Rashmika Mandanna: శ్రీవల్లి అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్.. గ్లోబల్ స్టేజ్‌పై రష్మిక మందన్న రచ్చ.. హాలీవుడ్ స్టార్‌తో
Rashmika Mandanna: శ్రీవల్లి అంటే నేషనల్ అనుకుంటిరా, కాదు ఇంటర్నేషనల్. గ్లోబల్ రేంజ్ లో రష్మిక మందన్న క్రేజ్ అలా ఉంది మరి. జపాన్ లో జరిగిన ఓ అవార్డు ఫంక్షన్ ఈవెంట్లో ఈ నేషనల్ క్రష్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.
Rashmika Mandanna: తనదైన నటన, అందంతో ‘నేషనల్ క్రష్’గా గుర్తింపు తెచ్చుకున్న నటి రష్మిక మందన్న, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలోనూ అదరగొడుతోంది. జపాన్ రాజధాని టోక్యో నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన అంతర్జాతీయ ‘క్రాంచీరోల్ యానిమే అవార్డ్స్ 2026’ (Crunchyroll Anime Awards 2026) వేడుకలో ఆమె పాల్గొంది. ఈ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

రష్మిక మందన్న రచ్చ
నేషనల్ క్రష్ రష్మిక మందన్న క్రేజ్ ఇంటర్నేషనల్ స్థాయికి ఎగబాకింది. క్రాంచీరోల్ యానిమే అవార్డ్స్ 2026 ఈవెంట్లో అవార్డు ఇచ్చేందుకు రష్మికకు స్పెషల్ ఇన్విటేషన్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ రంగాల ప్రముఖులు, అగ్ర శ్రేణి కళాకారులు హాజరైన ఈ అట్టహాస వేడుకలో రష్మిక మందన్న ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఆ హాలీవుడ్ స్టార్ తో కలిసి
గ్లోబల్ స్టార్ల సమక్షంలో ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించిన రష్మిక, హాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘బ్లాక్ పాంథర్’ ఫేమ్ విన్‌స్టన్ డ్యూక్‌తో కలిసి వేదికపై సందడి చేసింది. వీరిద్దరూ కలిసి ఈ వేడుకలో అత్యంత ప్రతిష్టాత్మకమైన “బెస్ట్ యానిమేషన్ ఆఫ్ ది ఇయర్” (Best Animation of the Year) అవార్డును అందజేశారు. వారు వేదికపైకి రాగానే అక్కడి ప్రేక్షకులు పెద్ద ఎత్తున కేకలు వేస్తూ, చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.
రష్మిక పోస్ట్
తాజాాగా జపాన్ లో జరిగిన ఈ ఈవెంట్ కు సంబంధించిన ఫొటోలను రష్మిక మందన్న తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. వీటికి 15 గంటల్లోనే 1.7 మిలియన్ కు పైగా లైక్స్ వచ్చాయి. కామెంట్లతో నెటిజన్లు మోత మోగిస్తున్నారు. ఈ పిక్స్ తెగ వైరల్ గా మారాయి.
విన్‌స్టన్ డ్యూక్ ప్రశంసలు
అవార్డుల ఈవెంట్ సందర్భంగా హాలీవుడ్ నటుడు విన్‌స్టన్ డ్యూక్ సోషల్ మీడియా వేదికగా రష్మిక మందన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. అంతటి భారీ అంతర్జాతీయ వేదికను ఆమెతో కలిసి పంచుకోవడం తనకు ఎంతో గర్వంగా అనిపించిందని పేర్కొన్నాడు. ఆయన పెట్టిన పోస్ట్ ఇంటర్నెట్‌లో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఒక భారతీయ నటి, హాలీవుడ్ అగ్ర నటుడితో ఈ స్థాయిలో ఇంటరాక్ట్ అవ్వడం, ఒకరినొకరు గౌరవించుకోవడం నిజంగా చాలా స్పెషల్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
రికార్డులు
ఈ ఏడాది జరిగిన క్రాంచీరోల్ యానిమే అవార్డ్స్ సరికొత్త రికార్డులను నమోదు చేసింది. నిర్వాహకుల లెక్కల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 73 మిలియన్ల (7.3 కోట్లు) కంటే ఎక్కువ మంది యానిమే అభిమానులు ఆన్‌లైన్ ద్వారా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ అవార్డుల చరిత్రలోనే ఇది అత్యంత ప్రజాదరణ పొందిన ఎడిషన్‌గా నిలిచింది.
గ్లోబల్ రాపర్ ‘యంగ్ మికో’తో పాటు పాపులర్ కే-పాప్ (K-pop) తారలు బామ్‌బామ్, టెన్ వంటి సెలబ్రిటీలు ఈవెంట్ కు ప్రత్యేకంగా హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా వినోద పరిశ్రమలో, ముఖ్యంగా యువత సంస్కృతిలో యానిమే ఎంత వేగంగా ప్రజాదరణ పొందుతోందో చెప్పడానికి విభిన్న పరిశ్రమల నుండి వచ్చిన ఈ అంతర్జాతీయ నటుల భాగస్వామ్యమే నిదర్శనం.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
1. టోక్యోలో జరిగిన ఏ అంతర్జాతీయ వేడుకలో రష్మిక మందన్న పాల్గొంది?
నటి రష్మిక మందన్న జపాన్‌లోని టోక్యో నగరంలో జరిగిన ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ‘క్రాంచీరోల్ యానిమే అవార్డ్స్ 2026’ వేడుకలో పాల్గొంది.
2. రష్మిక మందన్న ఏ హాలీవుడ్ నటుడితో కలిసి వేదికను పంచుకుంది?
మార్వెల్ సూపర్ హిట్ చిత్రం ‘బ్లాక్ పాంథర్’ ఫేమ్ హాలీవుడ్ నటుడు విన్‌స్టన్ డ్యూక్‌తో కలిసి రష్మిక మందన్న వేదికను పంచుకుంది.
3. క్రాంచీరోల్ యానిమే అవార్డ్స్ 2026 ఓటింగ్‌లో ఎంతమంది పాల్గొన్నారు?
ఈ ఏడాది జరిగిన అవార్డుల వేడుక కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 73 మిలియన్ల (7.3 కోట్లకు పైగా) యానిమే అభిమానులు ఓట్లు వేశారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


