Vijay Rashmika: సల్మాన్ ఖాన్ పాటలకు రష్మిక మందన్న క్రేజీ డ్యాన్స్-వెడ్డింగ్ పార్టీలో ఏం జరిగిందంటే? అందరితో అగ్రిమెంట్
Vijay Rashmika: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి జరిగి నెల రోజులు గడిచిపోతున్నా, దీనికి సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. వీరి వెడ్డింగ్ పార్టీలో బాలీవుడ్ పాటలకు రష్మిక చేసిన సందడి గురించి సెలబ్రిటీ డీజే గణేష్ తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.
Vijay Rashmika: టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉదయ్‌పూర్‌లో అత్యంత వైభవంగా, సన్నిహితుల సమక్షంలో జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ పెళ్లికి సంబంధించిన ముచ్చట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పెళ్లి తర్వాత జరిగిన గ్రాండ్ పార్టీలో రష్మిక మందన్న చేసిన రచ్చ గురించి సెలబ్రిటీ డీజే గణేష్ తాజాగా వెల్లడించాడు.

బాలీవుడ్ పాటలకు రష్మిక స్టెప్పులు
ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డీజే గణేష్ మాట్లాడుతూ.. రష్మిక మందన్నకు బాలీవుడ్ పాటలంటే ఎంత ఇష్టమో వివరించాడు. "నిజానికి ఇది సౌత్ ఇండియన్ వెడ్డింగ్ కాబట్టి నేను వేరే రకమైన మ్యూజిక్ అనుకున్నా. కానీ రష్మికకు హిందీ పాటలంటే విపరీతమైన క్రేజ్. అందుకే నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించారు.
రష్మిక తన ఫేవరెట్ సాంగ్ 'సామీ సామీ'తో పాటు సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ సాంగ్స్ 'ముజ్సే షాదీ కరోగీ', 'జీనే కే చార్ దిన్' వంటి పాటలకు ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేసింది. అది వారి పెళ్లి వేడుకల్లో చివరి సెలబ్రేషన్ కావడంతో అందరూ ఎంతో ఎంజాయ్ చేశారు" అని గణేష్ వెల్లడించాడు.
అగ్రిమెంట్
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ వివాహం గురించి తనకు గత ఏడాది డిసెంబర్‌లోనే తెలుసని, అయితే పెళ్లి వివరాలు బయటకు రాకుండా ఉండేందుకు తమతో ఎన్డీఏ (Non-Disclosure Agreement) పై సంతకాలు చేయించుకున్నారని గణేష్ పేర్కొన్నాడు.
ఫోన్లకు అనుమతి
చాలా మంది సెలబ్రిటీల పెళ్లిళ్లలో ఫోన్లపై ఆంక్షలు ఉంటాయి కానీ, విజయ్-రష్మిక వివాహంలో మాత్రం అలాంటివేమీ లేవని గణేష్ చెప్పాడు. "నా దగ్గర ఫోన్ ఉన్నా నేను ఫోటోలు తీయనని వారికి నమ్మకం ఉంది. సెలబ్రిటీ పార్టీలలో ప్రైవసీకి వారు ఇచ్చే ప్రాముఖ్యత నాకు తెలుసు" అని అతను వివరించాడు.
రెండు సంప్రదాయాలు
విజయ్, రష్మికలు 2018లో వచ్చిన 'గీత గోవిందం' సినిమా సెట్స్‌లో మొదటిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత 'డియర్ కామ్రేడ్' చిత్రంలోనూ కలిసి నటించారు. అప్పటి నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు వచ్చినా, పెళ్లి వరకు ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు.
ఉదయ్‌పూర్‌లో విజయ్ కుటుంబానికి చెందిన తెలుగు సంప్రదాయాలు, రష్మిక కుటుంబానికి చెందిన కొడవ (కూర్గ్) సంప్రదాయాలను మేళవించి పెళ్లి నిర్వహించారు. పెళ్లి అనంతరం ఈ జంట అభిమానులకు మిఠాయిలు పంచడమే కాకుండా, ప్రత్యేకంగా మీట్ అండ్ గ్రీట్ నిర్వహించి ఫ్యాన్స్‌ను కలుసుకుంది.
మళ్ళీ షూటింగ్‌లోకి!
మార్చి 4న హైదరాబాద్‌లో విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ జరిగింది. ఈ ఈవెంట్ కు రామ్ చరణ్, అల్లు అర్జున్, కృతి సనన్, కరణ్ జోహార్ వంటి ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ప్రస్తుతం రష్మిక, విజయ్ మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న 'రణబాలి' చిత్రంలో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఈ చిత్రం 2026, సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి ఎక్కడ జరిగింది?
జవాబు: వీరి వివాహం ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వైభవంగా జరిగింది.
ప్రశ్న: పెళ్లి తర్వాత ఈ జంట చేస్తున్న సినిమా ఏది?
జవాబు: మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో, రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో వస్తున్న 'రణబాలి' చిత్రంలో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు.
ప్రశ్న: వీరి వివాహం ఏ సంప్రదాయంలో జరిగింది?
జవాబు: ఈ పెళ్లిలో విజయ్ తరపు తెలుగు సంప్రదాయాలు రష్మిక తరపు కొడవ (కూర్గ్) పద్ధతులు రెండింటినీ పాటించారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


