Virosh Record: మెస్సీ, రొనాల్డో రికార్డులను బ్రేక్ చేసిన విజయ్-రష్మిక జోడీ.. సోషల్ మీడియాలో 'రణబాలి' జంట సంచలనం!
Virosh Record: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న క్రేజ్ సోషల్ మీడియాలో సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. మెస్సీ, రొనాల్డో వంటి గ్లోబల్ స్టార్లను వెనక్కి నెట్టి ఈ జోడీ ఇన్ స్టాగ్రామ్ లైక్స్‌లో ప్రపంచ రికార్డులను తిరగరాస్తోంది.
Virosh Record: టాలీవుడ్ సెన్సేషనల్ పెయిర్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వెండితెరపైనే కాదు, డిజిటల్ ప్రపంచంలోనూ తిరుగులేని క్రేజ్ తో దూసుకుపోతున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీకి అభిమానులు బ్రహ్మరథం పడుతుంటారు. తాజాగా ఈ క్రేజ్ ప్రపంచస్థాయి రికార్డులను బద్దలు కొడుతోంది. ఈ జంట కలిసి నటించిన యాడ్లు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.

రష్మిక, విజయ్ యాడ్
ఇటీవల రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ కలిసి నటించిన 'ఎయిర్ బీఎన్బీ' (Airbnb) ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ యాడ్ పోస్ట్‌కు ఇప్పటివరకు ఏకంగా 9.1 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్ స్టాగ్రామ్ లో అత్యధిక లైక్స్ పొందిన రెండో ప్రకటనగా ఇది రికార్డు సృష్టించింది. కేవలం ఒక జోడీకి ఇంతటి స్థాయిలో ఆదరణ లభించడం డిజిటల్ మార్కెటింగ్ రంగంలో చర్చనీయాంశంగా మారింది.
నంబర్ వన్ రికార్డ్ కూడా
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన రికార్డు కూడా విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న జోడీ పేరునే ఉంది. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన 'మాన్యవర్' (Manyavar) వెడ్డింగ్ క్యాంపెయిన్ యాడ్ 11.5 మిలియన్లకు పైగా లైక్స్ సాధించి గ్లోబల్ రికార్డు నెలకొల్పింది. ఈ వీడియోకు ఏకంగా 104 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం విశేషం.
మెస్సీ, రొనాల్డోలను వెనక్కి నెట్టి..
సాధారణంగా ఫుట్‌బాల్ దిగ్గజాలు లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోలకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఫాలోవర్లు ఉంటారు. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన 'లూయిస్ విట్టన్' ప్రకటన భారీ రికార్డులను నమోదు చేసింది. అయితే భారతీయ సినీ తారలైన విజయ్, రష్మిక తమ 'మాన్యవర్' ప్రకటనతో ఈ ఫుట్‌బాల్ స్టార్ల రికార్డులను కూడా అధిగమించి గ్లోబల్ టాప్ పొజిషన్‌కు చేరుకున్నారు.
రణబాలి మూవీలో
ప్రస్తుతం ఈ క్రేజీ జోడీ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ 'రణబాలి' అనే పీరియడ్ యాక్షన్ డ్రామాలో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. వెండితెరపై వీరిద్దరూ మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 11, 2026న రిలీజ్ కానుంది. విజయ్, రష్మిక కలిసి చేస్తున్న మూడో సినిమా ఇది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: ఇన్ స్టాగ్రామ్‌లో విజయ్-రష్మిక జోడీ ఏ రికార్డును నెలకొల్పింది?
జవాబు: ప్రపంచవ్యాప్తంగా ఇన్ స్టాగ్రామ్ యాడ్ పోస్ట్‌లలో అత్యధిక లైక్స్ సాధించిన మొదటి రెండు స్థానాలను ఈ జంట దక్కించుకుంది. మాన్యవర్ యాడ్‌కు 11.5 మిలియన్లు, ఎయిర్ బీఎన్బీ యాడ్‌కు 9.1 మిలియన్ల లైక్స్ వచ్చాయి.
ప్రశ్న: ఏ గ్లోబల్ స్టార్ల రికార్డులను వీరు బ్రేక్ చేశారు?
జవాబు: ఫుట్‌బాల్ ప్రపంచ దిగ్గజాలు లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో నటించిన లూయిస్ విట్టన్ యాడ్ రికార్డులను విజయ్-రష్మిక జోడీ అధిగమించింది.
ప్రశ్న: వీరిద్దరూ కలిసి నటిస్తున్న తాజా సినిమా ఏది?
జవాబు: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రస్తుతం 'రణబాలి' అనే పీరియడ్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


