Vijay Rashmika: విజయ్ దేవరకొండ మీసం సరిచేసిన రష్మిక మందన్న.. క్యూట్ మూమెంట్ వెనుక అసలు కథ.. రణబాలిపై హైప్.. వీడియో వైరల్

Vijay Rashmika: స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తెలంగాణలోని తుమ్మనపేట గ్రామంలో సందడి చేశారు. మెరిటోరియస్ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించిన ఈ వేడుకలో ఇద్దరి మధ్య జరిగిన ఒక క్యూట్ మూమెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో రణబాలిపై హైప్ పెరిగింది.

Published on: Jun 15, 2026, 09:04:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Vijay Rashmika: స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య క్యూట్ రొమాంటిక్ మూమెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. తన భార్య రష్మికతో కలిసి సొంత గ్రామం తుమ్మనపేటకు వచ్చాడు విజయ్. అక్కడ 180 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించారు. ఈ ఈవెంట్ లో ఇద్దరి మధ్య జరిగిన ఒక రొమాంటిక్ మూమెంట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది.

విజయ్ దేవరకొండ మీసం సరిచేసిన రష్మిక మందన్న.. క్యూట్ మూమెంట్ వెనుక అసలు కథ
విజయ్ దేవరకొండ మీసం సరిచేసిన రష్మిక మందన్న.. క్యూట్ మూమెంట్ వెనుక అసలు కథ

భర్త మీసం సరిచేసి

ఈ ఈవెంట్ జరుగుతున్న సమయంలో స్థానికుల రద్దీ పెరగడంతో కాస్త ఉక్కపోత వాతావరణం నెలకొంది. ఆ హడావుడిలో స్టేజ్ మీదే విజయ్ దేవరకొండ నుదుటిపై ఉన్న చెమటను రష్మిక ఒక టిష్యూ పేపర్‌తో తుడిచింది. ఆ సమయంలోనే తన భర్త మీసాలను సరిచేస్తూ రష్మిక మందన్న మురిపెంగా తల ఊపిన విజువల్స్ నెట్టింట 'క్యూట్ కపుల్ గోల్స్' అంటూ మారుమోగిపోతున్నాయి.

రూట్స్ వెతుక్కుంటూ

ఆదివారం (జూన్ 14) విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ ఫ్యామిలీతో కలిసి నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని తుమ్మనపేట గ్రామానికి వెళ్లారు. ఇది విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధన్ రావు పుట్టిన ఊరు. కేవలం ఒక విజిట్ లా కాకుండా, అక్కడ 45 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 180 మంది 9, 10 తరగతుల విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ప్రత్యేక స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని వీరు ప్రారంభించారు.

రణబాలిపై హైప్

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీళ్లిద్దరు కలిసి నటిస్తున్న ‘రణబాలి’ మూవీపై హైప్ మరింత పెరిగింది. 'గీత గోవిందం' (2018), 'డియర్ కామ్రేడ్' (2019) చిత్రాల తర్వాత విజయ్, రష్మిక కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ఇది.

పెళ్ళి తర్వాత ఫస్ట్ ఫిల్మ్

వివాహం తర్వాత విజయ్, రష్మిక స్క్రీన్ షేర్ చేసుకుంటున్న మొదటి ప్రాజెక్ట్ రణబాలి కావడంతో ఆడియన్స్ లో క్యూరియాసిటీ పీక్స్ లో ఉంది. రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా థియేట్రికల్ అండ్ శాటిలైట్ రైట్స్ కోసం టాలీవుడ్ లో గట్టి పోటీ నడుస్తోంది.

క్రేజీ కపుల్

టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం ఈ ఏడాది ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్ వేదికగా జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ లో రిసెప్షన్ నిర్వహించారు. అప్పటి నుంచి ఈ జంట పేరు రెట్టింపు స్థాయిలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. కేవలం ఇన్ స్టాగ్రామ్ ఫోటోలకే పరిమితం కాకుండా, పెళ్ళి తర్వాత ఈ జంట ఎంచుకుంటున్న పబ్లిక్ ప్రొఫైల్ ఇప్పుడు పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.

People Also Ask- తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

Q1. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మ్యారేజ్ ఎప్పుడు జరిగింది?

జవాబు: వీరి వివాహం ఈ ఏడాది ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ సమీపంలో గల ఒక లగ్జరీ రిసార్ట్‌లో కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ప్రైవేట్‌గా జరిగింది.

Q2. విజయ్, రష్మికల 'రణబాలి' సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు?

జవాబు: రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో విజయ్-రష్మిక లీడ్ రోల్స్ లో నటిస్తున్న 'రణబాలి' చిత్రం సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది.

Q3. విజయ్ దేవరకొండ తండ్రి సొంత ఊరు ఏది?

జవాబు: తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలానికి చెందిన తుమ్మనపేట గ్రామం విజయ్ దేవరకొండ తండ్రి సొంత ఊరు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More