ఖాన్ క్యామియో
ఇక రాకా మూవీలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటిస్తున్నారనే ప్రచారం ఎప్పటి నుంచో వినిపిస్తోంది. కింగ్ ఖాన్ తో ‘జవాన్’ తీసిన అట్లీ.. ఈ రాకాలో షారుఖ్ ను నటించేలా ఒప్పించాడనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒకే ఫ్రేమ్ లో అల్లు అర్జున్, షారుఖ్ ఖాన్, విల్ స్మిత్ కనిపిస్తే మాత్రం ఆ క్రేజ్ మామూలుగా ఉండదు.
నలుగురు హీరోయిన్లు
రాకా సినిమా గురించి వినిపిస్తున్న మరో ఇంట్రెస్టింగ్ గాసిప్ ఏంటంటే.. ఇందులో నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారని తెలిసింది. దీపికా పదుకొణె ఇప్పటికే షూటింగ్ లో పాల్గొంటుంది. ఇక రష్మిక మందన్న, జాన్వీ కపూర్, కాజల్ అగర్వాల్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారనే రూమర్లు జోరందుకున్నాయి.
ప్లాన్ ఏంటీ?
పుష్ప సినిమాలతో అల్లు అర్జున్ రేంజ్ పెరిగింది. అందుకే ఆ క్రేజ్ ను పక్కాగా ఉపయోగించుకోవడం కోసం రాకాను ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గా మార్చడానికి అట్లీ ట్రై చేస్తున్నాడని అంటున్నారు. అందుకే దీపికా పదుకొణె, షారుఖ్ ఖాన్ ద్వారా హిందీ బెల్ట్ లో రాకాను టాక్ ఆఫ్ ది టౌన్ గా మార్చొచ్చని ప్లాన్ వేశాడని తెలిసింది.
ఇక ఇప్పుడేమో విల్ స్మిత్ తో చర్చలు జరుపుతున్నాడనే వార్తల నేపథ్యంలో రాకాను అంతర్జాతీయ సినీ ఇండస్ట్రీలో ట్రెండింగ్ టాపిక్ గా మార్చేందుకు అట్లీ ప్రయత్నిస్తున్నాడని చెప్పొచ్చు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


