Allu Cinemas: అల్లు సినిమాస్.. 75 అడుగుల భారీ డాల్బీ సినిమా స్క్రీన్.. ఆసియాలోనే అతి పెద్దది.. టికెట్ల ధర ఇలా..
Allu Cinemas: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ అల్లు సినిమాస్ ప్రారంభానికి సిద్ధమైంది. హైదరాబాద్ లోని కోకాపేటలో ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్ తో వస్తున్న ఈ సినిమాస్ టికెట్ల ధరలు రివీల్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
హైదరాబాద్ కు మరో కళ్లు చెదిరే మల్టీప్లెక్స్ వస్తోంది. ఈసారి అల్లు అర్జున్ దానిని తీసుకొస్తున్నాడు. అల్లు సినిమాస్ పేరుతో కోకాపేటలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఈ మల్టీప్లెక్స్ లో ఏకంగా 75 అడుగుల వెడల్పుతో ఉన్న భారీ డాల్బీ స్క్రీన్ సిద్ధంగా ఉంది. ఇండియాలో మూడో డాల్బీ స్క్రీన్ కాగా.. ఆసియాలోనే అతి పెద్దది కావడం విశేషం.

అల్లు సినిమాస్ విశేషాలు
అల్లు అర్జున్, అల్లు అరవింద్ కలిసి నిర్మించిన అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్ ఒక సినిమా హాల్ మాత్రమే కాదు ఇదొక విజువల్ వండర్ అని చెప్పవచ్చు. ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్ ఇక్కడ ఉంది. 75 అడుగుల వెడల్పు గల డాల్బీ సినిమా (Dolby Cinema) స్క్రీన్ పై మూవీ ఎక్స్‌పీరియల్స్ మరో లెవెల్లో ఉండనుంది.
ఇది డాల్బీ విజన్ 3D ప్రొజెక్షన్, డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. అంటే సినిమాలో కలర్స్ మరింత స్పష్టంగా, సౌండ్ మరింత రియలిస్టిక్‌గా ఉంటాయి. స్టేడియం తరహా సీటింగ్, పిచ్-బ్లాక్ ఆడిటోరియం, అల్ట్రా-లగ్జరీ సోఫాలతో ప్రేక్షకులు రాజభోగం అనుభవిస్తూ సినిమా చూడవచ్చు.
అల్లు సినిమాస్ ఓపెనింగ్ ఎప్పుడంటే?
ఈ మల్టీప్లెక్స్ ప్రారంభానికి అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మార్చి 12న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ థియేటర్ ప్రారంభం కానుంది. ఈ వేడుకకు అల్లు అర్జున్, ఇతర మెగా కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు.
ప్రారంభోత్సవం తర్వాత కొన్ని రోజులు టెక్నికల్ టెస్టింగ్ నిర్వహించి, ఉగాది సందర్భంగా మార్చి 19 నుండి సాధారణ ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తుంది. ధురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి సినిమాలతో ఈ మల్టీప్లెక్స్ ను ప్రారంభించబోతున్నారు.
అల్లు సినిమాస్ టికెట్ల ధర
అల్లు సినిమాస్ లో మొత్తం నాలుగు స్క్రీన్లు ఉండగా.. అందులో ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్ ఒకటి. అయితే ఇందులో స్పెషల్ ధరలు ఉంటాయని భావించినా.. ప్రస్తుతానికి సాధారణ రేట్లతోనే అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. అంటే సాధారణ సీట్లకు రూ.295, రిక్లెయినర్లకు రూ.350గా నిర్ణయించారు. ఇవి ఏఎంబీ మల్టీప్లెక్స్ లోని ధరలే.
అయితే ఇండియాలోని పుణె, బెంగళూరులో ఉన్న మరో రెండు డాల్బీ స్క్రీన్లలో మాత్రం ధరలు రూ.500 నుంచి రూ.1000 మధ్య ఉంటున్నాయి. ఇక్కడా అవే ధరలు ఉండే అవకాశం ఉందనీ వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇంకా స్పష్టత లేదు. త్వరలోనే BookMyShow, ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో టికెట్ల బుకింగ్ అందుబాటులోకి వస్తుంది.
ఇది కోకాపేటలోని అల్లు స్టూడియోస్ (Allu Studios) ఆవరణలోనే ఉంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నార్సింగి, గండిపేట పరిసరాల్లో ఉండే ఐటీ ఉద్యోగులకు, సినీ ప్రేక్షకులకు అల్లు సినిమాస్ ఓ ప్రత్యేక ఆకర్షణ కాబోతోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


