Vijay Sethupathi: అల్లు అర్జున్ డైరెక్టర్ నిర్మాతగా పూరీ జగన్నాథ్ హీరో సినిమా.. అట్లీ- విజయ్ సేతుపతి క్రేజీ కాంబో!

Vijay Sethupathi Atlee: కోలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్ కుదిరింది. అల్లు అర్జున్ హీరోగా రాకా సినిమాను తెరకెక్కిస్తున్న దర్శకుడు అట్లీ నిర్మాతగా మారాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో స్లమ్ డాగ్ చేస్తున్న విజయ్ సేతుపతితో కలిసి నిర్మాతగా అట్లీ మూవీ చేస్తున్నాడు. ఈ అనౌన్స్ మెంట్ వైరల్ గా మారింది. 

Published on: Aug 12, 2026, 13:05:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Vijay Sethupathi Atlee: ‘నడువుల కొంజం పక్కత కాణోమ్', 'సీతాకాతి' వంటి కల్ట్ అండ్ సంచలన చిత్రాల తర్వాత మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi), దర్శకుడు బాలాజీ తరణీధరన్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతోంది. ఈ క్రేజీ కాంబోలో వస్తున్న మూడో చిత్రానికి 'బత్తా' (Baththaa) అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అనౌన్స్‌మెంట్ చేశారు.

అల్లు అర్జున్ డైరెక్టర్ నిర్మాతగా పూరీ జగన్నాథ్ హీరో సినిమా.. అట్లీ- విజయ్ సేతుపతి క్రేజీ కాంబో! (x/VijaySethuOffl)
అల్లు అర్జున్ డైరెక్టర్ నిర్మాతగా పూరీ జగన్నాథ్ హీరో సినిమా.. అట్లీ- విజయ్ సేతుపతి క్రేజీ కాంబో! (x/VijaySethuOffl)

ప్రొడ్యూసర్ గా అట్లీ

సౌత్ తో పాటు బాలీవుడ్‌లో వరుస హిట్లు కొడుతున్న స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) ఈ బత్తా చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తుండడం విశేషం. తన స్వంత బ్యానర్ 'ఏ ఫర్ యాపిల్ ప్రొడక్షన్స్' (A For Apple Production) తో పాటు ప్రియా అట్లీ, మురాద్ ఖేతానీ, ఆలోక్ జైన్, అజిత్ అంధారేలతో కలిసి అట్లీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అంతే కాకుండా విజయ్ సేతుపతి హీరోగా వస్తున్న బత్తాకు బాలీవుడ్ సపోర్ట్ కూడా దొరికింది. బాలీవుడ్‌కు చెందిన దిగ్గజ నిర్మాణ సంస్థలు స్టార్ స్టూడియోస్, సినీ1 స్టూడియోస్ ఈ ప్రాజెక్ట్‌తో భాగస్వామ్యం కావడం విశేషం.

ట్రెండింగ్ మ్యూజిక్ సెన్సేషన్

బత్తా మూవీ అనౌన్స్ మెంట్ తోనే హైప్ ను పీక్స్ కు తీసుకెళ్లింది. ఈ చిత్రంలో నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ‘జై భీమ్’ చిత్రంలో తన నటనతో మెప్పించిన నటి లిజోమోల్ జోస్ (Lijomol Jose) ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు.

అలాగే ప్రస్తుతం సౌత్ ఇండియన్ మ్యూజిక్ వర్గాల్లో వైరల్ హిట్లతో సంచలనం సృష్టిస్తున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సై అభ్యంకర్ (Sai Abhyankkar) ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నాడు. ఆర్ట్ డైరెక్టర్ ముత్తురాజ్, సినిమాటోగ్రాఫర్ సెల్వకుమార్ ఎస్.కె, ఎడిటర్ కలైవాణన్ ఈ ప్రాజెక్ట్‌కి పనిచేస్తున్నారు.

రిలీజ్ డేట్

బత్తా మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు రిలీజ్ డేట్ ను కూడా మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 1, 2026 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. కాగా, ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix India) దక్కించుకుంది.

విజయ్ సేతుపతి - బాలాజీ తరణీధరన్‌ల కాంబినేషన్‌లో రాబోతున్న ఈ మూడో చిత్రం కోలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్‌లోనూ మంచి అంచనాలను నెలకొల్పింది.

అల్లు అర్జున్ తో

బత్తా సినిమాను నిర్మిస్తున్న అట్లీ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా రాకా మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ముంబయిలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. మరోవైపు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న స్లమ్ డాగ్ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More