Allu Arjun: రోడ్డుపై వెళ్తుంటే ఎవరూ గుర్తుపట్టేవాళ్లు కాదు.. ఇప్పుడు నడవలేకపోతున్నా.. రాకా షూటింగ్ నుంచే: అల్లు అర్జున్
Allu Arjun: గంగోత్రి సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు గ్లోబల్ సెన్సేషన్. పుష్ఫ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ఈ హీరో.. తాజాగా తన కెరీర్ గురించి చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. వైజాగ్ లో ఏఏఏ సినిమాస్ థియేటర్ ను బన్నీ ఓపెన్ చేశాడు.
Allu Arjun: ప్రతి హీరోకు ఓ బ్రేక్ వస్తుంది. ఒక్క సాలిడ్ బ్లాక్ బస్టర్ తో జీవితమే మారిపోతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు కూడా పుష్ప సినిమాలతో ఆ రేంజ్ టర్నింగ్ పాయింట్ దక్కింది. గంగోత్రితో ప్రారంభించిన అల్లు అర్జున్.. ఇప్పుడు వరల్డ్ వైడ్ గా గుర్తింపు పొందాడు.

అల్లు సినిమాస్
ఓ వైపు నటుడిగా అదరగొడుతూనే థియేటర్ బిజినెస్ లోనూ అల్లు అర్జున్ దూసుకెళ్తున్నాడు. హైదరాబాద్ లో ఇప్పటికే అల్లు సినిమాస్ థియేటర్ పాపులర్ అయింది. ఇప్పుడు ఆ ఏఏఏ సినిమాస్ థియేటర్ ను వైజాగ్ లో స్టార్ట్ చేశారు. ఆదివారం (ఆగస్టు 9) జరిగిన ఈ థియేటర్ ఓపెనింగ్ సెర్మనీకి అల్లు అర్జున్ స్వయంగా వెళ్లాడు.
రోడ్డుపై తిరిగినా
అల్లు సినిమాస్ ఓపెనింగ్ సందర్భంగా అల్లు అర్జున్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. ‘‘గంగోత్రి సినిమా సమయంలో వైజాగ్ రోడ్లపై తిరిగేవాణ్ని. కానీ ఎవరూ గుర్తు పట్టేవాళ్లు కాదు. కానీ ఇప్పుడు అసలు రోడ్డుపై నడవలేకపోతున్నా’’ అని అల్లు అర్జున్ వెల్లడించాడు. ఫ్యాన్స్ ప్రేమతో తన లైఫ్ ఎలా మారిపోయిందోనని అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు.
రాకా అప్డేట్
వైజాగ్ లో అల్లు సినిమాస్ థియేటర్ ఓపెనింగ్ ఈవెంట్లో తన అప్ కమింగ్ మూవీ రాకా గురించి కూడా అల్లు అర్జున్ మాట్లాడాడు. ‘‘రాకా షూటింగ్ నుంచే వచ్చా. బాంబేలో షూటింగ్ జరుగుతోంది. థియేటర్ ఓపెనింగ్ ఉంది, మా వాళ్లను కలవాలని ఒక రోజు పర్మిషన్ తీసుకొని వచ్చా’’ అని అల్లు అర్జున్ చెప్పాడు.
ఫ్యాన్స్ కు ఫొటో
అల్లు సినిమాస్ థియేటర్ ఓపెనింగ్ ఈవెంట్లో బన్నీ చేసిన ఓ పనికి ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ఫ్యాన్స్ ఒక్క ఫొటో అని అడగ్గానే.. అందరినీ స్టేజీ దగ్గరకు పిలిపించుకున్నాడు అల్లు అర్జున్. ఆ అందరితో కలిసి సెల్ఫీ తీసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.
వండర్ ఫుల్ సిటీ
అల్లు సినిమాస్ థియేటర్ ఓపెనింగ్ తర్వాత సోషల్ మీడియాలో బన్నీ తన ఆనందాన్ని పంచుకున్నాడు.
‘‘ఈ వండర్ ఫుల్ సిటీకి అల్లు సినిమాస్ ను తీసుకొచ్చినందుకు నిజంగా సంతోషంగా ఉంది. నా హార్ట్ లో వైజాగ్ కు ఎప్పుడూ స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఇప్పుడు కొత్త జర్నీని ఇక్కడ స్టార్ట్ చేయడం మరింత స్పెషల్ గా మారింది. ఎంతో ప్రేమతో స్పెషల్ మూవీ ఎక్స్ పీరియన్స్ అందించడం కోసం ప్రయత్నిస్తున్నాం’’ అని అల్లు అర్జున్ తన ఎక్స్ అకౌంట్లో రాసుకొచ్చాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


